సుప్రీంకోర్టు వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

January 27th, 02:16 pm

సుప్రీంకోర్టు డెబ్బై ఐదవ సంవత్సరాన్ని ఆవిష్కరిస్తూ, డిజిటల్ సుప్రీంకోర్టు నివేదికలు (డిజి ఎస్సిఆర్), డిజిటల్ కోర్టులు 2.0, సుప్రీంకోర్టు కొత్త వెబ్‌సైట్‌తో కూడిన పౌర కేంద్రీకృత సమాచారం, సాంకేతిక కార్యక్రమాలను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించనున్నారు. డిజిటల్ సుప్రీం కోర్ట్ నివేదికలు (ఎస్సిఆర్) సుప్రీంకోర్టు తీర్పులను దేశంలోని పౌరులకు ఉచితంగా, ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచుతుంది. డిజిటల్ ఎస్సిఆర్ ముఖ్య లక్షణాలు ఏమిటంటే, 36,308 కేసులను కవర్ చేస్తూ 1950 నుండి సుప్రీం కోర్ట్ నివేదికల మొత్తం 519 వాల్యూమ్‌లు డిజిటల్ ఫార్మాట్‌లో, బుక్‌మార్క్ చేయబడిన, యూజర్ ఫ్రెండ్లీ, ఓపెన్ యాక్సెస్‌తో అందుబాటులో ఉంటాయి.