భారత, పీఎం XI క్రికెట్ జట్లతో ఆస్ట్రేలియా ప్రధాని సమావేశంపై హర్షం వ్యక్తంచేసిన భారత ప్రధానమంత్రి

November 28th, 07:33 pm

భారత, పీఎం XI క్రికెట్ జట్లతో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ సమావేశంపై భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భారత క్రికెటర్ల అద్భుత ఆరంభాన్ని శ్రీ మోదీ ప్రశంసించారు.

గయానాలో ప్రముఖ క్రికెట్ క్రీడాకారులను కలిసిన ప్రధానమంత్రి

November 22nd, 05:31 am

గయానాలో ప్రముఖ క్రికెట్ క్రీడాకారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మాట్లాడారు. భారతదేశానికి, గయానాకు మధ్య ఆత్మీయతను క్రికెట్ పెంచిందని, రెండు దేశాల సాంస్కృతిక సంబంధాలను బల పరిచిందని ప్రధాని వ్యాఖ్యానించారు.

గయానాలోని భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

November 22nd, 03:02 am

మీ అందరితో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనతోపాటు ఇక్కడకు వచ్చినందుకు ముందుగా ఇర్ఫాన్ అలీ గారికి కృతజ్ఞతలు. వచ్చినదగ్గర నుంచీ నాపట్ల మీరు చూపిన ఆదరాభిమానాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నన్ను ఇంటికి ఆహ్వానించిన అధ్యక్షులు అలీ గారికి కృతజ్ఞతలు. నన్ను ఆత్మీయుడిగా భావించిన వారి కుటుంబానికి కూడా కృతజ్ఞతలు. ఆతిధిమర్యాదలు మన సంస్కృతిలో అంతర్భాగం. గత రెండు రోజులుగా ఇదే జ్ఞాపకానికి వస్తోంది. అధ్యక్షులు అలీగారు, వారి మామ్మగారు కూడా మొక్క నాటారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరుతో మేం చేపట్టిన ఉద్యమంలో అది భాగం. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటడం అని దానికి అర్థం. ఈ భావోద్వేగ క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.

గయానాలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం గయానాలోని ప్రవాస భారతీయులు అనేక రంగాలను ప్రభావితం చేస్తూ గయానా అభివృద్ధికి దోహదపడ్డారు: ప్రధానమంత్రి

November 22nd, 03:00 am

గయానాలోని జార్జ్ టౌన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గయానా అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ, ప్రధాని మార్క్ ఫిలిప్స్, ఉపాధ్యక్షుడు భర్రాత్ జగ్దేవ్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ రామోతార్ తదితరులు పాల్గొన్నారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ అధ్యక్షుడికి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తన రాక సందర్భంగా ప్రత్యేక ఆప్యాయతతో ఘనస్వాగతం పలకడంపై హర్షం వ్యక్తం చేశారు. తనపై చూపిన ఆప్యాయతానురాగాలపై అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. “ఆతిథ్య స్ఫూర్తి మన సంస్కృతికి కేంద్ర బిందువు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడు, ఆయన మామ్మగారితో కలిసి తాను ఓ మొక్క నాటానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయే భావోద్వేగభరితమైన క్షణాలన్నారు.

The bond between India & Guyana is of soil, of sweat, of hard work: PM Modi

November 21st, 08:00 pm

Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.

గయానా పార్లమెంటునుద్దేశించి భారత ప్రధానమంత్రి ప్రసంగం

November 21st, 07:50 pm

గ‌యానా పార్లమెంటు జాతీయ అసెంబ్లీలో ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రసంగించారు. అలా ప్రసంగించిన మొదటి భారత ప్రధానమంత్రి ఆయనే. ఈ ప్రసంగం కోసం స్పీకర్ శ్రీ మంజూర్ నాదిర్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

సెయింట్ లూసియా ప్రధానితో భారత ప్రధాని భేటీ

November 21st, 10:13 am

భారత్-కారికోమ్ రెండో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సెయింట్ లూసియా ప్రధానమంత్రి హెచ్.ఇ. ఫిలిప్ జె. పియర్ తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చర్చలు నిర్వహించారు. నవంబరు 20న జరిగిన ఈ చర్చలు ఫలప్రదంగా జరిగాయి.

Be it COVID, disasters, or development, India has stood by you as a reliable partner: PM in Guyana

November 21st, 02:15 am

PM Modi and Grenada PM Dickon Mitchell co-chaired the 2nd India-CARICOM Summit in Georgetown. PM Modi expressed solidarity with CARICOM nations for Hurricane Beryl's impact and reaffirmed India's commitment as a reliable partner, focusing on development cooperation aligned with CARICOM's priorities.

భారత్- కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశం

November 21st, 02:00 am

భారత్-కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశాన్ని జార్జ్‌టౌన్‌లో నిన్న నిర్వహించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కరికమ్ కు ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న గ్రెనడా ప్రధాని శ్రీ డికన్ మిషెల్‌లు ఈ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించారు. శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీకి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. భారత్- కరికమ్ తొలి శిఖరాగ్ర సమావేశాన్ని 2019లో న్యూయార్క్‌ లో నిర్వహించారు. గయానా అధ్యక్షుడు, గ్రెనెడా ప్రధానిలకు తోడు శిఖరాగ్ర సమావేశంలో పాలుపంచుకొన్నా వారిలో..

జమైకా ప్రధాని హెచ్.ఇ డాక్టర్. ఆండ్రూ హోల్నెస్ అధికారిక భారత పర్యటన సందర్భంగా (సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు) జరిగిన ఒప్పందాలు

October 01st, 12:30 pm

ఆర్థిక సేవలు, ఉత్పత్తులను అందరికీ అందుబాటులో ఉంచడం, సామాజిక, ఆర్థిక రంగాల్లో పురోగతిని ప్రోత్సహించే లక్ష్యంతో విజయవంతమైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పంచుకునే విషయంలో పరస్పర సహకారంపై భారత్, జమైకా ప్రభుత్వాల తరపున భారత ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, జమైకా ప్రధాన మంత్రి కార్యాలయం మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం.

జమైకా ప్రధానితో సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

October 01st, 12:00 pm

ప్రధానమంత్రి శ్రీ హోల్నెస్‌, ఆయన ప్రతినిధి బృందాన్ని భారత్‌కు స్వాగతించడం నాకు సంతోషంగా ఉంది. ఇది ఆయనకు తొలి ద్వైపాక్షిక పర్యటన. అందుకే ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యముంది. చాలా కాలంగా ప్రధాని హోల్నెస్ భారతదేశానికి మిత్రులుగా కొనసాగుతున్నారు. చాలా సార్లు ఆయనను కలిసే అవకాశం నాకు లభించింది. ఆయనను కలిసిన ప్రతిసారీ భారత్‌తో సంబంధాల బలోపేతం పట్ల ఆయనకు గల నిబద్ధతను ఆయన ఆలోచనల ద్వారా నేను గ్రహించాను. ఆయన పర్యటన మన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త శక్తిని ఇవ్వడమే కాకుండా మొత్తం కరీబియన్ ప్రాంతంతో మన బంధాన్ని పెంపొందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

అమెరికాలోని న్యూయార్క్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు పాఠం

September 22nd, 10:00 pm

నమస్తే అమెరికా! ఇప్పుడు మన నమస్తే కూడా స్థానికం నుంచి అంతర్జాతీయంగా మారిపోయింది. ఇదంతా మీ వల్లే. భారత్ ను హృదయానికి దగ్గరగా ఉంచుకునే ప్రతి భారతీయుడు దీన్ని సుసాధ్యం చేశాడు.

న్యూయార్క్‌లో భార‌తీయ స‌మాజాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం

September 22nd, 09:30 pm

న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో భారీ ఎత్తున హాజ‌రైన ప్ర‌వాస భార‌తీయుల‌ను ఉద్దేశించి సోమ‌వారం ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మానికి దాదాపు 15,000 మంది ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు.

Prime Minister condoles demise of former Indian Cricketer and Coach, Shri Anshuman Gaekwad

July 31st, 11:59 pm

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the demise of former Indian Cricketer and Coach, Shri Anshuman Gaekwad.

క్రికెట్‌కు రవీంద్ర జడేజా సేవలపై ప్రధాని ప్రశంసలు

June 30th, 07:19 pm

భారత క్రికెటర్ రవీంద్ర జడేజా కొన్నేళ్లుగా ఆటలోని వివిధ విభాగాల్లో ప్రదర్శిస్తున్న ప్రతిభా నైపుణ్యాలు అపూర్వమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. అంతర్జాతీయ టి20 క్రికెట్‌కు ఆల్ రౌండర్ జడేజా వీడ్కోలు ప్రకటించిన నేపథ్యంలో ఈ పోటీల్లో అచ్చెరువొందించే ఎన్నో విన్యాసాలు చేశారని కొనియాడారు.

టీ20 వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచిన భారత క్రికెట్‌ జట్టుకు ఫోన్‌లో ప్రధాని మోదీ అభినందన

June 30th, 02:06 pm

ఐసిసి టి20 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత పురుషుల జట్టుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఫోన్ చేసి, అభినందనలు తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో జట్టు సభ్యులు విలక్షణ ప్రతిభ, నైపుణ్యం, పట్టుదల ప్రదర్శించారంటూ శ్రీ మోదీ కొనియాడారు.

టి20 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు

June 29th, 11:56 pm

భారత క్రికెట్ జట్టు ఇవాళ టి20 ప్రపంచ కప్ విజేతగా నిలవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మన జట్టు సాధించిన అపూర్వ విజయంతో యావద్దేశం గర్విస్తున్నదని పేర్కొంటూ ఒక వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. ఈ టోర్నమెంటులో ప్రతి మ్యాచ్ నీ సొంతం చేసుకుంటూ తనకు తిరుగే లేదని చాటిందన్నారు. ఆద్యంతం అప్రతిహత విజయాలతో మన జట్టు అద్భుత ప్రతిభను ప్రదర్శించిందని కొనియాడారు.

క్రికెట్క్రీడాకారుడు శ్రీ మొహమ్మద్ శమీ త్వరగా పునఃస్వస్థులు కావాలని కోరుకున్న ప్రధాన మంత్రి

February 27th, 12:26 pm

క్రికెట్ క్రీడాకారుడు శ్రీ మొహమ్మద్ శమీ త్వరగా పునఃస్వస్థులై మంచి ఆరోగ్యాన్ని తిరిగి పొందాలి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

మన్ కి బాత్, డిసెంబర్ 2023

December 31st, 11:30 am

మిత్రులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాన్ని వినేటటువంటి వారు అనేకులు నాకు లేఖల ను వ్రాసి వారి యొక్క స్మరణీయమైనటువంటి క్షణాల ను గురించి నాకు తెలియజేశారు. ఈ సంవత్సరం లో, మన దేశం అనేక ప్రత్యేకమైనటువంటి సాఫల్యాల ను సాధించడం 140 కోట్ల మంది భారతీయుల బలం అని చెప్పాలి. ఏళ్ల తరబడి ఎదురుచూసిన ‘నారీ శక్తి వందన్ చట్టం’ ఆమోదం పొందింది ఈ సంవత్సరం లోనే. భారతదేశం 5 వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా నిలచినందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తూ పలువురు ఉత్తరాల ను వ్రాశారు. జి- 20 శిఖర సమ్మేళనం సఫలం అయిన విషయాన్ని చాలా మంది గుర్తు చేశారు. సహచరులారా, ఈ రోజు న భారతదేశం మూలమూలన ఆత్మవిశ్వాసం తో నిండిపోయి ఉన్నది. అభివృద్ధి చెందినటువంటి భారతదేశం యొక్క స్ఫూర్తి తో, స్వావలంబన భావన తో నిండి ఉంది. అదే స్ఫూర్తి ని, ఊపును 2024 లో కూడాను మనం కొనసాగించాలి. దీపావళి రోజు న రికార్డు స్థాయి లో జరిగినటువంటి వ్యాపార లావాదేవీ లు భారతదేశం లో ప్రతి ఒక్కరు ‘వోకల్ ఫార్ లోకల్’ (స్థానికం గా తయారైన ఉత్పాదనల నే ఆదరించాలి) అనే మంత్రాని కి ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు అని నిరూపించాయి.

జమ్మూ కాశ్మీర్ విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషణ

December 24th, 07:28 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు తెల్లవారుజామున 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో జమ్మూ & కాశ్మీర్ విద్యార్థుల ప్రతినిధి బృందంతో సంభాషించారు. జమ్మూ & కాశ్మీర్‌లోని అన్ని జిల్లాల నుండి వచ్చిన సుమారు 250 మంది విద్యార్థులు తమ ఆలోచనలను పంచుకున్నారు.