ఆస్ట్రేలియా ప్రధానితో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జారీచేసిన పత్రికా ప్రకటనకు తెలుగు అనువాదం
March 10th, 12:50 pm
భారతదేశానికి మొదటిసారిగా అధికార పర్యటన మీద వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానికి నా హృదయ పూర్వక స్వాగతం. రెండు దేశాల ప్రధాన మంత్రుల స్థాయిలో వార్షిక శిఖరాగ్ర సమావేశాలు జరపాలని నిరుడు రెండు దేశాలూ నిర్ణయించాయి. ఈ క్రమంలో ప్రధాని అల్బనీస్ సందర్శన మొదటిది. హోలీ రోజే ఆయన భారత దేశానికి వచ్చారు. ఆ తరువాత కొంత సేపు మేం క్రికెట్ మైదానంలో గడిపాం. ఈ రంగుల పండుగ వేడుకలు, సంస్కృతి, క్రికెట్ ఒక విధంగా ఇరు దేశాల ఉత్సాహానికీ, స్ఫూర్తికీ సరైన చిహ్నం.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి తరఫున భారతదేశం కోసం ప్రత్యేక వాణిజ్య ప్రతినిధి గౌరవనీయులు టోనీ అబాట్ మధ్య సమావేశం
August 05th, 06:19 pm
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి తరఫున భారతదేశం కోసం ప్రత్యేక వాణిజ్య ప్రతినిధి హోదాలో 2021 ఆగష్టు 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి గౌరవనీయులు టోనీ అబోట్ ను, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కలుసుకున్నారు.