మైసూరులో ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాల స్మారకోత్సవ ప్రారంభ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

April 09th, 01:00 pm

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ భూపేందర్ యాదవ్ జీ, శ్రీ అశ్విని కుమార్ చౌబే జీ, ఇతర దేశాల మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఇతర ప్రతినిధులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

కర్ణాటకలోని మైసూరులో టైగర్ ప్రాజెక్టు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు

April 09th, 12:37 pm

టైగర్ పోజెక్టు 50 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా క‌ర్ణాట‌క‌, మైసూరులోని మైసూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐ.బీ.సీ.ఏ) ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. పులుల సంరక్షణ కేంద్రాల నిర్వహణ సమర్థతపై రూపొందించిన 5వ సారాంశ నివేదిక - ‘పులుల సంరక్షణ కోసం అమృత్ కాల్ దృష్టి’ ప్రచురణలను ప్రధానమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అఖిల భారత పులుల (5వ) అంచనా సారాంశ నివేదికలో పులుల సంఖ్యను ప్రకటించారు. టైగర్‌ పాజెక్టు 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒక స్మారక నాణేన్ని కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు.

In the last eight years, relations between India and Japan have reached new heights: PM

August 28th, 08:06 pm

PM Modi addressed a programme marking the commemoration of 40 years of Suzuki in India. The Prime Minister said, The success of Maruti-Suzuki also signifies the strong India-Japan partnership. In the last eight years, these relations between our two countries have reached new heights.

భారతదేశంలో సుజుకి వ్య‌వ‌స్థాప‌న‌కు 40 ఏళ్లు నిండిన సందర్భంగా గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 28th, 05:08 pm

భారతదేశంలో సుజుకి వ్య‌వ‌స్థాప‌న‌కు 40 ఏళ్లు నిండిన సందర్భంగా గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్‌లో జపాన్ రాయబారి గౌరవనీయ సతోషి సుజుకి, గుజరాత్ ముఖ్యమంత్రి, శ్రీ భూపేంద్ర పటేల్, పార్లమెంటు సభ్యుడు, శ్రీ సి.ఆర్.పాటిల్, రాష్ట్ర మంత్రి శ్రీ జగదీష్ పంచాల్, సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రస్తుత అధ్యక్షుడు శ్రీ టి.సుజుకి మాజీ అధ్యక్షుడు శ్రీ ఒ.సుజుకి, మారుతి-సుజుకి చైర్మన్ శ్రీ ఆర్.సి.భార్గవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొనగా, జపాన్‌ ప్రధానమంత్రి మాననీయ ఫుమియో కిషిడా పంపిన వీడియో సందేశం ప్రదర్శించబడింది.

రోటరీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి - ప్రసంగం

June 05th, 09:46 pm

రోటరీ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ స్థాయిలో జరుగుతున్న ప్రతి రోటరీ సమావేశం ఒక చిన్న- ప్రపంచ కూటమి లాంటిది. ఇందులో వైవిధ్యం ఉంది. చైతన్యం ఉంది. మీ రొటేరియన్ లు అందరూ మీ మీ స్వంత రంగాల్లో విజయం సాధించినప్పటికీ, మీ వ్యాపకానికి మాత్రమే మీరు పరిమితం కాలేదు. మన ప్రపంచం అంతా బాగుండాలనే మీ కోరిక మిమ్మల్ని ఈ వేదికపైకి తీసుకొచ్చింది. ఇది విజయం మరియు సేవ యొక్క నిజమైన మిశ్రమంగా నేను భావిస్తున్నాను.

రోట‌రీ ఇంట‌ర్నేష‌న‌ల్ అంత‌ర్జాతీయ స‌మ్మేళ‌నాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

June 05th, 09:45 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా రోట‌రీ ఇంట‌ర్నేష‌న‌ల్ వ‌ర‌ల్డ్ క‌న్వెన్ష‌న్‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. రోటేరియ‌న్లు విజ‌య్ం, సేవ ల నిజ‌మైన క‌ల‌యిక‌కు ప్ర‌తిబింబం అన్నారు.ఈ స్థాయిలో ప్ర‌తి రోట‌రీ స‌మావేశం ఒక మినీ గ్లోబ‌ల్ అసెంబ్లీ వంటిద‌ని అన్నారు. ఇందులో వైవిధ్య‌త‌, చైత‌న్యం రెండూ ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు.

