75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

August 15th, 03:02 pm

నేడు పవిత్ర ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పర్వదినం సందర్భంగా స్వాతంత్ర్య పోరాట యోధులతోపాటు దేశ రక్షణకోసం నిరంతర త్యాగాలతో అహర్నిశలూ శ్రమిస్తున్న సాహసవీరులకు దేశం శిరసు వంచి నమస్కరిస్తోంది. స్వరాజ్యం కోసం పోరాటాన్ని సామూహిక ఉద్యమంగా మలచిన పూజ్య బాపూజీ, దేశ విముక్తికోసం సర్వస్వం త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్; గొప్ప విప్లవ వీరులైన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్; ఎనలేని సాహస మూర్తులైన ఝాన్సీరాణి లక్ష్మీబాయి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి గైడినీలు, మాతంగిని హజ్రా; దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ, దేశాన్ని అఖండం చేసిన సర్దార్ వల్లభ్ భాయ్‌ పటేల్‌; భారత భవిష్యత్తుకు పథనిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్‌ తదితరులను ఇవాళ దేశం సగౌరవంగా స్మరించుకుంటోంది. ఈ మహనీయులందరికీ జాతి సదా రుణపడి ఉంటుంది.

75వ స్వాతంత్ర్య దినం నాడు ఎర్ర కోట మీద నుంచి ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

August 15th, 07:38 am

స్వేఛ్చ తాలూకు అమృత్ మహోత్సవ్ అయిన 75వ స్వాతంత్ర్య దినం సందర్భం లో మీ అందరి తో పాటు ప్రపంచం అంతటా ఉంటూ భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేటటువంటి వారందరికి ఇవే శుభాకాంక్షలు.

75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారతదేశం

August 15th, 07:37 am

దేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలో, ప్రధాని మోదీ తన ప్రభుత్వం సాధించిన విజయాలను జాబితా చేశారు మరియు భవిష్యత్తు కోసం ప్రణాళికలను రూపొందించారు. అతను తన ప్రసిద్ధ నినాదమైన సబ్కా సాథ్, సబ్కా వికాస్ మరియు సబ్కా విశ్వాస్ ను చేర్చారు. ఈ గుంపుకు తాజా ప్రవేశం సబ్కా ప్రయాస్.

వారాణ‌సీ లో జ‌రిగిన ‘మ‌హిళల‌ జీవ‌నోపాధి సంబంధిత జాతీయ స‌మావేశం- 2019’ కి హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

March 08th, 11:00 am

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని వారాణ‌సీ లో గ‌ల దీన్ ద‌యాళ్ హ‌స్త్ క‌ళా సంకుల్ లో అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం నాడు నిర్వ‌హించిన ‘మ‌హిళల‌ జీవ‌నోపాధి సంబంధిత జాతీయ స‌మావేశం- 2019’కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హాజ‌ర‌య్యారు.

దేశ‌వ్యాప్తంగా ఉన్న స్వ‌యం స‌హాయ‌క బృందాల సభ్యుల‌ను ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించిన ప్ర‌ధాన మంత్రి

July 12th, 10:30 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ‌వ్యాప్తంగా ఉన్న‌టువంటి స్వ‌యం స‌హాయ‌క బృందాల స‌భ్యురాళ్లతోను, దీన్ ద‌యాళ్ అంత్యోద‌య యోజ‌న ల‌బ్ధిదారుల తోను వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఈ రోజు సంభాషించారు. వివిధ స్వ‌యం స‌హాయ‌క బృందాల కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఒక‌ కోటి మంది కి పైగా మ‌హిళ‌లను ఉద్దేశించి ఈ కార్య‌క్ర‌మం సాగింది. వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల లబ్ధిదారుల‌తో ప్ర‌ధాన మంత్రి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా జ‌రుపుతున్న సమావేశాల ప‌రంప‌ర‌ లో ఇది తోమ్మిదో ముఖాముఖి స‌మావేశం.

వీడియో బ్రిడ్జి ద్వారా దేశవ్యాప్తంగా స్వయం సహాయక బృందాల సభ్యులతో చర్చలో ప్రధాని ప్రసంగ పాఠం

July 12th, 10:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు దేశవ్యాప్తంగా స్వయం సహాయక బృందాల సభ్యులతో మరియు దీనదయాళ్ అంత్యోదయ యోజన యొక్క లబ్ధిదారులతో వీడియో బ్రిడ్జి ద్వారా సంభాషించారు. వివిధ స్వయం సహాయక బృందాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోటిమంది మహిళలతో చర్చలు జరిపారు. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి సంభాషణా క్రమంలో ఇది తొమ్మిదవది.

ప్రజాస్వామ్యం అనేది ఒప్పందం కాదు, అది భాగస్వామ్యం: ప్రధాని మోదీ

April 21st, 11:01 pm

ప్రజాస్వామ్యం అనేది ఒప్పందం కాదు, అది భాగస్వామ్యం: ప్రధాని మోదీ

సివిల్ సర్వీసెస్ డే సంద‌ర్భంగా సివిల్ స‌ర్వెంట్స్ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

April 21st, 05:45 pm

సివిల్ సర్వీసెస్ డే సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సివిల్ స‌ర్వెంట్స్ ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భం ఉన్న‌తమైన సేవ‌లను ప్ర‌శంసించ‌డం, ప‌ని ని మ‌దింపు చేసుకొని ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకొనే సందర్భం అని పేర్కొన్నారు. సివిల్ స‌ర్వెంట్స్ లో ప్రేరణను నింపే దిశగా ఒక అడుగు వంటిది ప్రైం మినిస్టర్స్ అవార్డు అని ఆయ‌న అభివర్ణిస్తూ, అవార్డు గ్రహీతల‌ను అభినందించారు. ఈ అవార్డులు ప్ర‌భుత్వ ప్రాధాన్య‌ాల‌ను సూచించేవి కూడా అని ఆయ‌న అన్నారు.