ముఖ్య విజ్ఞానశాస్త్ర సంస్థల తో సమావేశాన్ని గురించి ట్వీట్ లలో వివరించిన ప్రధాన మంత్రి
July 08th, 03:57 pm
కేంద్రం నిధుల తో నడుస్తున్న సాంకేతిక సంస్థల కు చెందిన 100 మంది కి పైగా డైరెక్టర్ ల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను నిర్వహించిన సమావేశం ముగిశాక, దేశం లోని ప్రముఖ సైన్స్, టెక్నాలజీ సంస్థలు ఆ సమావేశం లో ఇచ్చిన నివేదికల వివరాలను ప్రజలకు తెలియజేశారు. ప్రధాన మంత్రి తన ట్వీట్ లలో ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి ముంబయి, ఐఐటి చెన్నై, ఐఐటి కాన్ పుర్ లను గురించి పేర్కొన్నారు.కేంద్ర నిధుల తో నడుస్తున్న సాంకేతిక సంస్థ ల డైరెక్టర్ లతో సమావేశమైన ప్రధాన మంత్రి
July 08th, 02:30 pm
కేంద్ర నిధుల అండదండల తో నడుస్తున్న సాంకేతిక విజ్ఞాన సంస్థ ల డైరెక్టర్ లతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జులై 8న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. 100కు పైగా సంస్థల అధిపతులు ప్రధాన మంత్రి తో పాటు ఈ సంభాషణ లో పాల్గొన్నారు.