India is moving ahead with the principle of ‘Think Big, Dream Big, Act Big: PM Modi
July 26th, 11:28 pm
PM Modi dedicated to the International Exhibition-cum-Convention Centre (IECC) complex at Pragati Maidan in New Delhi. He said, “Bharat Mandapam is a call for India’s capabilities and new energy of the nation, it is a philosophy of India’s grandeur and willpower.”న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అంతర్జాతీయ ప్రదర్శన- సమావేశ కేంద్ర (ఐఇసిసి) ప్రాంగణానికి ప్రధాని ప్రారంభోత్సవం
July 26th, 06:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అంతర్జాతీయ ప్రదర్శన-సమావేశ కేంద్రం (ఐఇసిసి) సముదాయాన్ని ప్రారంభించారు. అలాగే జి-20 స్మారక నాణెం, తపాలా బిళ్లను కూడా ఆయన ఆవిష్కరించారు. డ్రోన్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమావేశ కేంద్రానికి ‘భారత్ మండపం’గా ప్రధాని నామకరణం చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకించారు. ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా దాదాపు రూ.2700 కోట్లతో జాతీయ ప్రాజెక్టు కింద ‘ఐఇసిసి’ సముదాయాన్ని నిర్మించారు. ప్రగతి మైదాన్‌లో రూపుదిద్దుకున్న ఈ నవ సౌధం ప్రపంచ వ్యాపార గమ్యంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో తనవంతు తోడ్పాటునిస్తుంది. ఈ సందర్భంగా జాతి హృదయాల్లో ఉప్పొంగిన ఉత్సాహాన్ని, మనోభావాల్లోని ఉత్తేజాన్ని సూచించే ఒక పద్యంతో ప్రధానమంత్రి తన ప్రసంగం ప్రారంభించారు. “భారత మండపం దేశ సామర్థ్యానికి, నవశక్తికి మారుపేరు. ఇది భారతదేశ వైభవాన్ని, సంకల్ప శక్తిని చాటే సిద్ధాంతం” అని ఆయన వ్యాఖ్యానించారు.పిఎమ్ గతి శక్తి - నేశనల్ మాస్టర్ ప్లాన్ ఫార్ మల్టీ-మాడల్ కనెక్టివిటీ ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 13th, 11:55 am
కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ నితిన్ గడ్కరీ గారు, శ్రీ పీయూష్ గోయల్ గారు, శ్రీ హర్ దీప్ సింగ్ పురి గారు, శ్రీ సర్బానంద సోనోవాల్ గారు, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు, శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారు, శ్రీ రాజ్ కుమార్ సింగ్ గారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, పరిశ్రమ సహచరులు, ఇతర ప్రముఖులు మరియు నా ప్రియమైన సోదర సోదరీమణులు,పిఎమ్ గతి శక్తి ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 13th, 11:54 am
‘పిఎమ్ గతి శక్తి - నేశనల్ మాస్టర్ ప్లాన్ ఫార్ మల్టీ-మాడల్ కనెక్టివిటీ’ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ ప్రారంభించారు. ప్రగతి మైదాన్ లో న్యూ ఎగ్జిబిశన్ కాంప్లెక్స్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు శ్రీ నితిన్ గడ్ కరీ, శ్రీ పీయూష్ గోయల్, శ్రీ హర్ దీప్ సింహ్ పురీ, శ్రీ సర్బానంద సొణొవాల్, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, ఇంకా శ్రీ అశ్విని వైష్ణవ్, శ్రీ ఆర్.కె. సింహ్ లతో పాటు ముఖ్యమంత్రులు, లెఫ్టెనంట్ గవర్నర్ లు, రాష్ట్రాల మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా పాలుపంచుకొన్నారు. పారిశ్రామిక రంగం నుంచి ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్ మన్ శ్రీ కుమార్ మంగళం బిర్ లా, ట్రాక్టర్స్ ఎండ్ ఫార్మ్ ఇక్విప్ మెంట్స్ సిఎమ్ డి మల్లిక శ్రీనివాసన్ గారు, సిఐఐ ప్రెసిడెంట్ మరియు టాటా స్టీల్ కు సిఇఒ, ఎండి అయిన శ్రీ నరేంద్రన్, రివిగో సహ వ్యవస్థాపకుడు శ్రీ దీపక్ గర్గ్ లు ఈ సందర్భం లో వారి వారి ఆలోచనల ను వెల్లడించారు.జులై 15న వారాణసీ ని సందర్శించనున్న ప్రధాన మంత్రి
July 13th, 06:18 pm
ప్రధాన మంత్రి 2021 జులై 15న వారాణసీ ని సందర్శించనున్నారు. ఆయన తన యాత్ర లో భాగం గా అనేక అభివృద్ధి పథకాల ను ప్రారంభించడమే కాక కొన్ని పథకాల కు శంకుస్థాపన లు చేయనున్నారు.