గయానాలోని భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
November 22nd, 03:02 am
మీ అందరితో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనతోపాటు ఇక్కడకు వచ్చినందుకు ముందుగా ఇర్ఫాన్ అలీ గారికి కృతజ్ఞతలు. వచ్చినదగ్గర నుంచీ నాపట్ల మీరు చూపిన ఆదరాభిమానాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నన్ను ఇంటికి ఆహ్వానించిన అధ్యక్షులు అలీ గారికి కృతజ్ఞతలు. నన్ను ఆత్మీయుడిగా భావించిన వారి కుటుంబానికి కూడా కృతజ్ఞతలు. ఆతిధిమర్యాదలు మన సంస్కృతిలో అంతర్భాగం. గత రెండు రోజులుగా ఇదే జ్ఞాపకానికి వస్తోంది. అధ్యక్షులు అలీగారు, వారి మామ్మగారు కూడా మొక్క నాటారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరుతో మేం చేపట్టిన ఉద్యమంలో అది భాగం. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటడం అని దానికి అర్థం. ఈ భావోద్వేగ క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.గయానాలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం గయానాలోని ప్రవాస భారతీయులు అనేక రంగాలను ప్రభావితం చేస్తూ గయానా అభివృద్ధికి దోహదపడ్డారు: ప్రధానమంత్రి
November 22nd, 03:00 am
గయానాలోని జార్జ్ టౌన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గయానా అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ, ప్రధాని మార్క్ ఫిలిప్స్, ఉపాధ్యక్షుడు భర్రాత్ జగ్దేవ్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ రామోతార్ తదితరులు పాల్గొన్నారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ అధ్యక్షుడికి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తన రాక సందర్భంగా ప్రత్యేక ఆప్యాయతతో ఘనస్వాగతం పలకడంపై హర్షం వ్యక్తం చేశారు. తనపై చూపిన ఆప్యాయతానురాగాలపై అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. “ఆతిథ్య స్ఫూర్తి మన సంస్కృతికి కేంద్ర బిందువు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడు, ఆయన మామ్మగారితో కలిసి తాను ఓ మొక్క నాటానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయే భావోద్వేగభరితమైన క్షణాలన్నారు.గయానా అధ్యక్షుడితో భారత ప్రధాని అధికారిక చర్చలు
November 21st, 04:23 am
జార్జ్ టౌన్ లో ఉన్న స్టేట్ హౌజ్ లో డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. స్టేట్ హౌజ్ కు చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు అలీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గౌరవ వందనాన్ని స్వీకరించారు.Be it COVID, disasters, or development, India has stood by you as a reliable partner: PM in Guyana
November 21st, 02:15 am
PM Modi and Grenada PM Dickon Mitchell co-chaired the 2nd India-CARICOM Summit in Georgetown. PM Modi expressed solidarity with CARICOM nations for Hurricane Beryl's impact and reaffirmed India's commitment as a reliable partner, focusing on development cooperation aligned with CARICOM's priorities.భారత్- కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశం
November 21st, 02:00 am
భారత్-కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశాన్ని జార్జ్‌టౌన్‌లో నిన్న నిర్వహించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కరికమ్ కు ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న గ్రెనడా ప్రధాని శ్రీ డికన్ మిషెల్‌లు ఈ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించారు. శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీకి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. భారత్- కరికమ్ తొలి శిఖరాగ్ర సమావేశాన్ని 2019లో న్యూయార్క్ లో నిర్వహించారు. గయానా అధ్యక్షుడు, గ్రెనెడా ప్రధానిలకు తోడు శిఖరాగ్ర సమావేశంలో పాలుపంచుకొన్నా వారిలో..చిలీ దేశాధ్యక్షుడితో ప్రధానమంత్రి శ్రీ మోదీ భేటీ
November 20th, 08:36 pm
బ్రెజిల్ దేశ రాజధాని రియో డి జనీరోలో ఏర్పాటైన జి-20 సమావేశాల నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న చిలీ దేశపు అధ్యక్షుడు శ్రీ గాబ్రియల్ బోరిక్ ఫాంట్ తో తొలిసారి భేటీ అయ్యారు.పాలనలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధ, ఇంకా డేటాల వినియోగంపై ప్రకటన
November 20th, 07:52 am
ప్రపంచ వృద్ధి 3 శాతాని కంటే కాస్త ఎక్కువ మాత్రమే నమోదయింది. ఇది ఈ శతాబ్దం మొదలైన తరువాత నుంచి చూస్తే అత్యంత తక్కువ. మహమ్మారికి ముందు కాలంలో ఇది సగటున సుమారు 4 శాతం గా ఉండింది. దీనికి తోడు, టెక్నాలజీ ఊహించినదాని కంటే వేగంగా వెళుతోంది. టెక్నాలజీని సమాన స్థాయిలలో న్యాయబద్ధంగా ఉపయోగించుకోవడం ద్వారా వృద్ధిని పెంచడానికీ, అసమానతలను తగ్గించడానికీ, స్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీస్) సాధనలో అంతరాన్ని పూడ్చే దిశలో ఒక పెద్ద అడుగు వేయడానికీ ఒక చరిత్రాత్మక అవకాశాన్ని మనకు అందిస్తుంది.పాలనలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధ, డేటా: అప్పుడే ప్రపంచ ప్రజ జీవితాల్లో మార్పు, అందరికీ అభివృద్ధి: ప్రధానమంత్రి
November 20th, 05:04 am
అభివృద్ధి ఫలాలను అందరికీ అందించడానికి, ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవనంలో పెనుమార్పులను తీసుకు రావడానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను, కృత్రిమ మేధను, డేటాను పాలనలో వినియోగించుకోవడం ముఖ్యమని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రధానంగా చెప్పారు.‘‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’’పై జి20 సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం
November 18th, 08:00 pm
నా ప్రసంగాన్ని మొదలుపెట్టడాని కన్నా ముందు... జి20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి గొప్ప ఏర్పాట్లను చేసినందుకు, అలాగే జి20 కి అధ్యక్ష బాధ్యతలను నిర్వహించడంలో సాఫల్యాన్ని సాధించినందుకు అధ్యక్షుడు శ్రీ లూలా కు నేను అభినందనలు తెలియజేయదలచుకొన్నాను.‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’ అనే అంశాలు ప్రధానంగా జి 20 కార్యక్రమం నిర్వహణ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 18th, 07:55 pm
‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’ అంశాలు ప్రధానంగా ఈ రోజున నిర్వహించిన జి 20 శిఖరాగ్ర సమావేశ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యాన్ని ఇస్తున్నందుకు, అతిథి మర్యాదలు చక్కని పద్ధతిలో చేస్తున్నందుకు బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిస్ ఇనాషియో లూలా డిసిల్వా కు ప్రధాని ధన్యవాదాలు తెలియజేశారు. బ్రెజిల్ లో నిర్వహిస్తున్న జి 20 కార్యక్రమాలు స్థిరాభివృద్ధి లక్ష్యాలపై దృష్టి సారిస్తుండడం ప్రశంసనీయమని ప్రధాని అన్నారు. ఈ వైఖరి అభివృద్ధి చెందుతున్న దేశాలకున్న ఆందోళనలపై శ్రద్ధ వహిస్తూ, న్యూ ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ చేసిన నిర్ణయాలను మరింత ముందుకు తీసుకుపోతోందని ఆయన అన్నారు. జి 20 కూటమికి భారతదేశం అధ్యక్షత వహించిన కాలంలో, ‘‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’’ అంటూ ఇచ్చిన పిలుపు రియో చర్చల్లో కనిపిస్తోందని ఆయన అన్నారు.18వ ఆసియా-పసిఫిక్ ప్రాంత జర్మనీ వాణిజ్య సదస్సు (ఏపీకే 2024)లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
October 25th, 11:20 am
ఆసియా-పసిఫిక్ ప్రాంత జర్మనీ వాణిజ్య సదస్సు అధ్యక్షుడు డాక్టర్ బుష్,అత్యాధునిక డిజిటల్ మార్పుల వైపు అడుగులు: ఆసియాన్-భారత్ సంయుక్త ప్రకటన
October 10th, 05:42 pm
లావో పిడిఆర్‌లోని వియంటియాన్‌లో 10వ తేదీన జరిగిన 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) సభ్య దేశాలు, భారత్ జారీ చేసిన సంయుక్త ప్రకటన...జమైకా ప్రధాని హెచ్.ఇ డాక్టర్. ఆండ్రూ హోల్నెస్ అధికారిక భారత పర్యటన సందర్భంగా (సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు) జరిగిన ఒప్పందాలు
October 01st, 12:30 pm
ఆర్థిక సేవలు, ఉత్పత్తులను అందరికీ అందుబాటులో ఉంచడం, సామాజిక, ఆర్థిక రంగాల్లో పురోగతిని ప్రోత్సహించే లక్ష్యంతో విజయవంతమైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పంచుకునే విషయంలో పరస్పర సహకారంపై భారత్, జమైకా ప్రభుత్వాల తరపున భారత ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, జమైకా ప్రధాన మంత్రి కార్యాలయం మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం.జమైకా ప్రధానితో సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 01st, 12:00 pm
ప్రధానమంత్రి శ్రీ హోల్నెస్, ఆయన ప్రతినిధి బృందాన్ని భారత్‌కు స్వాగతించడం నాకు సంతోషంగా ఉంది. ఇది ఆయనకు తొలి ద్వైపాక్షిక పర్యటన. అందుకే ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యముంది. చాలా కాలంగా ప్రధాని హోల్నెస్ భారతదేశానికి మిత్రులుగా కొనసాగుతున్నారు. చాలా సార్లు ఆయనను కలిసే అవకాశం నాకు లభించింది. ఆయనను కలిసిన ప్రతిసారీ భారత్‌తో సంబంధాల బలోపేతం పట్ల ఆయనకు గల నిబద్ధతను ఆయన ఆలోచనల ద్వారా నేను గ్రహించాను. ఆయన పర్యటన మన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త శక్తిని ఇవ్వడమే కాకుండా మొత్తం కరీబియన్ ప్రాంతంతో మన బంధాన్ని పెంపొందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.Success of Humanity lies in our collective strength, not in the battlefield: PM Modi at UN Summit
September 23rd, 09:32 pm
Prime Minister Narendra Modi addressed the 'Summit of the Future' at the United Nations in New York, advocating for a human-centric approach to global peace, development, and prosperity. He highlighted India's success in lifting 250 million people out of poverty, expressed solidarity with the Global South, and called for balanced tech regulations. He also emphasized the need for UN Security Council reforms to meet global ambitions.Prime Minister’s Address at the ‘Summit of the Future’
September 23rd, 09:12 pm
Prime Minister Narendra Modi addressed the 'Summit of the Future' at the United Nations in New York, advocating for a human-centric approach to global peace, development, and prosperity. He highlighted India's success in lifting 250 million people out of poverty, expressed solidarity with the Global South, and called for balanced tech regulations. He also emphasized the need for UN Security Council reforms to meet global ambitions.అమెరికాలోని న్యూయార్క్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు పాఠం
September 22nd, 10:00 pm
నమస్తే అమెరికా! ఇప్పుడు మన నమస్తే కూడా స్థానికం నుంచి అంతర్జాతీయంగా మారిపోయింది. ఇదంతా మీ వల్లే. భారత్ ను హృదయానికి దగ్గరగా ఉంచుకునే ప్రతి భారతీయుడు దీన్ని సుసాధ్యం చేశాడు.న్యూయార్క్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
September 22nd, 09:30 pm
న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భారీ ఎత్తున హాజరైన ప్రవాస భారతీయులను ఉద్దేశించి సోమవారం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 15,000 మంది ప్రజలు హాజరయ్యారు.విల్మింగ్టన్ డిక్లరేషన్‌పై ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా నేతల సంయుక్త ప్రకటన
September 22nd, 11:51 am
ఈరోజు, అమెరికా అధ్యక్షులు జోసెఫ్ ఆర్.బిడెన్ జూనియర్ తన స్వస్థలమైన డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో ఆతిథ్యమిచ్చిన క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులోఆయనతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో సమావేశమయ్యాం .క్వాడ్ నేతల క్యాన్సర్ మూన్‌షాట్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగ పాఠం
September 22nd, 06:25 am
ముఖ్యమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అధ్యక్షుడు శ్రీ బైడెన్ కు నేను నా హృదయపూర్వక అభినందనలను తెలియ జేస్తున్నాను. తక్కువ ఖర్చులో సమాజంలో అన్ని వర్గాల వారికి అందుబాటులో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించాలన్న మన అందరి నిబద్ధతకు ఇది అద్దం పడుతున్నది. కోవిడ్ మహమ్మారి కాలంలో ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ‘‘క్వాడ్ టీకా మందు’’ కార్యక్రమాన్ని మేం ప్రారంభించాం. మరి ఇక్కడ క్వాడ్ (QUAD)లో గర్భాశయ ముఖద్వారు క్యాన్సర్ వంటి సవాలుకు పరిష్కారాన్ని వెతకాలని మనమంతా కలసి నిర్ణయించాం.