లైఫ్ ఉద్య‌మ ప్రారంభోత్స‌వంలో ప్ర‌ధాని ప్ర‌సంగం

June 05th, 07:42 pm

నా స్నేహితుడు శ్రీ బిల్ గేట్స్ కు, శ్రీ అనిల్ దాస్ గుప్తాకు భార‌త‌దేశ పర్యావ‌ర‌ణశాఖ మంత్రి శ్రీ భూపేంద‌ర్ యాద‌వ్ లకు న‌మ‌స్కారాలు..

PM launches global initiative ‘Lifestyle for the Environment- LiFE Movement’

June 05th, 07:41 pm

Prime Minister Narendra Modi launched a global initiative ‘Lifestyle for the Environment - LiFE Movement’. He said that the vision of LiFE was to live a lifestyle in tune with our planet and which does not harm it.

‘లైఫ్ మూవ్ మెంట్’ అనే ఒక ప్రపంచ కార్యక్రమాన్ని జూన్ 5 న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

June 04th, 02:08 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 జూన్ 5వ తేదీ న సాయంత్రం 6 గంటల వేళ కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రపంచ కార్యక్రమం ‘‘పర్యావరణం కోసం జీవనశైలి ఉద్యమం’’ (లైఫ్ స్టయిల్ ఫార్ ద ఎన్ వైరన్ మెంట్.. లైఫ్) ను ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభం ‘లైఫ్ గ్లోబల్ కాల్ ఫార్ పేపర్స్’ ను కూడా ఆరంభించనుంది. దేని ద్వారా అయితే ప్రపంచం అంతటా వ్యక్తులు, సముదాయాలు మరియు సంస్థల కు పర్యావరణ చైతన్య సహిత జీవన శైలి ని అనుసరించడం కోసం ప్రభావితం చేయడం మరియు వారిని కోరే క్రమం లో విద్య రంగ ప్రముఖులు, విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధన సంస్థల వంటి వాటి ఆలోచనల ను, సలహాల ను ఆహ్వానిస్తుంది. ప్రధాన మంత్రి కార్యక్రమం సందర్భం లో ముఖ్యోపన్యాసం కూడా చేయనున్నారు.

విప‌త్తుల‌ను త‌ట్టుకునే మౌలిక స‌దుపాయాల‌పై అంత‌ర్జ‌జాతీయ స‌ద‌స్సు ప్రారంభ స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

May 04th, 12:15 pm

విప‌త్తుల‌ను త‌ట్టుకునే మౌలిక‌స‌దుపాయాల‌కు సంబంధించి అంత‌ర్జాతీయ స‌ద‌స్సు నాలుగ‌వ ఎడిష‌న్‌లో మీతో క‌లిసి పాల్గొన‌డం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంద‌ర్భంగా మ‌నం ముఖ్యంగా గుర్తుంచుకోవ‌ల‌సింది, సుస్థిరాభివృద్ధి ల‌క్ష్యాల‌కు సంబంధించి ఏ ఒక్క‌రినీ మ‌రిచిపోకూడ‌ద‌న్న‌ది . అందుకే నిరుపేద‌లు, అత్యంత ద‌య‌నీయ‌స్థితిలో ఉన్న వారి అవ‌స‌రాల‌ను తీర్చేందుకు మ‌నం క‌ట్టుబ‌డి ఉన్నాం. వారి ఆకాంక్ష‌లు నెర‌వేర్చేందుకు అధునాత‌న మౌలిక‌స‌దుపాయాల‌ను నిర్మించ‌డం ద్వారా దీనిని సాధించేందుకు క‌ట్టుబడి ఉన్నాం. అలాగే మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న అంటే కేవ‌లం మూల‌ధ‌న ఆస్తుల‌ను స‌మ‌కూర్చ‌డం ,దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డి రాబ‌డి స‌మ‌కూర్చ‌డం మాత్ర‌మే కాదు.

