మూడు ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను , అత్యధిక సామర్ధ్యం కలిగిన కంప్యూటింగ్ సిస్టమ్ ను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం
September 26th, 05:15 pm
గౌరవ ఎలక్ట్రానిక్స్, ఐటి శాఖల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, దేశంలోని వివిధ పరిశోధనా సంస్థల గౌరవ డైరెక్టర్లు, ప్రముఖ సీనియర్ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు , పరిశోధకులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులు మహిళలు , పెద్దలు!మూడు ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 26th, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా దాదాపు రూ.130 కోట్ల విలువైన మూడు ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను జాతికి అంకితం చేశారు. ‘నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్’ (ఎన్ఎస్ఎం) కింద దేశీయంగా రూపొందించిన ఈ సూపర్ కంప్యూటర్లను పుణె, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో ఏర్పాటు చేశారు. దేశంలో నిర్వహించే అగ్రగామి పరిశోధనలకు ఇవి ఇతోధికంగా తోడ్పడతాయి. దీంతోపాటు వాతావరణం, వాతావరణ మార్పులపై పరిశోధనల కోసం రూపొందించిన ‘హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్‌పిసి) వ్యవస్థ’ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.