ఫ్రాన్స్, మయోట్ లో చీడో తుఫాను సృష్టించిన విలయం నన్ను కలిచివేసింది: ప్రధానమంత్రి

December 17th, 05:19 pm

ఫ్రాన్స్, మయోట్ లో చీడో తుఫాను సృష్టించిన విలయం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ విపత్కర సమయంలో ఫ్రాన్స్ కు మద్దతుగా నిలుస్తున్నామని, అవసరమైన సహాయాన్నందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు. దేశాధ్యక్షుడు ఇమాన్యువల్ మాక్రోన్ నేతృత్వంలో దేశం ఈ విపత్తుని ధైర్యంగా ఎదుర్కోగలదన్న విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.

Hackathon solutions are proving to be very useful for the people of the country: PM Modi

December 11th, 05:00 pm

PM Modi interacted with young innovators at the Grand Finale of Smart India Hackathon 2024 today, via video conferencing. He said that many solutions from the last seven hackathons were proving to be very useful for the people of the country.

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో పాల్గొన్నవారితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ

December 11th, 04:30 pm

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024 గ్రాండ్ ఫినాలేలో పాల్గొంటున్న యువ నూతన ఆవిష్కర్తలతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, ఎర్రకోట నుంచి తాను చేసిన ప్రసంగంలో ‘సబ్‌కా ప్రయాస్’ (అందరి ప్రయత్నం) అవసరమని పునరుద్ఘాటించిన సంగతిని గుర్తు చేశారు. నేటి కాలపు భారతదేశం ‘అందరి ప్రయత్నం’తో చాలా వేగంగా పురోగమించగలుగుతుందని, ఈ రోజున నిర్వహించుకొంటున్న ఈ కార్యక్రమమే దీనికొక ఉదాహరణ అని ఆయన అన్నారు. ‘‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలే కోసం నేను చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నాను’’ అని ప్రధాని అన్నారు. యువ నూతన ఆవిష్కర్తలతో భేటీ అయినప్పుడు ఏదైనా కొత్త విషయం నేర్చుకొనే అవకాశంతోపాటు అర్థం చేసుకొనే అవకాశం కూడా తనకు లభిస్తుందని ఆయన అన్నారు. నూతన ఆవిష్కర్తల నుంచి తాను ఎంతో ఆశిస్తున్నానని ప్రధాని చెబుతూ, 21వ శతాబ్ది భారతదేశమంటే వారికి ఒక భిన్న దృష్టికోణం ఉందన్నారు. ఈ కారణంగా మీరు అందించే పరిష్కారాలు కూడా విభిన్నంగా ఉంటున్నాయి; ఏదైనా కొత్త సవాలు వచ్చిందంటే మీరు నూతన, విశిష్ట పరిష్కారాలతో ముందుకు వస్తారని శ్రీ మోదీ అన్నారు. గతంలో జరిగిన హ్యాకథాన్‌లలో తాను భాగం పంచుకొన్న విషయాన్ని ప్రధాని గుర్తుకుతెస్తూ, వాటిలో అందే ఫలితాల విషయంలో తాను ఎన్నడూ నిరుత్సాహానికి గురికాలేదన్నారు. ‘‘మీరు నా నమ్మకాన్ని బలపరచారంతే’’ అని ఆయన అన్నారు. గతంలో అందించిన పరిష్కారాలు వివిధ మంత్రిత్వ శాఖల్లో అమలవుతున్నాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న వారిని గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని శ్రీ మోదీ అంటూ, వారితో మాట్లాడడం మొదలుపెట్టారు.

మరింత వాతావరణ అనుకూలమైన, వాతావరణ-స్మార్ట్ భారత్‌ను రూపొందించడానికి 'మిషన్ మౌసమ్'కు మంత్రివర్గం ఆమోదం

September 11th, 08:19 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన మంత్రి మండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండేళ్లలో రూ.2000 కోట్ల వ్యయంతో మిషన్ మౌసమ్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.

మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారంలో యువత పాల్గొనడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

July 30th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. జులై నెల అంటే వర్షాకాలం, వర్షాల నెల. ప్రకృతి వైపరీత్యాల కారణంగా గత కొన్ని రోజులుగా బాధాకరమైన, ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. యమునాతో పాటు వివిధ నదుల్లో వరదలు పోటెత్తడంతో పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొండ ప్రాంతాలలో కొండచరియలు కూడా విరిగిపడ్డ సంఘటనలు జరిగాయి. మరోవైపు కొంతకాలం క్రితం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో-గుజరాత్ లోని వివిధ ప్రదేశాలలో బిపార్జాయ్ తుఫాను వచ్చింది. మిత్రులారా!ఈ విపత్తుల మధ్య, మనమందరం దేశవాసులం మరోసారి సామూహిక కృషి శక్తిని చూపించాం. స్థానిక ప్రజలు, ఎన్. డి. ఆర్. ఎఫ్. జవాన్లతో పాటు స్థానిక అధికార యంత్రాంగం విపత్తులను ఎదుర్కోవడానికి రాత్రింబగళ్లు శ్రమించింది. ఏ విపత్తునైనా ఎదుర్కోవడంలో మన సామర్థ్యం, వనరుల పాత్ర ప్రధానమైంది. కానీ దాంతోపాటే మన స్పందన, పరస్పరం సహకరించుకునే స్ఫూర్తి కూడా అంతే ముఖ్యం. ప్రజలందరూ బాగుండాలన్న సర్వజన హితాయ భావన భారతదేశానికి గుర్తింపు, భారతదేశ బలం.

‘బిపర్ జాయ్’ చక్రవాతం నేపథ్యం లో సన్నద్ధత ను సమీక్షించడం కోసం జరిగిన ఉన్నత స్థాయిసమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి

June 12th, 04:23 pm

‘బిపర్ జాయ్’ చక్రవాతాన్ని దృష్టి లో పెట్టుకొని తల ఎత్తగల స్థితి ని ఎదుర్కోవడాని కి కేంద్రం తో పాటు గుజరాత్ లో మంత్రిత్వ శాఖలు /ఏజెన్సీల సన్నాహాల ను సమీక్షించడం కోసం ఈ రోజు న జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

గ్రామీణాభివృద్ధిపై కేంద్ర బడ్జెట్ తాలూకు సకారాత్మక ప్రభావంపై వెబినార్ లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

January 23rd, 05:24 pm

Prime Minister Narendra Modi paid tribute to Netaji Subhas Chandra Bose on his 125th birth anniversary. Addressing the gathering, he said, The grand statue of Netaji, who had established the first independent government on the soil of India, and who gave us the confidence of achieving a sovereign and strong India, is being installed in digital form near India Gate. Soon this hologram statue will be replaced by a granite statue.

ఇండియా గేట్‌వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి అనంతరం సుభాస్‌ చంద్రబోస్‌ విపత్తు నిర్వహణ పురస్కారాల ప్రదానం

January 23rd, 05:23 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండియా గేట్‌వద్ద నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేతాజీ విగ్రహం పనులు పూర్తయ్యేదాకా ఈ హోలోగ్రామ్‌ ఇక్కడ దర్శనమిస్తూంటుంది. నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ 125వ జయంతి నేపథ్యంలో ఏడాదిపాటు నిర్వహించే ఉత్సవాల సందర్భంగా ఇదే ప్రదేశంలో అసలు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. కాగా, హోలోగ్రామ్‌ విగ్రహావిష్కరణ అనంతరం 2019, 2020, 2021, 2022 సంవ‌త్స‌రాల‌కుగాను ‘సుభాస్‌ చంద్రబోస్‌ విపత్తు నిర్వహణ పురస్కారా”లను ప్రధాని ప్రదానం చేశారు. విపత్తు నిర్వహణ రంగంలో నిస్వార్థ సేవలందించిన దేశంలోని వ్యక్తులు, సంస్థలకు గుర్తింపు, గౌరవం ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రవేశపెట్టింది.

తుపాను ప‌రిస్థితిపై ఒడిషా ముఖ్య‌మంత్రితో చ‌ర్చించిన ప్ర‌ధాన‌మంత్రి

September 26th, 06:20 pm

ఒడిషాలోని కొన్నిప్రాంతాల‌లో తుపాను ప‌రిస్థితుల‌పై ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , ఒడిషా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్‌తో చ‌ర్చించారు.

"గులాబ్" తుపాను సంసిద్ధతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చించిన ప్రధానమంత్రి

September 26th, 03:50 pm

గులాబ్ తుపాను నేపథ్యంలోప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి, ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

గోవాకు చెందిన హెచ్ సిడ‌బ్ల్యులు, కోవిడ్ వ్యాక్సినేష‌న్ ల‌బ్ధిదారుల‌తో ముఖాముఖి స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం

September 18th, 10:31 am

నిత్యం ఉత్సాహం పొంగిపొర్లే, ప్ర‌జాద‌ర‌ణ గ‌ల గోవా ముఖ్య‌మంత్రి శ్రీ ప్ర‌మోద్ సావంత్ జీ; గోవా పుత్రుడు, నా కేంద్ర కేబినెట్ స‌హ‌చ‌రుడు శ్రీ శ్రీ‌పాద్ నాయ‌క్ జీ, కేంద్ర ప్ర‌భుత్వంలో నా మంత్రి మండ‌లి స‌హ‌చ‌రుడు డాక్ట‌ర్ భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్ జీ, గోవాకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ప్ర‌జాప్ర‌తినిధులు, క‌రోనా పోరాట యోధులు, సోద‌ర‌సోద‌రీమ‌ణులారా!

గోవా లో కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తో, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల తో మాట్లాడిన ప్రధాన మంత్రి

September 18th, 10:30 am

గోవా లో వయోజన జనాభా కు ఒకటో డోసు ను 100 శాతం వేయించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అక్కడి ఆరోగ్య సంరక్షణ కార్మికుల తోను, కోవిడ్ టీకా కార్యక్రమం లబ్ధిదారుల తోను మాట్లాడారు.

