Today the youth of India is full of new confidence, succeeding in every sector: PM Modi
December 23rd, 11:00 am
PM Modi addressed the Rozgar Mela and distributed more than 71,000 appointment letters to newly appointed youth in Government departments and organisations. PM Modi underlined that in the last one and a half years, around 10 lakh permanent government jobs have been offered, setting a remarkable record. These jobs are being provided with complete transparency, and the new recruits are serving the nation with dedication and integrity.PM Modi distributes more than 71,000 appointment letters to newly appointed recruits
December 23rd, 10:30 am
PM Modi addressed the Rozgar Mela and distributed more than 71,000 appointment letters to newly appointed youth in Government departments and organisations. PM Modi underlined that in the last one and a half years, around 10 lakh permanent government jobs have been offered, setting a remarkable record. These jobs are being provided with complete transparency, and the new recruits are serving the nation with dedication and integrity.Joint Statement: Official visit of Shri Narendra Modi, Prime Minister of India to Kuwait (December 21-22, 2024)
December 22nd, 07:46 pm
PM Modi paid an official visit to Kuwait, at the invitation of His Highness the Amir of the State of Kuwait, Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al-Sabah. During his first visit to the country, PM Modi attended the opening ceremony of the 26th Arabian Gulf Cup as the 'Guest of Honour' and held comprehensive talks to deepen bilateral ties.PM Modi meets Prime Minister of Kuwait
December 22nd, 06:38 pm
PM Modi held talks with His Highness Sheikh Ahmad Al-Abdullah Al-Ahmad Al-Sabah, PM of the State of Kuwait. The two leaders discussed a roadmap to strengthen the strategic partnership in areas including political, trade, investment, energy, defence, security, health, education, technology, cultural, and people-to-people ties.List of Outcomes: Visit of Prime Minister to Kuwait (December 21-22, 2024)
December 22nd, 06:03 pm
During his visit to Kuwait, PM Modi oversaw significant outcomes to strengthen bilateral ties. A Defence Cooperation MoU was signed, a Cultural Exchange Programme (2025-2029) was established and additionally, a Sports Cooperation Programme (2025-2028) was launched. Notably, Kuwait joined the International Solar Alliance, paving the way for collaborative solar energy deployment and low-carbon growth initiatives.భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడిన నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ డిక్ స్కూఫ్
December 18th, 06:51 pm
నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ డిక్ స్కూఫ్ భారత ప్రధానమంత్రి శ్ర నరేంద్ర మోదీతో ఫోన్ లో సంభాషించారు.భారతదేశం – శ్రీలంక సంయుక్త ప్రకటన: ఒక ఉమ్మడి భవిత కోసం భాగస్వామ్యాలను ప్రోత్సహించడం
December 16th, 03:26 pm
శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనూర కుమార దిసనాయక 2024 డిసెంబరు 16న భారతదేశానికి ఆధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంగా న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వారిద్దరూ సమగ్ర, ఫలప్రద చర్చలు జరిపారు.శ్రీలంక అధ్యక్షుడితో కలిసి సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని పత్రికా ప్రకటన
December 16th, 01:00 pm
అధ్యక్షుడు దిసనాయకను హృదయపూర్వకంగా భారత్ కు స్వాగతిస్తున్నాను. అధ్యక్షుడిగా తొలి విదేశీ పర్యటన కోసం మీరు భారత్ ను ఎంచుకోవడం సంతోషాన్నిస్తోంది. అధ్యక్షుడు దిసనాయక పర్యటన మన సంబంధాల్లో పునరుత్తేజాన్ని, శక్తిని నింపింది. మా భాగస్వామ్యం విషయంలో మేం భవిష్యత్ దార్శనికతను అవలంబించాం. మా ఆర్థిక భాగస్వామ్యంలో పెట్టుబడుల ఆధారిత వృద్ధి, అనుసంధానతకు ప్రాధాన్యం ఇచ్చాం. అంతేకాకుండా ఫిజికల్, డిజిటల్, ఎనర్జీ అనుసంధానత మా భాగస్వామ్యంలో ముఖ్యమైన మూలాధారాలుగా ఉండాలని నిర్ణయించాం. ఇరు దేశాల మధ్య విద్యుత్-గ్రిడ్ అనుసంధానత, బహుళ-ఉత్పత్తి పెట్రోలియం పైప్లైన్ల ఏర్పాటు దిశగా కృషి చేస్తాం. శాంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టును వేగవంతం చేస్తాం. దానితోపాటు శ్రీలంక విద్యుత్ ప్లాంట్లకు ఎల్ఎన్ జీని సరఫరా చేస్తాం. ఈటీసీఏను త్వరలోనే పూర్తిచేసి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఇరువైపులా కృషి జరుగుతుంది.హర్యానాలోని పానిపట్లో అభివృద్ధిపనుల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి అనువాదం
December 09th, 05:54 pm
హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రజాదరణ పొందిన హుషారైన నేత శ్రీ నాయబ్ సింగ్ గారు, కేంద్ర మంత్రిమండలిలో నా తోటి సభ్యులైన గౌరవనీయురాలు నిర్మలా సీతారామన్ గారు, ఈ భూమి పుత్రుడు, పార్లమెంటు సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి, అంతేకాకుండా ప్రభుత్వంలో నా సహచరుడైన శ్రీ మనోహర్ లాల్ గారు, శ్రీ కృష్ణ పాల్ గారు, హర్యానా ప్రభుత్వంలో మంత్రులు శృతి గారు, ఆర్తి గారు, ఎంపీలు, ఎమ్ఎల్ఏలు, దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ కేంద్రాలతో అనుబంధం ఉన్న సహచరులందరూ.. నా ప్రియ సోదరులు, సోదరీమణులారా.ఎల్ఐసీ బీమా సఖి యోజన ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
December 09th, 04:30 pm
మహిళా సాధికారతను, ఆర్థిక రంగంలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చిన ‘బీమా సఖి యోజన’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. హర్యానాలోని పానిపట్లో ఈ కార్యక్రమం జరిగింది. అలాగే కర్నాల్ లోని మహారాణా ప్రతాప్ హార్టీకల్చర్ విశ్వవిద్యాలయ ప్రధాన క్యాంపస్ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ ప్రసంగిస్తూ.. మహిళా సాధికారత దిశగా ఈ రోజు మరో ముందడుగు వేశామని అన్నారు. మన గ్రంథాల్లో 9ని పవిత్రమైన అంకెగా భావిస్తారు. నవరాత్రి సమయంలో నవ దుర్గలుగా తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ రోజు 9వ తేదీనే కావడం విశేషం. ఈ రోజు నారీశక్తిని ఆరాధిస్తున్న రోజు కూడా అని ఆయన వివరించారు.పౌర, రక్షణ రంగాల కింద 85 నూతన కేంద్రీయ విద్యాలయాల ప్రారంభానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం:
December 06th, 08:01 pm
కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కీలక నిర్ణయాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయాల ప్రకారం పౌర, రక్షణ రంగాలకు కలిపి 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలు (కేవీ) మంజూరయ్యాయి. పెరిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం కేంద్రీయ విద్యాలయ పథకం (కేంద్ర రంగ పథకం) ద్వారా కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని కేవీ శివమొగ్గలో ప్రతి తరగతికీ రెండు అదనపు సెక్షన్లను మంజూరు చేయాలన్న సీసీఈఏ నిర్ణయం పాఠశాల విస్తరణకు దోహదపడుతుంది. 86 కేవీలతో కూడిన జాబితా దిగువన చూడొచ్చు.సరిహద్దు భద్రతా దళం ఏర్పాటు దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
December 01st, 08:52 am
సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఏర్పాటు దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బీఎస్ఎఫ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రక్షణలో కీలక పాత్రను పోషిస్తూ, ధైర్య-సాహసాలకు, అంకితభావానికి, అసామాన్య సేవకు ప్రతీకగా ఉంటున్నందుకుగాను బీఎస్ఎఫ్ను ఆయన ప్రశంసించారు.సురినామ్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ
November 21st, 10:57 pm
గయానా దేశం జార్జిటౌన్ లో భారత్-కరికామ్ రెండవ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సురినామ్ దేశాధ్యక్షుడు శ్రీ చంద్రికాపర్సాద్ సంతోఖీతో నవంబర్ 20వ తేదీన భేటీ అయ్యారు.భారత్ – ఆస్ట్రేలియా రెండో వార్షిక శిఖరాగ్ర సదస్సు
November 20th, 08:38 pm
రియో డి జనీరో జి-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్న ప్రధానమంత్రి శ్రీ మోదీ, నవంబర్ 19న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీజ్ తో కలిసి భారత్-ఆస్ట్రేలియా రెండో వార్షిక శిఖరాగ్ర సదస్సును నిర్వహించారు. శ్రీ ఆల్బనీజ్ 2023 భారత అధికారిక పర్యటన సందర్భంగా ఈ సదస్సు తొలి విడత సమావేశాలు మార్చి 10వ తేదీన న్యూఢిల్లీలో జరిగాయి.చిలీ దేశాధ్యక్షుడితో ప్రధానమంత్రి శ్రీ మోదీ భేటీ
November 20th, 08:36 pm
బ్రెజిల్ దేశ రాజధాని రియో డి జనీరోలో ఏర్పాటైన జి-20 సమావేశాల నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న చిలీ దేశపు అధ్యక్షుడు శ్రీ గాబ్రియల్ బోరిక్ ఫాంట్ తో తొలిసారి భేటీ అయ్యారు.బ్రెజిల్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ
November 20th, 08:05 pm
రియో డి జనీరో లో జరుగుతున్న జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాకియో లూలా ద సిల్వా తో సమావేశమయ్యారు. శ్రీ లూలా ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని, జి-20, ఐబీఎస్ఏ (భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా కూటమి) అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలియజేశారు. పేదరికం, క్షుద్బాధల నిర్మూలన కోసం ప్రపంచ స్థాయి సహకార సమితిని ప్రారంభించాలన్న శ్రీ లూలా యోచన పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీ మోదీ, సంస్థకు భారత్ సంపూర్ణ మద్దతునిస్తుందని వెల్లడించారు. మూడు దేశాల జి-20 ప్రత్యేక బృందం (ట్రోయికా) సభ్య దేశంగా బ్రెజిల్ జి-20 ఎజెండాకు శ్రీ మోదీ సంపూర్ణ మద్దతును తెలిపారు. జి-20 కార్యాచరణ పత్రంలో సుస్థిరాభివృద్ధి, ప్రపంచ పాలనలో సంస్కరణలు వంటి లక్ష్యాలను పేర్కొనడం సహా అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకు ప్రాముఖ్యాన్నివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వచ్చే యేడాది బ్రెజిల్ చేపట్టనున్న ‘బ్రిక్స్’ సదస్సు, ‘కాప్-30’ అధ్యక్ష బాధ్యతలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ మోదీ, బ్రెజిల్ కు భారత్ సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.Joint Statement: 2nd India-Australia Annual Summit
November 19th, 11:22 pm
PM Modi and Anthony Albanese held the second India-Australia Annual Summit during the G20 Summit in Rio de Janeiro. They reviewed progress in areas like trade, climate, defence, education, and cultural ties, reaffirming their commitment to deepen cooperation. Both leaders highlighted the benefits of closer bilateral engagement and emphasized advancing the Comprehensive Economic Cooperation Agreement (CECA) to strengthen trade and investment ties.ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలితో ప్రధానమంత్రి భేటీ
November 19th, 08:34 am
రియో డి జెనీరో లో జరుగుతున్న జి-20 సమావేశాల నేపథ్యంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలు జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. 2024 జూన్, ఇటలీలోని ‘పూలీయా’ లో జార్జియా మెలోనీ అధ్యక్షతన ఏర్పాటైన జి-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన భేటీ అనంతరం ఇరువురు నేతల మధ్య జరిగిన నేటి సమావేశం గత రెండేళ్ళలో అయిదోది. ఎన్నో సమస్యల మధ్య చేపట్టిన జి-7 అధ్యక్ష పదవికి సమర్ధమైన నేతృత్వం అందిస్తున్నందుకు శ్రీ మోదీ ఇటలీ ప్రధానమంత్రి మెలోనీకి అభినందనలు తెలియజేశారు.PM Modi meets with President of Indonesia
November 19th, 06:09 am
PM Modi and Indonesia’s President Prabowo Subianto met at the G20 Summit in Rio. They discussed strengthening their Comprehensive Strategic Partnership, focusing on trade, defence, connectivity, tourism, health, and people-to-people ties. Both leaders agreed to celebrate 75 years of diplomatic relations in 2024. They also exchanged views on global and regional issues, highlighting the concerns of the Global South and reviewed cooperation within G20 and ASEAN.నైజీరియాలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగం
November 17th, 07:20 pm
మీరు ఈ రోజు అబుజాలో ఉల్లాసమైన వాతావరణాన్ని సృష్టించారు. నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్న ప్రతి అంశాన్ని నేను గమనిస్తున్నాను. నేను అబుజాలో ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. భారత్లోని ఓ నగరంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. లాగోస్, కనో, కడునా, పోర్ట్ హర్కోర్ట్ తదితర విభిన్నమైన ప్రాంతాల నుంచి మీరు అబుజాకి వచ్చారు. మీ ముఖాల్లోని వెలుగు, మీరు చూపిస్తున్న ఉత్సాహం, ఇక్కడకు రావాలనే మీ తపనను తెలియజేస్తున్నాయి. నేను కూడా మిమ్మల్ని కలుసుకోవాలని ఎంతో ఆత్రుతతో ఎదురుచూశాను. మీ ప్రేమాభిమానాలు నాకు గొప్ప నిధి లాంటివి. మీలో ఒకడిగా, మీతో కలసి పంచుకునే ఈ క్షణాలు నాకు జీవితాంతం మరపురాని అనుభవాలుగా మిగిలిపోతాయి.