దాదా వస్వని మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

July 12th, 02:12 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాదా వస్వని మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. “దాదా వాస్వాని సమాజం కోసం నివసించి, దయతో పేదవారికి సేవచేశారు. అపారమైన జ్ఞానంతో ఆశీర్వదించబడి, బాలికలను విద్యావంతులను చేయడంలోనూ, పరిశుభ్రత మరియు శాశ్వతమైన శాంతి, అలాగే సోదరభావాన్ని భోదించడం గురించి ఆయన మక్కువ చూపారు. అని ప్రధాని అన్నారు.

శ్రీ నరేంద్ర మోదీ లాంటి నాయకుడు భారత ప్రధానమంత్రిగా దొరకడం మనం అదృష్టం: దాదా వస్వాని

August 02nd, 06:25 pm

శ్రీ నరేంద్ర మోదీ లాంటి నాయకుడు భారత ప్రధానమంత్రిగా దొరకడం మనం అదృష్టం. గత మూడు సంవత్సరాల్లో భారతదేశం సుదూరం ప్రయాణించింది. మీ ధన్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్ లాంటి కార్యక్రమాలు దేశంను రూపాంతరం చెందిస్తుంది మరియు నేను భారతీయ ప్రజల తరుపున నేను ప్రధాన మంత్రిని అభినందింస్తున్నానని దాదా వస్వాని అన్నారు.

వీడియో కాంఫెరన్సు ద్వారా దాదా వాస్వని 99వ జన్మదిన వేడుకలలో పాల్గొన్న ప్రధాని మోదీ

August 02nd, 02:01 pm

వీడియో కాంఫెరన్సు ద్వారా దాదా వాస్వని 99వ జన్మదిన వేడుకలలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దాదా వాస్వని సమాజం యొక్క సంక్షేమం మరియు శ్రేయస్సు కోసం పోషించిన పాత్రను అభినందించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి కూడా నేడు మాట్లాడిన ప్రధాని మన లక్ష్యం 'స్వచ్ఛ గ్రహం’ గా ఉండాలన్నారు. 2022 నాటికి ఒక నవ భారతదేశం కోసం తను కంటున్న కలను ప్రధాని మోదీ గుర్తుచేసి, ప్రతి పౌరుడు తమ కర్తవ్యం నిర్వర్తించి తమ తమ లక్ష్యాలను సాధించాలని ప్రజలను కోరారు.