Joint Statement: Official visit of Shri Narendra Modi, Prime Minister of India to Kuwait (December 21-22, 2024)
December 22nd, 07:46 pm
PM Modi paid an official visit to Kuwait, at the invitation of His Highness the Amir of the State of Kuwait, Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al-Sabah. During his first visit to the country, PM Modi attended the opening ceremony of the 26th Arabian Gulf Cup as the 'Guest of Honour' and held comprehensive talks to deepen bilateral ties.List of Outcomes: Visit of Prime Minister to Kuwait (December 21-22, 2024)
December 22nd, 06:03 pm
During his visit to Kuwait, PM Modi oversaw significant outcomes to strengthen bilateral ties. A Defence Cooperation MoU was signed, a Cultural Exchange Programme (2025-2029) was established and additionally, a Sports Cooperation Programme (2025-2028) was launched. Notably, Kuwait joined the International Solar Alliance, paving the way for collaborative solar energy deployment and low-carbon growth initiatives.PM Modi invites everyone to Rann Utsav
December 21st, 10:08 am
Prime Minister Shri Narendra Modi has invited everyone to Rann Utsav, which will go on till March 2025. Prime Minister Shri Modi underscored that the festival promises to be an unforgettable experience.భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడిన నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ డిక్ స్కూఫ్
December 18th, 06:51 pm
నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ డిక్ స్కూఫ్ భారత ప్రధానమంత్రి శ్ర నరేంద్ర మోదీతో ఫోన్ లో సంభాషించారు.The World This Week on India
December 17th, 04:23 pm
In a week filled with notable achievements and international recognition, India has once again captured the world’s attention for its advancements in various sectors ranging from health innovations and space exploration to climate action and cultural influence on the global stage.శ్రీలంక అధ్యక్షుడితో కలిసి సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని పత్రికా ప్రకటన
December 16th, 01:00 pm
అధ్యక్షుడు దిసనాయకను హృదయపూర్వకంగా భారత్ కు స్వాగతిస్తున్నాను. అధ్యక్షుడిగా తొలి విదేశీ పర్యటన కోసం మీరు భారత్ ను ఎంచుకోవడం సంతోషాన్నిస్తోంది. అధ్యక్షుడు దిసనాయక పర్యటన మన సంబంధాల్లో పునరుత్తేజాన్ని, శక్తిని నింపింది. మా భాగస్వామ్యం విషయంలో మేం భవిష్యత్ దార్శనికతను అవలంబించాం. మా ఆర్థిక భాగస్వామ్యంలో పెట్టుబడుల ఆధారిత వృద్ధి, అనుసంధానతకు ప్రాధాన్యం ఇచ్చాం. అంతేకాకుండా ఫిజికల్, డిజిటల్, ఎనర్జీ అనుసంధానత మా భాగస్వామ్యంలో ముఖ్యమైన మూలాధారాలుగా ఉండాలని నిర్ణయించాం. ఇరు దేశాల మధ్య విద్యుత్-గ్రిడ్ అనుసంధానత, బహుళ-ఉత్పత్తి పెట్రోలియం పైప్‌లైన్ల ఏర్పాటు దిశగా కృషి చేస్తాం. శాంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టును వేగవంతం చేస్తాం. దానితోపాటు శ్రీలంక విద్యుత్ ప్లాంట్లకు ఎల్ఎన్ జీని సరఫరా చేస్తాం. ఈటీసీఏను త్వరలోనే పూర్తిచేసి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఇరువైపులా కృషి జరుగుతుంది.తబలా విద్వాంసుడు ఉస్తాద్ జకీర్ హుస్సేన్‌కు ప్రధాని నివాళి
December 16th, 12:08 pm
