'మన్ కీ బాత్' శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన యాంకర్లు: ప్రధాని మోదీ

'మన్ కీ బాత్' శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన యాంకర్లు: ప్రధాని మోదీ

September 29th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంతో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇది చాలా పాత జ్ఞాపకాలతో నన్ను చుట్టుముట్టింది. కారణం మన 'మన్ కీ బాత్' ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. పదేళ్ల కిందట విజయదశమి పర్వదినమైన అక్టోబర్ 3వ తేదీన 'మన్ కీ బాత్' ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన ‘మన్ కీ బాత్’ పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటుంది. యాదృచ్ఛికంగా అది నవరాత్రుల మొదటి రోజు కావడం విశేషం.

297 పురాత‌న వ‌స్తువుల‌ను భార‌త్‌కు తిరిగిచ్చిన అమెరికా

297 పురాత‌న వ‌స్తువుల‌ను భార‌త్‌కు తిరిగిచ్చిన అమెరికా

September 22nd, 12:11 pm

భార‌త్‌, అమెరికా మ‌ధ్య స‌న్నిహిత ద్వైపాక్షిక సంబంధాల‌కు అనుగుణంగా ఉన్న‌త‌మైన‌ సాంస్కృతిక అవ‌గాహ‌న‌ను పెంపొందించుకోవ‌డానికి జూలైలో సాంస్కృతిక సంపద ఒప్పందం కుదిరింది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విద్య‌, సాంస్కృతిక వ్య‌వ‌హారాల బ్యూరో, భార‌త ప్ర‌భుత్వంలోని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో గ‌ల‌ భార‌తీయ పురావ‌స్తు స‌ర్వేక్ష‌ణ విభాగం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సాంస్కృతిక వార‌స‌త్వాన్ని ప‌రిర‌క్షించేందుకు స‌హ‌కారాన్ని పెంపొందించుకోవాల‌ని 2023 జూన్‌లో జ‌రిగిన స‌మావేశం అనంత‌రం అమెరికా అధ్య‌క్షుడు బైడెన్‌, భార‌త ప్ర‌ధాన‌మంత్రి మోదీ చేసిన ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌లోని ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చ‌డంలో భాగంగా ఈ ఒప్పందం జ‌రిగింది.

వాస్తవ పత్రం (ఫ్యాక్ట్ షీట్) : 2024 క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు

వాస్తవ పత్రం (ఫ్యాక్ట్ షీట్) : 2024 క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు

September 22nd, 12:06 pm

సెప్టెంబర్ 21, 2024 న, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ డెలావేర్ లోని విల్మింగ్టన్ లో నాల్గవ క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు కోసం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిడా ఫ్యూమియో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లకు ఆతిథ్యం ఇచ్చారు.

విల్మింగ్టన్ డిక్లరేషన్‌పై ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా నేతల సంయుక్త ప్రకటన

September 22nd, 11:51 am

ఈరోజు, అమెరికా అధ్యక్షులు జోసెఫ్ ఆర్.బిడెన్ జూనియర్ తన స్వస్థలమైన డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో ఆతిథ్యమిచ్చిన క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులోఆయనతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో సమావేశమయ్యాం .

న్యూయార్క్ చేరుకున్న ప్రధాని మోదీ

September 22nd, 11:19 am

డెలావేర్‌లో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ ఫలవంతంగా ముగించుకుని, కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్ చేరుకున్నారు. నగరంలో జరిగే కమ్యూనిటీ ప్రోగ్రామ్ మరియు 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్' వంటి వివిధ కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు.

ఆస్ట్రేలియా ప్ర‌ధాన మంత్రితో శ్రీ నరేంద్ర మోదీ భేటీ

September 22nd, 07:16 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్ర‌ధాన మంత్రి శ్రీ ఆంథోనీ అల్బనీస్‌లు అమెరికాలోని విల్మింగ్టన్‌లో 6వ క్వాడ్ నేతల సదస్సు సందర్భంగా సమావేశమయ్యారు. 2022 మే నుంచి వీరిద్దరూ వ్యక్తిగతంగా కలవడం ఇది తొమ్మిదోసారి.

జపాన్ ప్రధాన మంత్రి శ్రీ ఫ్యూమియో కిషిదాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

September 22nd, 06:01 am

అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 సెప్టెంబర్ 21న డెలావర్ లోని విల్మింగ్టన్ లో క్వాడ్ సమావేశాల సందర్భంగా జపాన్ ప్రధాన మంత్రి శ్రీ ఫ్యూమియో కిషిదాతో భేటీ అయ్యారు.

డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో జరిగిన ఆరో క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి

September 22nd, 05:21 am

ప్ర‌ధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 సెప్టెంబ‌ర్ 21న డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో జ‌రిగిన ఆరో క్వాడ్ నేత‌ల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ బైడెన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి శ్రీ ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధానమంత్రి శ్రీ ఫుమియో కిషిదా పాల్గొన్నారు.

డెలావర్ లోని విల్మింటన్ లో అమెరికా అధ్యక్షునితో ప్రధానమంత్రి సమావేశం

September 22nd, 02:02 am

భారత్ అమెరికాల భాగస్వామ్యానికి ముందుకు తీసుకుపోవడంలో అధ్యక్షుడు శ్రీ బైడెన్ అసమానమైన సేవలను అందించారంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందలు తెలిపారు. అమెరికాలో 2023 జూన్ లో తాను పర్యటించడాన్ని, అదే సంవత్సరం సెప్టెంబరు నెలలో భారతదేశంలో జరిగిన జి-20 నేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి అధ్యక్షుడు శ్రీ బైడెన్ భారత్ కు రావడాన్ని శ్రీ మోదీ ఆప్యాయంగా గుర్తు చేశారు. ఈ పర్యటనలు భారత్- అమెరికా భాగస్వామ్యాన్ని ఉపయోగకరంగా మార్చాయనీ, తగిన వేగాన్నీ అందించాయనీ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.