మెసర్స్ చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 540 మెగావాట్ల క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం. ఈ ప్రాజెక్టు 1975 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగలదని అంచనా.
April 27th, 09:11 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈరోజు 4526.12 కోట్ల రూపాయల పెట్టుబడితో జమ్ము కాశ్మీర్‌లోని కిస్టవర్ జిల్లా లోని చీనాబ్ నదిపై 540 మెగావాట్ల (ఎం.డబ్ల్యు) క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును మెస్సర్స్ చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ( మెస్సర్స్ సివిపిపిఎల్) నిర్మిస్తుంది. ఇది ఎన్‌హెచ్‌పిసి, జెకెఎస్పిడిసి సంయుక్త కంపెనీ. 27.04.2022 నాటికి ఇందులో ఎన్ హెచ్‌పిసి వాటా 51 శాతం కాగా, జెకెఎస్పిడిసి వాటా 49 శాతంగా ఉంది.