దిగ్గజ తబలా విద్వాంసుడు జకీర్ హుస్సేన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు నివాళులు అర్పించారు.Maha Kumbh is a divine festival of our faith, spirituality and culture: PM in Prayagraj
December 13th, 02:10 pm
PM Modi inaugurated development projects worth ₹5500 crore in Prayagraj, highlighting preparations for the 2025 Mahakumbh. He emphasized the cultural, spiritual, and unifying legacy of the Kumbh, the government's efforts to enhance pilgrimage facilities, and projects like Akshay Vat Corridor and Hanuman Mandir Corridor.ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చేతుల మీదుగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో రూ.5500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం
December 13th, 02:00 pm
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ రాజ్‌లో రూ.5500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యే వారిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, పవిత్ర సంగమ ప్రాంతమైన ప్రయాగరాజ్‌కు, మహాకుంభమేళాకు వచ్చే సాధువులు, సన్యాసులకు భక్తితో నమస్కరించారు. కృషి, అంకితభావంతో మహా కుంభమేళాను విజయవంతం చేస్తున్న ఉద్యోగులు, శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులకు శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మహా కుంభమేళా జరిగే పరిమాణాన్ని, స్థాయి గురించి వివరిస్తూ, 45 రోజుల పాటు సుదీర్ఘంగా సాగే మహాయజ్ఞంగా, ప్రతి రోజూ లక్షల మంది భక్తుల పాల్గొనే, ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమంగా దీన్ని అభివర్ణించారు. ‘‘ప్రయాగరాజ్ నేలపై సరికొత్త చరిత్ర లిఖితమవుతోంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. వచ్చే ఏడాది జరగబోతున్న మహా కుంభమేళా దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక గుర్తింపును నూతన శిఖరాలకు తీసుకెళుతుందతని, ఈ ఐక్యత ‘మహాయజ్ఞం’ గురించి ప్రపంచమంతా చర్చిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మహా కుంభమేళాని విజయవంతంగా నిర్వహించాలన్నారు.ప్రముఖ గుజరాతీ గాయకుడు శ్రీ పురుషోత్తం ఉపాధ్యాయ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం
December 11th, 09:20 pm
ప్రముఖ గుజరాతీ గాయకుడు శ్రీ పురుషోత్తం ఉపాధ్యాయ్ కన్నుమూత పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.సుప్రసిద్ధ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సాహితీ సర్వస్వం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
December 11th, 02:00 pm
నేడు దేశం మహాకవి సుబ్రమణ్య భారతి జయంతిని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వారికి గౌరవ పూర్వక నివాళులర్పిస్తున్నాను. భారతీయ సంస్కృతీ సాహిత్యాలకి, దేశస్వాతంత్ర్య పోరాట జ్ఞాపకాలకు, తమిళుల గౌరవానికి ఇవి అపురూపమైన క్షణాలు! మహాకవి సుబ్రమణ్య భారతి రచనల ప్రచురణను అత్యున్నతస్థాయి సేవగా పరిగణిస్తున్నాను. పరిపూర్ణమైన గొప్ప ఆధ్యాత్మిక యత్నమిది. 21 సంపుటాల్లో తయారైన 'కాల వరిసైయిల్ భారతియార్ పడైప్పుగళ్' సంకలనం అసాధారణమైన, అపూర్వమైన విజయానికి ప్రతీక. ఎంతో స్థైర్యంతో చేపట్టిన ఆరు దశాబ్దాల అవిరామ కృషికి దక్కిన అద్భుత ఫలితం. అనితరసాధ్యమనిపించే ఈ సాఫల్యం శ్రీ శీని విశ్వనాథన్ గారి కృషికీ, అంకితభావానికీ నిదర్శనంగా నిలుస్తోంది. భవిష్యత్తు తరాలకు ఈ సంకలనం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఒకే జీవితం, ఒక లక్ష్యం అన్న మాటని మనం తరచుగా వింటుంటాం కానీ శ్రీ శీని ఆ మాటను నిజం చేసి చూపారు. అపురూపమైన అంకితభావానికి ప్రతీకగా నిలిచిన ఆయన శ్రమ, ధర్మశాస్త్ర చరిత్రను రాయడానికి 35 ఏళ్ల సమయాన్ని వెచ్చించిన మహామహోపాధ్యాయ పాండురంగ్ వామన్ కానే గారిని గుర్తుకు తెచ్చింది. శ్రీ శీని విశ్వనాథన్ గారి కృషి విద్యారంగంలో నూతన ప్రమాణాలను పాదుకొల్పగలదని విశ్వసిస్తున్నాను. గొప్ప ఫలితాన్ని సాధించిన విశ్వనాథన్ గారికి, ఆయన బృందం సహా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.తమిళ మహాకవి శ్రీ సుబ్రమణ్య భారతి పూర్తి రచనల సంగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 11th, 01:30 pm
తమిళ భాషా రంగంలో మహాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ సుబ్రహ్మణ్య భారతి పూర్తి రచనల సంగ్రహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని నంబర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఈరోజు ఆవిష్కరించారు. శ్రీ సుబ్రహ్మణ్య భారతి జయంతి సందర్భంగా ఆయనకు శ్రీ మోదీ నివాళులు అర్పిస్తూ, ఈరోజు భారతదేశ సంస్కృతికి, సాహిత్యానికి, మన దేశ స్వాతంత్య్ర పోరాట స్మృతులకు, అంతేకాకుండా తమిళనాడు ఆత్మగౌరవానికి కూడా లభించిన ఒక మహదవకాశమన్నారు.శ్రీ సుబ్రహ్మణ్య భారతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి
December 11th, 10:27 am
కవి, రచయిత శ్రీ సుబ్రహ్మణ్య భారతి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.డిసెంబర్ 11న సుప్రసిద్ధ తమిళ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు సుబ్రహ్మణ్య భారతి సాహితీ సర్వస్వాన్ని విడుదల చేయనున్న ప్రధానమంత్రి
December 10th, 05:12 pm
సుబ్రహ్మణ్య భారతి రచనలు ప్రజల్లో దేశభక్తిని జాగృతం చేసి, సాధారణ ప్రజలకు సులభంగా అర్ధమయ్య భాషలో భారతీయ సంస్కృతి వైభవాన్ని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని వారికి పరిచయం చేశాయి. శీని విశ్వనాథన్ కూర్చి, సంపాదకత్వం వహించిన 23 సంపుటాల ‘భారతి’ సాహితీ సర్వసాన్ని అలయన్స్ పబ్లిషర్స్ ప్రచురించారు. ఈ ప్రచురణలో సుబ్రహ్మణ్య భారతి రచనల గురించిన వివరణలు, పత్రాలు, నేపథ్యం, తాత్వికపరమైన విశ్లేషణలు సహా సమగ్ర వివరాలు అందుబాటులోకి వస్తాయి.అసాధారణ తెగువ, త్యాగాల ద్వారా అస్సాం ఉద్యమానికి అంకితమైన వారిని స్మరించుకునేందుకు ‘స్వాహిద్ దివస్’ గొప్ప సందర్భమన్న
December 10th, 04:16 pm
అస్సాం ఉద్యమానికి తమ జీవితాలను అంకితం చేసి, అసాధారణమైన తెగువను, త్యాగాలనీ చూపిన వారిని గుర్తు చేసుకునేందుకు ‘స్వాహిద్ దివస్’ గొప్ప సందర్భమని ప్రధాన మంత్రి అన్నారు.స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో పాల్గొనే విద్యార్థులతో డిసెంబర్ 11న ప్రధానమంత్రి మాటామంతీ
December 09th, 07:38 pm
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో భాగంగా గ్రాండ్ ఫినాలేని 2024 డిసెంబర్ 11న నిర్వహించనున్నారు. ఆ పోటీలో పాల్గొంటున్న యువ నూతన ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయంత్రం సుమారు 4:30 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు. గ్రాండ్ ఫినాలేలో 1300 మందికి పైగా విద్యార్థి బృందాలు పాలుపంచుకోనున్నాయి. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
December 07th, 05:52 pm
పవిత్రమైన కార్యకర్ సువర్ణ మహోత్సవం సందర్భంగా, భగవాన్ స్వామి నారాయణుని పాదాలకు వినమ్రతతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గురు హరి ప్రగత్ బ్రహ్మ స్వరూపమైన ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి ఈ రోజు. ఆయనకు కూడా భక్తితో నమస్కరిస్తున్నాను. పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్ చేస్తున్న నిర్విరామ కృషి, అంకిత భావం ద్వారానే భగవాన్ స్వామి నారాయణుడి బోధనలు, ప్రముఖ్ స్వామి మహరాజ్ తీర్మానాలు ఈ రోజు నిజరూపం దాలుస్తున్నాయి. లక్ష మంది వాలంటీర్లు, యువత, చిన్నారులు భాగం పంచుకుంటున్న ఈ అద్బుతమైన సాంస్కృతిక కార్యక్రమం విత్తనం, చెట్టు, ఫలం అనే భావనను అందంగా సూచిస్తోంది. నేను అక్కడ ప్రత్యక్షంగా లేనప్పటికీ, ఈ కార్యక్రమ ఉత్సాహాన్ని, శక్తినీ నా హృదయం అనుభూతి చెందుతోంది. ఇంత గొప్ప దైవిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, మహనీయులైన సాధువులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వినయంగా నమస్కరిస్తున్నాను.అహమదాబాద్ లో కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 07th, 05:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహమదాబాద్‌లో ఏర్పాటైన కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి దృశ్య మాధ్యమం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, మొదట పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, ఆరాధనీయులైన సాధు సంతులకు, సత్సంగి కుటుంబ సభ్యులకు, ఇతర ప్రముఖులకు, ప్రతినిధులకు స్వాగతం పలికారు. కార్యకర్ సువర్ణ మహోత్సవ్ సందర్భంగా భగవాన్ స్వామి నారాయణ్ చరణాలకు శ్రీ మోదీ ప్రణామాన్ని ఆచరించారు. ఈ రోజు ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి సందర్భం కూడా అని ప్రధాని గుర్తుకు తీసుకువచ్చారు. భగవాన్ స్వామి నారాయణ్ ప్రబోధాలు, ప్రముఖ్ స్వామి మహారాజ్ సంకల్పాలు పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్ కఠోర శ్రమతో, అంకితభావం తో నెరవేరుతున్నాయని కూడా శ్రీ మోదీ అన్నారు. సుమారు ఒక లక్షమంది కార్యకర్తలతోపాటు యువతీయువకులు, బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఇదెంత భారీ కార్యక్రమమో చెప్పకనే చెబుతోందని, దీనిని చూడడం తనకు సంతోషాన్నిస్తోందని శ్రీ మోదీ అన్నారు. తాను సభాస్థలిలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ఈ కార్యక్రమంలో ఉత్సాహాతిరేకం ఏ స్థాయిలో వెల్లువెత్తుతోందీ తనకు తెలుస్తూనే ఉందన్నారు. పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, సాధువులందరికీ ఈ భవ్య దివ్య కార్యక్రమానికిగాను ఆయన తన అభినందనలను అందజేశారు.న్యూ ఢిల్లీలో అష్టలక్ష్మి మహోత్సవ్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 06th, 02:10 pm
అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ గారు, మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కోన్‌రాడ్ సంగ్మా గారు, త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా గారు, సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేంసింగ్ తమాంగ్ గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు జ్యోతిరాదిత్య సింధియా గారు, సుకాంత మజుందార్ గారు, అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మిజోరం, నాగాలాండ్ ప్రభుత్వాల మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులు , మహిళలు, ప్రముఖులారా,అష్టలక్ష్మి మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 06th, 02:08 pm
అష్టలక్ష్మి మహోత్సవాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. ప్రముఖులందరినీ ఈ కార్యక్రమానికి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానిస్తూ, ఈరోజు బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహాపరినిర్వాణ దినోత్సవం కూడా ఉందని గుర్తు చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం 75 సంవత్సరాలను పూర్తి చేసుకొందని, ఈ రాజ్యాంగం దేశ పౌరులందరికీ గొప్ప ప్రేరణను అందిస్తోందని ప్రధాని అన్నారు. భారత పౌరులందరి పక్షాన బాబా సాహెబ్ అంబేద్కర్‌కు శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు.