
Prime Minister meets with the President of Namibia
July 09th, 07:55 pm
During his State Visit to Namibia, PM Modi met President Dr. Netumbo Nandi-Ndaitwah at the State House in Windhoek. He congratulated her on becoming Head of State. The leaders reflected on shared history, discussed boosting bilateral trade, and agreed to fast-track India-SACU PTA talks. India also offered support for development projects.
బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రకటనకు తెలుగు అనువాదం: అంతర్జాతీయ పాలనలో సంస్కరణ
July 06th, 09:41 pm
17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును అద్భుతంగా నిర్వహిస్తున్న అధ్యక్షుడు లూలాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రెజిల్ నాయకత్వంలో మన బ్రిక్స్ సహకారం కొత్త ఉత్సాహాన్ని, చైతన్యాన్ని సంతరించుకుంది. మనలో నిండిన ఈ శక్తి ఎస్‌ప్రెసో కాదు.. డబుల్ ఎస్‌ప్రెసో షాట్ లాంటిది. ఈ విషయంలో నేను అధ్యక్షుడు లూలా దార్శనికతను, ఆయన అచంచలమైన విశ్వాసాన్ని అభినందిస్తున్నాను. బ్రిక్స్ కుటుంబంలో ఇండోనేషియా చేరిన నేపథ్యంలో నా స్నేహితుడు, ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవోకు భారత్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
బహుపాక్షిక సంబంధాలు, ఆర్థిక-ద్రవ్య సహాయ విషయాల పటిష్ఠీకరణతో పాటు కృత్రిమ మేధపై బ్రిక్స్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రకటన పాఠం..
July 06th, 09:40 pm
బ్రిక్స్ కుటుంబానికి చెందిన మిత్ర దేశాల నేతలతో కలసి ఈ సమావేశంలో పాలుపంచుకొంటున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. లాటిన్ అమెరికా, ఆఫ్రికాలతో పాటు ఆసియాలోని మిత్రదేశాల నేతలతో నా ఆలోచనలను పంచుకొనేందుకు బ్రిక్స్ అవుట్‌రీచ్ సమ్మిట్‌లో ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు అధ్యక్షుడు శ్రీ లూలాకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని
July 06th, 09:39 pm
బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. నిన్న ప్రారంభమైన ఈ సదస్సు ఈరోజు కూడా జరుగుతోంది. అంతర్జాతీయ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్ వాణిని విస్తరించడం, శాంతి భద్రతలు, బహుపాక్షిక విధానాన్ని బలోపేతం చేయడం, అభివృద్ధి సమస్యలు, కృత్రిమ మేధతో సహా బ్రిక్స్ అజెండాకు సంబంధించిన వివిధ అంశాలపై నాయకులు ఫలప్రదమైన చర్చలు జరిపారు. సదస్సును విజయవంతంగా నిర్వహించడంతో పాటు ఆత్మీయ ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్ అధ్యక్షునికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 04th, 09:30 pm
గర్వించదగిన ప్రజాస్వామ్యానికీ, స్నేహపూర్వక దేశానికి ప్రతినిధులుగా ఎన్నికైన మీ ముందు నిలబడటం నాకు ఎంతో గౌరవంగా ఉంది.ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
July 04th, 09:00 pm
ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సెనేట్ అధ్యక్షులు వాడే మార్క్, దిగువ సభ స్పీకర్ జగదేవ్ సింగ్ ఆహ్వానం మేరకు హాజరైన ఆయన.. ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన మొదటి ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. భారతదేశం, ట్రినిడాడ్ అండ్ టొబాగో ద్వైపాక్షిక సంబంధాలలో ఇది ఒక కీలక కార్యక్రమంగా నిలిచిపోతుంది.ఘనా పార్లమెంటునుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 03rd, 03:45 pm
ప్రజాస్వామ్య స్ఫూర్తి, గౌరవం, దృఢత్వంతో తొణికిసలాడే ఘనా దేశాన్ని సందర్శించడం అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రతినిధిగా, నా వెంట 1.4 బిలియన్ భారతీయుల శుభాకాంక్షలను తీసుకువచ్చాను.ఘనా పార్లమెంటులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 03rd, 03:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఘనా పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారత ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. పార్లమెంట్ స్పీకర్ గౌరవనీయ అల్బన్ కింగ్స్‌ఫోర్డ్ సుమనా బాగ్బిన్ నిర్వహించిన ఈ సమావేశానికి పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ఇరు దేశాల నుంచి విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఈ ప్రసంగం భారత్-ఘనా సంబంధాల్లో ఒక ముఖ్యమైన సందర్భంగా నిలిచింది. ఇది రెండు దేశాలను ఏకం చేసే పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించింది.ఘనా అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన... ప్రధాని ప్రకటనకు తెలుగు అనువాదం
July 03rd, 12:32 am
మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం భారత ప్రధానమంత్రి ఘనాను సందర్శించారు.భారత్ – క్రొయేషియా నేతల ప్రకటన
June 19th, 06:06 pm
గౌరవ క్రొయేషియా ప్రధానమంత్రి శ్రీ ఆండ్రేజ్ ప్లెన్కోవిచ్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 18న ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు. క్రొయేషియాలో భారత ప్రధానమంత్రి పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరుదేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చల్లో పురోగతిని ఇది మరింత ముందుకు తీసుకెళ్తుంది.India and Croatia are connected by shared values such as democracy, rule of law, pluralism, and equality: PM Modi
June 18th, 09:56 pm
In his remarks during the joint press meet with PM Plenković of Croatia, PM Modi proposed a defence cooperation plan, highlighted collaboration in pharma, agriculture, IT, clean and digital tech, renewable energy, and semiconductors. The PM also announced the extension of the Hindi Chair MoU in Zagreb University.సైప్రస్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ
June 16th, 03:15 pm
భారత్-సైప్రస్ సంబంధాలకు ఆధారమైన ఉమ్మడి విలువలను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. ఇరు దేశాలు వారి సార్వభౌమత్వాన్నీ, ప్రాదేశిక సమగ్రతనూ పరస్పరం గౌరవిస్తున్నట్లు తెలిపారు. 2025, ఏప్రిల్ నెలలో పహల్గామ్లో జరిగిన అనాగరిక ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు.. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు సంఘీభావం ప్రకటించిన సైప్రస్‌కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇరు దేశాల బలమైన నిబద్ధతను ఇది స్పష్టం చేస్తుంది. సైప్రస్ ఐక్యతకు.. యూఎన్ భద్రతా మండలి తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాలు, ఈయూ అక్విస్ విషయంలో సైప్రస్ ఇబ్బందులను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.సైప్రస్ అధ్యక్షుడితో సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన
June 16th, 01:45 pm
సాదరంగా స్వాగతం పలికి, మంచి ఆతిథ్యమిచ్చిన గౌరవ అధ్యక్షుడికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు. నిన్న సైప్రస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి అధ్యక్షుడూ, ఇక్కడి ప్రజలూ చూపిన ఆప్యాయతానురాగాలు నిజంగా నా హృదయాన్ని తాకాయి.సౌదీ అరేబియాలో ప్రధాని అధికారిక పర్యటన ముగింపు సందర్భంగా సంయుక్త ప్రకటన
April 23rd, 12:44 pm
గౌరవ సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఆహ్వానం మేరకు గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 22న ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు.ఫిన్లాండ్ అధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ స్టబ్ తో ఫోన్ లో సంభాషించిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
April 16th, 05:45 pm
ఫిన్లాండ్ అధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ స్టబ్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో మాట్లాడారు.భారత్-థాయ్‌లాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటన
April 04th, 07:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 3, 4 తేదీల్లో థాయ్‌లాండ్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా “బంగాళాఖాత ప్రాంత బహుళరంగ సాంకేతిక-ఆర్థిక సహకార కూటమి” (బిమ్స్టెక్) 6వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. థాయ్‌లాండ్ ప్రధానమంత్రి గౌరవనీయ పైటోన్‌టాన్ షినవత్ ఆహ్వానం మేరకు ఈ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా బ్యాంకాక్‌లోని ప్రధాన పరిపాలన భవనంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.థాయ్ లాండ్ ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం
April 03rd, 03:01 pm
మార్చి 28న ఇక్కడ సంభవించిన భూకంపం వల్ల జరిగిన ప్రాణ నష్టానికి భారత ప్రజల తరఫున నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. అలాగే, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం దిశగా భారత్-మారిషస్ ఉమ్మడి ప్రణాళిక
March 12th, 02:13 pm
2025, మార్చ్ 11, 12వ తేదీల్లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన మారిషస్ అధికార పర్యటన సందర్భంగా మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రాంగూలాం, శ్రీ మోదీల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లోని అన్ని పార్శ్వాల గురించి సమగ్రమైన, ఫలవంతమైన చర్చలు జరిగాయి.Leaders’ Statement: Visit of the President of the European Commission and EU College of Commissioners to India
February 28th, 06:05 pm
Prime Minister Shri Narendra Modi and President of the European Commission Ms. Ursula von der Leyen affirmed that the EU-India Strategic Partnership has delivered strong benefits for their peoples and for the larger global good.యూరోపియన్ కమిషన్ అధ్యక్షునితో ప్లీనరీ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం
February 28th, 01:50 pm
భారత్ మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతోంది. ఈయూ కాలేజ్ ఆఫ్ కమిషనర్స్ ఈ స్థాయిలో ఒక దేశంతో కలిసి పనిచేయడం నిజంగా అపూర్వం.