కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్- కామన్వెల్త్ అటార్నీ.. సొలిసిటర్స్ జనరల్స్ కాన్ఫరెన్స్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

February 03rd, 11:00 am

ఈ సదస్సును ప్రారంభించడం నాకెంతో ఆనందదాయకం. ప్రపంచవ్యాప్తంగాగల ప్రముఖ న్యాయకోవిదులు ఈ సదస్సుకు హాజరు కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఈ సందర్భంగా 140 కోట్ల మంది భారతీయుల తరపున మా అంతర్జాతీయ అతిథులందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. అద్భుత భారతదేశంలోని ప్రతి అణువునూ ఆమూలాగ్రం ఆస్వాదించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.

‘క్లియా’ కామన్వెల్త్ అటార్నీలు.. సొలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్-2024ను ప్రారంభించిన ప్రధానమంత్రి

February 03rd, 10:34 am

కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (క్లియా)-నిర్వహించిన కామన్వెల్త్ అటార్నీలు.. సొలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్ (సిఎఎస్‌జిసి)-2024ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించారు. ‘‘న్యాయ ప్రదానంలో సీమాంతర సవాళ్లు’’ ఇతివృత్తంగా నిర్వహించబడుతున్న ఈ సదస్సులో న్యాయవ్యవస్థ పరివర్తన-న్యాయవాద వృత్తిపరమైన నైతిక కోణాలు వంటి చట్టం-న్యాయం సంబంధిత కీలకాంశాలు; కార్యనిర్వాహక వ్యవస్థ జవాబుదారీతనం; ఆధునిక న్యాయ విద్యపై పునఃసమీక్ష తదితరాలపై చర్చిస్తారు.

ఫిబ్రవరి 3 వతేదీ నాడు సిఎల్ఇఎ - కామన్‌వెల్థ్ అటార్నీస్ ఎండ్ సలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్2024 ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

February 02nd, 11:10 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 3 వ తేదీ న ఉదయం పూట సుమారు 10 గంటల వేళ కు విజ్ఞాన్ భవన్ లో కామన్‌వెల్థ్ లీగల్ ఎడ్ యుకేశన్ అసోసియేశన్ (సిఎల్ఇఎ) - కామన్‌వెల్థ్ అటార్నీస్ ఎండ్ సలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్ (సిఎఎస్‌జిసి) 2024 ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో హాజరు అయ్యే జనసమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.