యుఎన్ఎస్సి ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో “సముద్ర భద్రత మెరుగుపరచడం: అంతర్జాతీయ సహకారం కోసం ఒక కేస్” పై ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు

August 09th, 05:41 pm

ఉన్నత స్థాయి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బహిరంగ చర్చకు అధ్యక్షత వహిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సముద్ర సూత్రాలకు సంబంధించిన అడ్డంకులను తొలగించడం మరియు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం వంటి ఐదు సూత్రాలను ముందుకు తెచ్చారు, దీని ఆధారంగా సముద్ర భద్రత సహకారం కోసం ప్రపంచ మార్గదర్శకాన్ని తయారు చేయవచ్చు.

గత 7 ఏళ్ల లో, మనమంతా 'టీమ్ ఇండియా'గా పనిచేశాము: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

May 30th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! దేశంలో ఆక్సిజన్ అందించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. చాలా మంది ప్రజలు కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. పౌరుడిగా ఈ పనులన్నీ స్ఫూర్తినిస్తాయి. అందరూ ఒక జట్టుగా ఏర్పడి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. తన భర్త ల్యాబ్ టెక్నీషియన్ అని బెంగళూరుకు చెందిన ఊర్మిళ గారు నాకు చెప్పారు. చాలా సవాళ్ళ మధ్య నిరంతరం కరోనా పరీక్షలు ఎలా చేస్తున్నారో కూడా చెప్పారు.

యాస్ చక్రవాతం కారణం గా వాటిల్లిన నష్టం పై సమీక్షను నిర్వహించిన ప్ర‌ధాన మంత్రి

May 28th, 03:56 pm

యాస్ చక్రవాతం వల్ల తలెత్తిన స్థితి ని సమీక్షించడం కోసం ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఒడిశా ను, పశ్చిమ బంగాల్ ను 2021 మే నెల 28 న సందర్శించారు. ఒడిశా లోని భద్రక్, బాలేశ్వర్ జిల్లాల తో పాటు పశ్చిమ బంగాల్ లోని పూర్వ మేదినీపుర్ జిల్లా లో గాలివాన వల్ల ప్రభావితమైన ప్రాంతాలను ఆయన విమానం ద్వారా పరిశీలించారు.

యాస్ చక్రవాతం ప్రభావాన్ని సమీక్షించడానికి మే నెల 28న ఒడిశా ను, పశ్చిమ బంగాల్ ను సందర్శించనున్న ప్ర‌ధాన మంత్రి

May 27th, 04:07 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2021 మే నెల 28న ఒడిశా ను, పశ్చిమ బంగాల్ ను సందర్శించనున్నారు. యాస్ చక్రవాతం వల్ల ఈ రెండు రాష్ట్రాల లోఏ మేరకు ప్రభావం పడిందీ అంచనా వేయడానికి గాను నిర్వహించే సమీక్ష సమావేశాల కు ఆయన అధ్యక్షత వహిస్తారు. చక్రవాతం కారణం గా ఈ ఉభయ రాష్ట్రాల లో దెబ్బ తిన్న ప్రాంతాల ను ప్రధాన మంత్రి విమానం లో నుంచి పరిశీలిస్తారు.

యాస్ చక్రవాతం కారణం గా వాటిల్లిన నష్టం పై సమీక్షను నిర్వహించిన ప్ర‌ధాన మంత్రి

May 27th, 04:02 pm

యాస్ చక్రవాతం వల్ల తలెత్తిన స్థితి ని సమీక్షించడం కోసం ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఒడిశా ను, పశ్చిమ బంగాల్ ను 2021 మే నెల 28 న సందర్శించారు. ఒడిశా లోని భద్రక్, బాలేశ్వర్ జిల్లాల తో పాటు పశ్చిమ బంగాల్ లోని పూర్వ మేదినీపుర్ జిల్లా లో గాలివాన వల్ల ప్రభావితమైన ప్రాంతాలను ఆయన విమానం ద్వారా పరిశీలించారు.

‘యాస్’ తుపాను సంసిద్ధత.. చర్యల ప్రణాళికపై ప్రధానమంత్రి అత్యున్నత సమీక్ష

May 23rd, 01:43 pm

‘యాస్’ తుఫాను నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడంపై సంబంధిత రాష్ట్రాలతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖలు/ఇతర ప్రభుత్వ విభాగాల సంసిద్ధతను సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

‘తౌఁటే’ తుపాను సంసిద్ధతపై ప్రధానమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష

May 15th, 06:54 pm

‘తౌఁటే’ తుఫాను నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడంపై సంబంధిత రాష్ట్రాలతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖలు/ఇతర ప్రభుత్వ విభాగాల సంసిద్ధతను సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

Come May 2, West Bengal will have a double engine government that will give double and direct benefit to the people: PM

April 03rd, 03:01 pm

Continuing his poll campaign before the third phase of assembly election in West Bengal, PM Modi has addressed a mega rally in Tarakeshwar. He said, “We have seen a glimpse of what results are going to come on 2 May in Nandigram two days ago. I know for sure, with every step of the election, Didi’s panic will increase, her shower of abuse on me will also grow.”