జనవరి 3 న ఢిల్లీలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధానమంత్రి
January 02nd, 10:18 am
‘అందరికీ ఇళ్లు’ అనే తన ఆలోచనకు అనుగుణంగా ఢిల్లీలోని అశోక్ విహార్లో నిర్మించిన స్వాభిమాన్ గృహసముదాయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శిస్తారు. యథాస్థానంలో మురికివాడ పునరావాస ప్రాజెక్టులో భాగంగా జుగ్గీ జోప్రి (జేజే) క్లస్టర్ల నివాసితుల కోసం వీటిని నిర్మించారు. జనవరి 3, 2025న దాదాపుగా మధ్యాహ్నం 12.10 గంటలకు వీటిని ప్రధాని సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.