ఆస్ట్రియా ఛాన్స‌ల‌ర్ తో క‌లిసి ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఉమ్మ‌డి ప‌త్రికా ప్ర‌క‌ట‌న

July 10th, 02:45 pm

హృద‌య పూర్వ‌క స్వాగ‌తాన్ని ప‌లికి, ఆతిథ్య‌మందించినందుకు మొట్ట‌మొద‌ట‌గా ఛాన్స‌ల‌ర్ నెహ‌మ‌ర్ కు నా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను. ప్ర‌ధానిగా మూడోసారి బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత ఆస్ట్రియాలో ప‌ర్య‌టించే అవ‌కాశం ల‌భించినందుకు చాలా సంతోషంగా వుంది. నా ఈ ప‌ర్య‌ట‌న చారిత్రాత్మ‌క‌మైన‌ది, ప్ర‌త్యేక‌మైన‌ది. 41 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఆస్ట్రియాలో ప‌ర్య‌టిస్తున్న భార‌తీయ ప్ర‌ధానిగా నాకు గుర్తింపు ల‌భించింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు 75 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంటున్న సంద‌ర్భంలో నేను ప‌ర్య‌టించ‌డం కాక‌తాళీయం, సంతోష‌కరం.

2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని ప్రారంభోపన్యాసం

November 17th, 04:03 pm

2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ప్రారంభ సమావేశానికి 140 కోట్ల మంది భారతీయుల తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అనేది 21 వ శతాబ్దంలో మారుతున్న ప్రపంచానికి అత్యంత ప్రత్యేకమైన వేదిక. భౌగోళికంగా, గ్లోబల్ సౌత్ ఎల్లప్పుడూ ఉనికిలో ఉంది. కానీ ఇలాంటి వాయిస్ రావడం ఇదే తొలిసారి. మనందరి సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైంది. మేము 100 కంటే ఎక్కువ వేర్వేరు దేశాలను కలిగి ఉన్నాము, కానీ మాకు ఒకే రకమైన ప్రయోజనాలు మరియు ఒకే విధమైన ప్రాధాన్యతలు ఉన్నాయి.