కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛన్ దారులకు డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) లలో 3 శాతం అదనపు వాయిదా (ఇన్ స్టాల్ మెంట్) చెల్లింపునకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం

October 16th, 03:20 pm

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛన్ దారులకు డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) ల అదనపు వాయిదా (ఇన్ స్టాల్ మెంట్) ను జులై 1 నుంచి చెల్లించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది. ఇది మూల వేతనం లేదా పింఛన్ లో ఇప్పుడు వర్తిస్తున్న 50 శాతం రేటు కన్నా మూడు శాతం అధికం. ధరలలో పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని, ఆ భారాన్ని తొలగించడానికి ఈ చర్యను తీసుకొన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు & పింఛనుదార్లకు డియర్‌నెస్ అలవెన్స్ & డియర్‌నెస్ రిలీఫ్‌ పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

March 07th, 08:32 pm

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు & పింఛనుదార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షతన స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల‌కు డియ‌ర్‌నెస్ అలవెన్స్ (డీఏ), పింఛనుదార్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) 4% పెంచడానికి ఆమోదం తెలిపింది. దీంతో, ప్రస్తుతమున్న 46% మూల వేతనం/పెన్షన్‌కు ఈ 4% కలుస్తుంది, మొత్తం 50% అవుతుంది. 01.01.2024 నుంచే ఇది అమల్లోకి వస్తుంది.