ఇంటర్ నేశనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రస్ట్రక్చర్యొక్క నాలుగో అంతర్జాతీయ సమ్మేళనం ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించినప్రధాన మంత్రి

May 04th, 10:29 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఇంటర్ నేశనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రస్ట్రక్చర్’ తాలూకు నాలుగో అంతర్జాతీయ సమ్మేళనం ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఈ రోజున వీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించారు. సమ్మేళనం లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్, ఘనా అధ్యక్షుడు శ్రీ నానా ఎడో డంక్ వా అకూఫో-ఎడో, జపాన్ ప్రధాని శ్రీ ఫూమియో కిశీదా మరియు మేడాగాస్కర్ అధ్యక్షుడు శ్రీ ఆంద్రో నిరీనా రాజోలినా లు కూడా ప్రసంగించారు.

డెన్మార్క్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన తెలుగు అనువాదం

May 03rd, 07:11 pm

గౌరవనీయ డెన్మార్క్‌ ప్రధానమంత్రిగారూ... మీ దేశంలో నాకు, మా ప్రతినిధి బృందానికి అద్భుత రీతిలో స్వాగతమిచ్చినందుకు ముందుగా మీకు, మీ బృందానికి ధన్యవాదాలు. ఈ అందమైన దేశంలో నాకిదే తొలి పర్యటన. గత సంవత్సరం అక్టోబరులో మీకు భారతదేశంలో స్వాగతం పలికే అవకాశం నాకు లభించింది. ఈ రెండు పర్యటనల నేపథ్యంలో మన స్నేహ సంబంధాలను మరింత సన్నిహితం, గతిశీలం చేసే వీలు కలిగింది. మన రెండు దేశాలూ ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ, నియమబద్ధ పాలన తదితర విలువలను మాత్రమేగాక అనేక పరస్పర సహాయక బలాలను పంచుకుంటున్నాం.

ఉమ్మడి ప్రకటన : భారత-జర్మనీ 6వ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు

May 02nd, 08:28 pm

జ‌ర్మ‌న్ చాన్స‌ల‌ర్ ఓలాఫ్ షోల్జ్, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌హాధ్య‌క్ష‌త‌న నేడు ఫెడ‌ర‌ల్ రిప‌బ్లిక్ ఆఫ్ జ‌ర్మ‌నీ, రిప‌బ్లిక్ ఆఫ్ ఇండియా ఆర‌వ విడ‌త అంత‌ర్-ప్ర‌భుత్వ సంప్ర‌దింపులు నిర్వ‌హించాయి. ఇద్ద‌రు నాయ‌కులు కాకుండా ఉభ‌య దేశాల మంత్రులు, అనుబంధంలో పేర్కొన్న ఉన్న‌త ప్ర‌తినిధుల ప్ర‌తినిధివ‌ర్గాలు కూడా ఈ స‌మావేశంలో పాల్గొన్నాయి.

యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాన మంత్రితో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగ పాఠం

April 22nd, 12:22 pm

ప్రధానమంత్రిగా భారతదేశానికి ఇది అతని మొదటి పర్యటన కావచ్చు, కానీ పాత స్నేహితుడిగా, అతనికి భారతదేశం గురించి బాగా తెలుసు మరియు అర్థం చేసుకున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం-యుకె సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాన మంత్రి జాన్సన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

భారతదేశం- ఆస్ట్రేలియా వర్చువల్ సమిట్

March 17th, 08:30 pm

ఆస్ట్రేలియా రెండో వర్చువల్ సమిట్ ను నిర్వహించనున్నారు. 2020వ సంవత్సరం లో జూన్ 4వ తేదీ నాడు జరిగిన చరిత్రాత్మకమైనటువంటి ఒకటో వర్చువల్ సమిట్ లో ఈ సంబంధాన్ని ఒక సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యం గా ఉన్నతీకరించిన పరిణామాని కి తరువాయి గా ఈ శిఖర సమ్మేళనం చోటు చేసుకోనుంది.

"ఎనర్జీ ఫర్ సస్టైనబుల్ గ్రోత్"పై బడ్జెట్ అనంతర వెబ్‌నార్‌లో ప్రధానమంత్రి ప్రసంగం

March 04th, 11:05 am

'ఎనర్జీ ఫర్ సస్టైనబుల్ గ్రోత్' అనేది మన ప్రాచీన సంప్రదాయాల నుండి ప్రేరణ పొందిన, భవిష్యత్తు అవసరాలు మరియు ఆకాంక్షలను నెరవేర్చే సాధనం కూడా. సుస్థిరమైన ఇంధన వనరుల ద్వారానే సుస్థిర వృద్ధి సాధ్యమని భారత్‌కు స్పష్టమైన దృక్పథం ఉంది. గ్లాస్గోలో, మేము 2070 నాటికి నికర-సున్నా (ఉద్గారాలు)కి చేరుకుంటామని హామీ ఇచ్చాము.

‘ఎనర్జీ ఫార్ సస్ టేనబుల్టీ గ్రోథ్’ పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించిప్రసంగించిన ప్రధాన మంత్రి

March 04th, 11:03 am

‘ఎనర్జీ ఫార్ సస్ టేనబుల్ గ్రోథ్’ (చిరస్థాయి వృద్ధి కోసం శక్తి) పై ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రసంగించారు. బడ్జెటు సమర్పణ అనంతరం ప్రధాన మంత్రి ప్రసంగించిన వెబినార్ ల పరంపర లో ఇది తోమ్మిదో వెబినార్.

పరిశ్రమ లోని వివిధ రంగాల కు చెందిన కంపెనీల సిఇఒ లతో సమావేశమైన ప్రధానమంత్రి

December 20th, 09:07 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పరిశ్రమ కు చెందిన వివిధ రంగాల లోని కంపెనీ ల ముఖ్య నిర్వహణ అధికారుల తో లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఈ రోజు న సమావేశమయ్యారు. తరువాతి కేంద్ర బడ్జెట్ సమర్పణ కు గడువు సమీపిస్తుండగా పరిశ్రమ ప్రతినిధుల తో ప్రధాన మంత్రి ఈ విధం గా జరిపిన రెండో సమావేశం ఇది.

గ్లాస్ గో లో సిఒపి26 శిఖర సమ్మేళనం లో భాగం గా ‘ఎక్సెలరేటింగ్క్లీన్ టెక్నాలజీ ఇనొవేశన్ ఎండ్ డిప్లాయ్ మెంట్’ అంశం పైజరిగిన సదస్సు లో ప్రధాన మంత్రి ప్రసంగం

November 02nd, 07:45 pm

ఈ రోజు న ‘ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్’ ప్రారంభ సందర్భం లో మీకు అందరి కి ఇదే స్వాగతం. నేను ఎన్నో సంవత్సరాలు గా ఆలోచిస్తూ వచ్చిన ‘వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్’ కు అంతర్జాతీయ సౌర కూటమి (ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్.. ఐఎస్ఎ) తో పాటు యుకె యొక్క గ్రీన్ గ్రిడ్ ఇనిశియేటివ్ ల వంటి కార్యక్రమం తో ఈ రోజు న ఒక నిర్దిష్టమైనటువంటి రూపు లభించింది. ఎక్స్ లన్సిజ్, పారిశ్రామిక విప్లవానికి శిలాజ ఇంధనాలు దన్ను గా నిలచాయి. శిలాజ ఇంధనాల ను ఉపయోగించుకొని అనేక దేశాలు సమృద్ధం అయ్యాయి కానీ, మన భూమి, మన పర్యావరణం పేదవి అయిపోయాయి. శిలాజ ఇంధనాల కోసం ఆరాటపడడం తో భౌగోళిక - రాజకీయ ఉద్రిక్తత లు దాపురించాయి. కానీ ఈ రోజు న సాంకేతిక విజ్ఞానం మనకు ఒక ఉత్తమమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని ఇచ్చింది.

యు.కె. లోని గ్లాస్గో లో సి.ఓ.పి-26 సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో సమావేశమైన - ప్రధానమంత్రి

November 02nd, 07:16 pm

గ్లాస్గో లో జరిగే సి.ఓ.పి-26 సదస్సు నేపథ్యంలో, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నఫ్తాలీ బెన్నెట్ ను, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2021 నవంబర్, 2వ తేదీన కలిశారు. ఇద్దరు ప్రధానమంత్రులు పరస్పరం సమావేశం కావడం ఇదే మొదటిసారి.