బుల్ బుల్ చక్రవాతం వల్ల తలెత్తిన స్థితిగతుల ను సమీక్షించిన ప్రధాన మంత్రి
November 10th, 12:12 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశం లోని తూర్పు ప్రాంతాలు కొన్నిటి లో బుల్ బుల్ చక్రవాతం వల్ల తలెత్తిన స్థితిగతుల ను గురించి మరియు భారీ వర్షాల ను గురించి ఈ రోజు న సమీక్షించారు. ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తో బుల్ బుల్ చక్రవాతం వల్ల ఏర్పడిన స్థితిగతుల ను గురించి మాట్లాడి, కేంద్రం నుండి చేతనైన అన్ని విధాల సహాయాన్ని అందించగలమంటూ హామీ ని ఇచ్చారు.