
మారిషస్ ప్రధానమంత్రితో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 24th, 09:54 pm
మారిషస్ ప్రధానమంత్రి గౌరవనీయ డాక్టర్ నవీన్‌చంద్ర రామ్‌గులామ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం (ఈ నెల 24న) టెలిఫోన్‌లో మాట్లాడారు.
శ్రీ నారాయణ గురు, మహాత్మాగాంధీ చర్చల శతాబ్ది కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం
June 24th, 11:30 am
బ్రహ్మర్షి స్వామి సచ్చిదానంద గారు, శ్రీమఠం స్వామి శుభాంగ నందా గారు, స్వామి శారదానంద గారు, గౌరవనీయులైన సాధువులందరూ, ప్రభుత్వంలో నా సహచరులు శ్రీ జార్జ్ కురియన్ గారు, పార్లమెంట్‌లో నా సహచరులు శ్రీ అదూర్ ప్రకాష్ గారు, ఇతర సీనియర్ ప్రముఖులు, మహిళలు, గౌరవనీయులైన పెద్దలందరూ,
శ్రీ నారాయణ గురు, మహాత్మాగాంధీ మధ్య చారిత్రక చర్చ జరిగి శతాబ్ది అవుతోన్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
June 24th, 11:00 am
గొప్ప ఆధ్యాత్మిక, నైతిక విలువలు కలిగిన మహానుభావులు శ్రీ నారాయణ గురు.. మహాత్మాగాంధీల మధ్య జరిగిన చారిత్రక చర్చకు శతాబ్ధి అవుతోన్న సందర్భంగా దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన దేశ చరిత్రలోనే అద్భుతమైన ఘట్టానికి ఈ వేదిక సాక్ష్యంగా నిలుస్తోందన్నారు. మన స్వాతంత్రోద్యమానికి ఈ ఇద్దరు మహానుభావుల మధ్య జరిగిన చారిత్రక చర్చ కొత్త దిశానిర్దేశం చేసిందని.. స్వాతంత్య్ర లక్ష్యాలకు, స్వతంత్ర భారత్ కలకు నిర్దిష్ట అర్థాన్నించిందని పేర్కొన్నారు. “100 సంవత్సరాల క్రితం జరిగిన శ్రీ నారాయణ గురు- మహాత్మాగాంధీల సమావేశం నేటికీ స్ఫూర్తిదాయకంగా, సందర్భోచితంగా ఉంది. సామాజిక సామరస్యం, అభివృద్ధి చెందిన భారత్ విషయంలో సమష్టి లక్ష్యాల కోసం ఉత్తేజానిచ్చే వనరుగా పనిచేస్తోంది” అని వ్యాఖ్యానించారు. ఈ చారిత్రాక శతాబ్ధి సందర్భంగా శ్రీ నారాయణ గురు పాదాలకు నమస్కరించిన ప్రధాని.. మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.శ్రీ నారాయణ గురు-మహాత్మాగాంధీల సంభాషణ శతాబ్ది ఉత్సవాలను రేపు ప్రారంభించనున్న ప్రధానమంత్రి
June 23rd, 05:24 pm
ఆధ్యాత్మికత, నైతిక విలువలను బోధించిన గొప్ప నాయకులు శ్రీ నారాయణ గురు - మహాత్మాగాంధీల మధ్య జరిగిన చారిత్రాత్మక సంభాషణ శతాబ్ది ఉత్సవాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఆంధోనీ అల్బనీజ్ రెండోసారి ఎన్నికైనందుకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 06th, 02:41 pm
మాన్య శ్రీ ఆంధోనీ అల్బానీజ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్‌లో ఈ రోజు మాట్లాడారు. ఆస్ట్రేలియాకు 32వ ప్రధానిగా తిరిగి ఎన్నికై చరిత్ర సృష్టించినందుకు ఆయనను శ్రీ మోదీ అభినందించారు.పాడ్ క్యాస్ట్‌లో లెక్స్ ఫ్రిడ్మాన్‌తో ప్రధాని సంభాషణకు తెలుగు అనువాదం
March 16th, 11:47 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి.” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్ తో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 16th, 05:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి..” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.Prime Minister engages in an insightful conversation with Lex Fridman
March 15th, 07:01 pm
PM Modi had an engaging and thought-provoking conversation with renowned podcaster and AI researcher Lex Fridman. The discussion, lasting three hours, covered perse topics, including PM Modi’s childhood, his formative years spent in the Himalayas, and his journey in public life. This much-anticipated podcast is set to be released on March 16, 2025.Politics is about winning people's hearts, says PM Modi in podcast with Nikhil Kamath
January 10th, 02:15 pm
Prime Minister Narendra Modi engages in a deep and insightful conversation with entrepreneur and investor Nikhil Kamath. In this discussion, they explore India's remarkable growth journey, PM Modi's personal life story, the challenges he has faced, his successes and the crucial role of youth in shaping the future of politics.పారిశ్రామికవేత్త నిఖిల్ కామత్‌తో తన తొలి పాడ్‌కాస్ట్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ
January 10th, 02:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన తొలి పాడ్‌కాస్ట్ ద్వారా పారిశ్రామికవేత్త, పెట్టుబడిదారు నిఖిల్ కామత్‌తో వివిధ అంశాలపై ముచ్చటించారు. ఈ సందర్భంగా తన బాల్యం గురించి వాకబు చేసినపుడు ఎలాంటి దాపరికం లేకుండా ఆయనతో చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. ఉత్తర గుజరాత్‌లోని మెహసానా జిల్లా పరిధిలోగల వద్‌నగర్ అనే చిన్న పట్టణంతో ముడిపడిన తన మూలాలను ప్రముఖంగా ప్రస్తావించారు. గైక్వాడ్ల రాజ్యంలో భాగమైన ఈ పట్టణం విద్యారంగంపై నిబద్ధతకు ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. అక్కడ ఓ చెరువు, తపాలా కార్యాలయం, గ్రంథాలయం వంటి సౌకర్యాలు కూడా ఉండేవని చెప్పారు. గైక్వాడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, భాగవతాచార్య నారాయణాచార్య ఉన్నత పాఠశాలల్లో తన విద్యాభ్యాసం నాటి రోజులను ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఈ జ్ఞాపకాల్లో భాగంగా ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఈ మేరకు వద్‌నగర్‌లో చాలాకాలం బసచేసిన చైనా తత్త్వవేత్త షాన్‌జాంగ్‌పై తీసిన చలన చిత్రం గురించి తానొకసారి చైనా రాయబార కార్యాలయానికి రాశానని గుర్తుచేసుకున్నారు. అలాగే 2014లో తాను ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ఒక అనుభవాన్ని ప్రస్తావిస్తూ- భారత పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గుజరాత్‌లోని వద్‌నగర్ సందర్శనకు ఆసక్తి చూపారని తెలిపారు. తమ స్వస్థలాలతో షాన్‌జాంగ్‌కుగల చారిత్రక సంబంధాన్ని ఈ సందర్భంగా ఆయన ఉటంకించినట్లు పేర్కొన్నారు. రెండు దేశాల ఉమ్మడి వారసత్వాన్ని, బలమైన సంబంధాలను ఈ అనుబంధం ప్రస్ఫుటం చేస్తున్నదని ఆయన అన్నారు.