మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సంయుక్త కమాండర్ల సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి

April 01st, 08:36 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సంయుక్త సైనిక కమాండర్ల సదస్సుకు హాజరయ్యారు. “సంసిద్ధ-సముద్ధరిత-సముచిత” సాయుధ బలగాలు ఇతివృత్తంగా మూడు రోజులపాటు ఈ సమావేశం నిర్వహించబడింది. జాతీయ భద్రత, భవిష్యత్తు కోసం సంయుక్త సైనిక బలగాల దృక్పథం రూపకల్పనసహా వివిధ రకాల అంశాలపై ఈ సందర్భంగా చర్చలు సాగాయి. అదేవిధంగా ‘స్వయం సమృద్ధి’ సాధనసహా సాయుధ బలగాల సన్నద్ధత, రక్షణ పర్యావరణ వ్యవస్థలో పురోగతిని కూడా సమీక్షించారు.

గుజరాత్‌లోని కెవాడియాలో జరిగిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ వీడ్కోలు స‌మావేశంలో ప్ర‌సంగించిన‌ ప్రధాన‌మంత్రి

March 06th, 08:30 pm

గుజరాత్‌లోని కెవాడియాలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ వీడ్కోలు స‌మావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది సదస్సులో జరిగిన చర్చల గురించి ర‌క్ష‌ణ సిబ్బంది చీఫ్ ప్రధాన మంత్రికి వివరించారు. సదస్సు నిర్వ‌హ‌ణ‌, ఎజెండా పట్ల ప్రధాని ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ ఏడాది సదస్సులో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు, నాన్ కమీషన్డ్ ఆఫీసర్లను చేర్చడాన్ని దేశ ప్ర‌ధాని ప్రత్యేకంగా అభినందించారు.

PM to visit Kerala

December 14th, 10:38 am