భారతదేశాని కి చెందిన కోవాక్సిన్ కు ఆస్ట్రేలియా గుర్తింపు నుఇచ్చినందుకు గాను మాన్య శ్రీ స్కాట్ మారిసన్ కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాన మంత్రి

November 01st, 10:40 pm

భారతదేశాని కి చెందిన కోవాక్సిన్ ( COVAXIN ) కు ఆస్ట్రేలియా యొక్క గుర్తింపు ను ఇచ్చినందుకు గాను ఆస్ట్రేలియా ప్రధాని మాన్య శ్రీ స్కాట్ మారిసన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.

ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలి మరియు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

April 25th, 11:30 am

మిత్రులారా, గతంలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో నేను సుదీర్ఘంగా చర్చించాను. ఔషధ పరిశ్రమ కు చెందిన వారు, టీకా మందు తయారీదారులు, ఆక్సీజన్ ఉత్పత్తి లో పాల్గొన్న వ్యక్తులు, వైద్య రంగ పరిజ్ఞానం ఉన్న వారు వారి వారి ముఖ్యమైన సలహాల ను ప్రభుత్వానికి అందజేశారు. ఈ సమయం లో- ఈ యుద్ధం లో విజయాన్ని సాధించడానికి నిపుణులు, శాస్త్రవేత్తల సలహాల కు ప్రాధాన్యాన్ని ఇవ్వవలసివుంది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను ముందుకు తీసుకుపోవడం లో భారత ప్రభుత్వం పూర్తి శక్తి ని కూడదీసుకొంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి బాధ్యతలను నెరవేర్చడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాయి.

కోవిడ్ పరిస్థితిని, టీకాలకు సంసిద్ధతను సమీక్షించిన ప్రధాని

January 09th, 05:42 pm

దేశంలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితిని, కోవిడ్ టీకాల పంపిణీకి సంసిద్ధతను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించి సమీక్షించారు. ఈ సమావేశానికి కాబినెట్ కార్యదర్శి, ప్రధానికి ప్రిన్సిపల్ కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. కోవిడ్ కి సంబంధించిన అన్ని అంశాలమీద ప్రధాని సమగ్రంగా చర్చించి సమీక్షించారు. సురక్షితమని సంబంధిత నియంత్రణా సంస్థ ధ్రువీకరించిన కోవి షీల్డ్, కొవాక్సిన్ అనే రెండు టీకాలను వాడటానికి రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే.