జూన్17వ మరియు జూన్ 18వ తేదీ లలో గుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
June 16th, 03:01 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 17వ తేదీ మరియు 18వ తేదీ లలో గుజరాత్ ను సందర్శించనున్నారు. పావాగఢ్ గుట్ట మీద పునర్ అభివృద్ధి పనులు పూర్తి అయిన శ్రీ కాళిక మాత ఆలయాన్ని ప్రధాన మంత్రి జూన్ 18వ తేదీ నాడు ఉదయం సుమారు 9గంటల 15 నిమిషాల వేళ కు సందర్శించి, ఆ ఆలయాన్ని ప్రారంభిస్తారు. తదనంతరం సుమారు 11:30 గంటల వేళ లో విరాసత్ వన్ ను ఆయన సందర్శించనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం పూట దాదాపు 12గంటల 30 నిమిషాల వేళ కు ఆయన వడోదరా లో ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’ లో పాలుపంచుకొని, 21,000 కోట్ల రూపాయల కు పైగా విలువైన ప్రాజెక్టుల లో కొన్నిటి ని ప్రారంభించడమే కాక మరికొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన లు చేస్తారు.'ఏక్ భారత్,శ్రేష్ట భారత్' అనే కలను సర్దార్ పటేల్ చేసిన కృషి వల్లనే సాకారం చేసుకోగలిగాము: ప్రధాని మోదీ
September 17th, 12:26 pm
గుజరాత్ ధబయోలోని నేషనల్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం కోసం ప్రధాని మోదీ పునాది రాయి వేశారు. బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, వలసవాదం పై బలమైన పోరాటం చేసిన గిరిజన వర్గాలకు చెందిన మన స్వాతంత్ర్య సమరయోధులను మేము గుర్తుంచుకున్నాము. అని అన్నారు.సర్దార్ సరోవర్ ఆనకట్ట ను దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి; జాతీయ ఆదివాసీ స్వాతంత్ర్య యోధుల సంగ్రహాలయ నిర్మాణానికి శంకుస్థాపన
September 17th, 12:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సర్దార్ సరోవర్ ఆనకట్ట ను దేశ ప్రజలకు ఈ రోజు అంకితం చేశారు. ఈ సందర్భంగా కేవాడియా లోని ఆనకట్ట వద్ద పూజలు, మంత్రోచ్చారణలు జరిగాయి. ఒక ఫలకాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.