జి-20 విద్య మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వీడియోమాధ్యం ద్వారా ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం పాఠం
June 22nd, 11:00 am
జి-20 విద్య శాఖ మంత్రుల సమావేశాని కి గాను భారతదేశాని కి మిమ్ముల ను నేను ఆహ్వానిస్తున్నాను. విద్య మన నాగరకత కు ఆధారభూతమైన పునాది ఒక్కటే కాదు, అది మానవ జాతి భవిష్యత్తు కు వాస్తుశిల్పి గా కూడా ను ఉంది. విద్య మంత్రులు గా, అందరి కి అభివృద్ధి, అందరి కి శాంతి మరియు అందరి కి సమృద్ధి లను సాధించి పెట్టడం కోసం మనం చేస్తున్నటువంటి ప్రయాసల లో మానవ జాతి కి నాయకత్వం వహిస్తున్నటువంటి శెర్ పా గా మీరు ఉన్నారు. భారతదేశం యొక్క ధర్మ గ్రంథాల లో విద్య తాలూకు భూమిక ను ఆనందాన్ని ప్రసాదించేది అభివర్ణించడం జరిగింది. అది ‘‘విద్యా దదాతి వినయమ్, వినయద్ యాతి పాత్రతామ్. పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మం, తతః సుఖమ్.’’ అని చెబుతుంది. ఈ మాటల కు ‘‘సిసలైనటువంటి జ్ఞానం అణకువ ను ఇస్తుంది. వినమ్రత నుండి యోగ్యత వస్తుంది. పాత్రత ఏ వ్యక్తి కి అయినా సంపద ను ప్రాప్తింప జేస్తుంది. సంపద ఏ వ్యక్తి ని అయినా సత్కార్యాల ను చేసే శక్తి ని అనుగ్రహిస్తుంది. మరి ఇదే ఆనందాన్ని కొనితెస్తుంది.’’ అని భావం. ఈ కారణం గా భారతదేశం లో మేం ఒక సమగ్రమైనటువంటి మరియు విస్తృత మైనటువంటి యాత్ర కు శుభారంభం చేశాం. మన యువతీ యువకుల కు మౌలిక అక్షరాస్యత అనేది ఒక బలమైన ఆధారం గా నిలుస్తుంది అని మేం విశ్వసిస్తున్నాం. మరి మేం దీని ని సాంకేతిక విజ్ఞానం తో కూడాను జోడిస్తున్నాం. దీనికి గాను మేం ‘‘నేశనల్ ఇనిశియేటివ్ ఫార్ ప్రఫిశన్సి ఇన్ రీడింగ్ విద్ అండర్ స్టాండింగ్ ఎండ్ న్యూమరసి’’ లేదా ‘‘నిపుణ్ భారత్’’ కార్యక్రమాన్ని ఆరంభించాం. ‘‘మౌలిక అక్షరాస్యత మరియు అంక జ్ఞానం’’ .. ఈ రెంటి ని మీ యొక్క సమూహం సైతం ప్రాధాన్య అంశం గా గుర్తించినందుకు నేను సంతోషిస్తున్నాను. మనం 2030 వ సంవత్సరాని కల్లా కాలబద్ధ రీతి లో దీని పై కృషి చేయాలి అనే ఒక సంకల్పాన్ని చెప్పుకొని తీరాలి.జి20 విద్యా మంత్రుల సమావేశం ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం
June 22nd, 10:36 am
సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, విద్య అనేది మన నాగరికతకు పునాది మాత్రమే కాదు, మానవత్వం భవిష్యత్తు రూపురేఖలను తీర్చిదిద్దేది అని అన్నారు. ప్రధాన మంత్రి విద్యా మంత్రులను షెర్పాలు అని ప్రస్తావిస్తూ, అభివృద్ధి, శాంతి, అందరి శ్రేయస్సు కోసం మానవజాతి కృషిలో వారు నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. ఆనందాన్ని తీసుకురావడంలో విద్య పాత్ర కీలకమని భారతీయ గ్రంథాలు వివరిస్తున్నాయని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. 'నిజమైన జ్ఞానం వినయాన్ని ఇస్తుంది, వినయం నుండి యోగ్యత వస్తుంది, యోగ్యత నుండి సంపద వస్తుంది, సంపద మనిషికి సత్కార్యాలు చేయడానికి వీలు కల్పిస్తుంది ఇదే సంతోషాన్ని ఇస్తుంది' అని అర్థం వచ్చే సంస్కృత శ్లోకాన్ని వినిపించారు ప్రధాన మంత్రి. సంపూర్ణ, సమగ్ర ప్రయాణం సాగిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ‘అండర్‌స్టాండింగ్, న్యూమరాసీతో చదవడంలో నైపుణ్యం కోసం జాతీయ చొరవ’ లేదా ‘నిపున్ భారత్’ చొరవను ఆయన ప్రస్తావించారు. ‘ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరాసీ’ని జి20 కూడా ప్రాధాన్యతగా గుర్తించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 2030 నాటికి నిర్దిష్ట కాలానుగుణంగా పని చేయాలని కూడా ఆయన నొక్కి చెప్పారు.నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి నిగౌరవించుకోవడం కోసం పరాక్రమ్ దివస్ నాడు పార్లమెంటు లో ఏర్పాటు అయిన ఒక కార్యక్రమంలో పాలుపంచుకోవడాని కి ఎంపికైన యువజనుల తో ‘మీ నేత ను గురించి తెలుసుకోండి’ కార్యక్రమం లో భాగం గా 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో సమావేశమైనప్రధాన మంత్రి
January 23rd, 08:03 pm
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి గౌరవార్థం పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఈ రోజు న ఏర్పాటైన ఒక కార్యక్రమం లో పాలుపంచుకోవడాని కి ఎంపిక అయిన యువజనుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమై, ‘నో యువర్ లీడర్’ (‘మీ నేత ను గురించి తెలుసుకోండి’) అనే కార్యక్రమం లో భాగం గా మాట్లాడారు. ఈ సంభాషణ ఆయన నివాసం అయిన 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో జరిగింది.జులై 4వ తేదీ నాడు భీమవరం మరియు గాంధీనగర్ నుసందర్శించనున్న ప్రధాన మంత్రి
July 01st, 12:16 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం జులై 4వ తేదీ నాడు ఆంధ్ర ప్రదేశ్ లోని భీమవరం ను మరియు గుజరాత్ లోని గాంధీనగర్ ను సందర్శించనున్నారు. ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ను ప్రధాన మంత్రి భీమవరం లో ఇంచుమించు ఉదయం 11 గంటల వేళ లో ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాలు ఏడాది పొడవునా జరుగుతాయి. దీని తరువాత సాయంత్రం సుమారు 4:30 గంటల కు ప్రధాన మంత్రి గాంధీ నగర్ లో ‘డిజిటల్ ఇండియా వీక్ 2022’ ను ప్రారంభిస్తారు.జాతీయ విద్యా విధానం 2020 తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
July 29th, 05:54 pm
నమస్కారం! ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న నా మంత్రివర్గ సహచరులు, గౌరవనీయులైన రాష్ట్రాల గవర్నర్లు, గౌరవనీయ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు నా ప్రియమైన యువ సహచరులు అందరూ!జాతీయ విద్యా విధానం-2020 మొదటి వార్షికోత్సవం సందర్భంగా విద్యారంగానికి చెందిన సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి
July 29th, 05:50 pm
జాతీయ విద్యా విధానం 2020 కింద సంస్కరణలు చేపట్టి ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్య, నైపుణ్యాభివృద్ధి రంగానికి చెందిన విధాన రూపకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు. విద్యా రంగంలో పలు కార్యక్రమాలను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు.