ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలితో ప్రధానమంత్రి భేటీ
November 19th, 08:34 am
రియో డి జెనీరో లో జరుగుతున్న జి-20 సమావేశాల నేపథ్యంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలు జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. 2024 జూన్, ఇటలీలోని ‘పూలీయా’ లో జార్జియా మెలోనీ అధ్యక్షతన ఏర్పాటైన జి-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన భేటీ అనంతరం ఇరువురు నేతల మధ్య జరిగిన నేటి సమావేశం గత రెండేళ్ళలో అయిదోది. ఎన్నో సమస్యల మధ్య చేపట్టిన జి-7 అధ్యక్ష పదవికి సమర్ధమైన నేతృత్వం అందిస్తున్నందుకు శ్రీ మోదీ ఇటలీ ప్రధానమంత్రి మెలోనీకి అభినందనలు తెలియజేశారు.నవంబరు 13న బీహార్ లో ప్రధాన మంత్రి పర్యటన
November 12th, 08:26 pm
బీహార్‌లో ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల కల్పనకు ఊతాన్ని అందించే దిశలో, రూ.1260 కోట్ల పైచిలుకు విలువ కలిగిన అఖిల భారత వైద్య విజ్ఞానశాస్త్ర సంస్థ (ఎయిమ్స్), దర్భంగా నిర్మాణ పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎయిమ్స్ లో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని, ఆయుష్ బ్లాకును, వైద్య కళాశాలను, నర్సింగ్ కళాశాలను, రాత్రి బస చేయడానికి ఉద్దేశించిన వసతి సదుపాయాన్ని, నివాస భవన సముదాయాన్ని, తదితర హంగులను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎయిమ్స్ మూడో అంచె ఆరోగ్య సంరక్షణ సేవలను బీహార్ ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అందించనుంది.స్వచ్ఛ ఇంధనం మన తక్షణ అవసరం : ప్రధానమంత్రి
October 21st, 05:20 pm
స్వచ్ఛ ఇంధనం మన తక్షణ అవసరమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వ్యాఖ్యానించారు. మెరుగైన రేపటి కోసం ప్రభుత్వ నిబద్ధత చాలా ముఖ్యమైనదిగా ఉందనీ, అది తమ ప్రభుత్వ కృషిలో కనిపిస్తున్నదని అన్నారు.వాస్తవ పత్రం (ఫ్యాక్ట్ షీట్) : 2024 క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు
September 22nd, 12:06 pm
సెప్టెంబర్ 21, 2024 న, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ డెలావేర్ లోని విల్మింగ్టన్ లో నాల్గవ క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు కోసం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిడా ఫ్యూమియో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లకు ఆతిథ్యం ఇచ్చారు.ఉమ్మడి వాస్తవ పత్రం: సమగ్ర, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య విస్తరణను కొనసాగించనున్న అమెరికా, ఇండియా
September 22nd, 12:00 pm
అమెరికా, భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం 21వ శతాబ్దపు కీలక భాగస్వామ్యమని, ఇది ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడే అద్భుత అజెండాను నిశ్చయాత్మకంగా ముందుకు తెస్తున్నదని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పునరుద్ఘాటించారు.విల్మింగ్టన్ డిక్లరేషన్‌పై ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా నేతల సంయుక్త ప్రకటన
September 22nd, 11:51 am
ఈరోజు, అమెరికా అధ్యక్షులు జోసెఫ్ ఆర్.బిడెన్ జూనియర్ తన స్వస్థలమైన డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో ఆతిథ్యమిచ్చిన క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులోఆయనతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో సమావేశమయ్యాం .సురక్షితమైన అంతర్జాతీయ స్వచ్ఛ ఇంధన సరఫరా వ్యవస్థల నిర్మాణం కోసం అమెరికా- భారత్ చొరవకు మార్గదర్శ ప్రణాళిక
September 22nd, 11:44 am
ఉమ్మడి జాతీయ, ఆర్థిక భద్రతకు సంబంధించిన పరస్పర అంశాలపై సహకారాన్ని మరింత పెంచుకోవాలని అమెరికా, భారత్ లు మరింత సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఆర్థిక పరమైన అజెండాలో స్వచ్ఛ ఇంధనానికి పెద్దపీట వేయడం ద్వారా ప్రజలకు ఉన్నతోద్యోగాలను కల్పించవచ్చనీ, స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రపంచవ్యాప్తం చేయవచ్చుననీ, అంతర్జాతీయ పర్యావరణ లక్ష్యాలను అందుకోవడం కూడా సాధ్యం అవుతుందని ఇరుదేశాలూ నిర్ణయించుకున్నాయి.గ్రీన్ హైడ్రోజన్ రెండో అంతర్జాతీయ సమావేశంలో ప్రధానమంత్రి వీడియో సందేశం- ప్రసంగ పాఠం
September 11th, 10:40 am
శాస్త్రవేత్తలు, నూతన ఆవిష్కర్తలు, పరిశ్రమ రంగ ప్రముఖులు, నా ప్రియ మిత్రులారా, మీకందరికీ ఇవే నా స్నేహపూర్వక శుభాభినందనలు. గ్రీన్ హైడ్రోజన్ అంశంపై ఏర్పాటు చేసిన రెండో అంతర్జాతీయ సమావేశానికి మిమ్ములను అందరినీ ఆహ్వానించడం సంతోషాన్ని ఇస్తోంది.గ్రీన్ హైడ్రోజన్ పై 2వ అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
September 11th, 10:20 am
హరిత ఉదజనిపై 2వ అంతర్జాతీయ సదస్సుకు హాజరైన ప్రముఖులకు సాదర స్వాగతం పలికి ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రపంచం చాలా కీలకమైన మార్పు దిశగా వెళుతోందని ఆయన పేర్కొన్నారు. వాతావరణ మార్పు అనేది కేవలం భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాదని, దాని ప్రభావం ఇప్పుడే కనిపిస్తోందన్న అవగాహన పెరుగుతోందని ఆయన చెప్పారు. “కార్యచరణ చేపట్టాల్సిన సమయం ఇక ఆసన్నమైంది” అని శ్రీ మోదీ చెప్పారు. ప్రపంచ విధాన చర్చల్లో ఇంధన పరివర్తన, సుస్థిరత అనేది కేంద్రబిందువుగా మారిందని ఆయన పేర్కొన్నారు.భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం (2024-2028) అమలుకు కార్యాచరణ ప్రణాళిక
August 22nd, 08:22 pm
భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక అమలు దిశగా రెండు దేశాల ప్రధానమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ భాగస్వామ్యం ద్వారా ద్వైపాక్షిక సహకారం వేగం పుంజుకోవడాన్ని 2024 ఆగస్టు 22న వార్సాలో సమావేశం సందర్భంగా వారిద్దరూ గుర్తించారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా 2024-28 మధ్య ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన-అమలుకు ఉభయపక్షాలూ అంగీకారానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో కింది ప్రాధాన్యాంశాల పరంగా ద్వైపాక్షిక సహకారానికి ప్రణాళిక మార్గనిర్దేశం చేస్తుంది:‘‘వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు’’పై భారత-పోలెండ్ సంయుక్త ప్రకటన
August 22nd, 08:21 pm
పోలెండ్ ప్రధానమంత్రి మాననీయ డోనాల్డ్ టస్క్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 21,22 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు. ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన 70వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న సమయంలో ఈ చారిత్రక పర్యటన చోటు చేసుకుంది.పోలండ్ ప్రధానితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనల ఆంగ్ల అనువాదం
August 22nd, 03:00 pm
అందమైన వార్సా నగరంలో సాదర స్వాగతం, మర్యాదపూర్వకమైన ఆతిథ్యం అలాగే స్నేహపూర్వక మాటలు అందించిన ప్రధాన మంత్రి టస్క్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.జపాన్ స్పీకర్, ఆయన ప్రతినిధివర్గంతో ప్రధానమంత్రి భేటీ
August 01st, 09:55 pm
జపాన్ ప్రతినిధుల సభ స్పీకర్ నుకాగా ఫుకుషిరో; జపాన్ పార్లమెంటు సభ్యులు, జపాన్ కు చెందిన ప్రధాన కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యాపార ప్రతినిధులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. శక్తివంతమైన భారత-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ స్థాయి భాగస్వామ్యం గురించి కూడా వారు ప్రత్యేకంగా చర్చించారు. అలాగే కీలక రంగాల్లో సహకారం, పరస్పర ప్రయోజనకర రంగాల్లో ప్రజల మధ్య సహకారం విస్తరణ గురించి; భారత, జపాన్ దేశాల మధ్య పార్లమెంటరీ ప్రతినిధివర్గాల మార్పిడి ప్రాధాన్యం గురించి కూడా పునరుద్ఘాటించారు.I consider industry, and also the private sector of India, as a powerful medium to build a Viksit Bharat: PM Modi at CII Conference
July 30th, 03:44 pm
Prime Minister Narendra Modi attended the CII Post-Budget Conference in Delhi, emphasizing the government's commitment to economic reforms and inclusive growth. The PM highlighted various budget provisions aimed at fostering investment, boosting infrastructure, and supporting startups. He underscored the importance of a self-reliant India and the role of industry in achieving this vision, encouraging collaboration between the government and private sector to drive economic progress.భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) నిర్వహించిన ‘‘జర్నీ టువార్డ్స్ వికసిత్ భారత్: ఎ పోస్ట్ యూనియన్ బడ్జెట్ 2024-25 కాన్ఫరెన్స్’’ ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
July 30th, 01:44 pm
భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఈ రోజు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన ‘‘జర్నీ టువార్డ్స్ వికసిత్ భారత్: ఎ పోస్ట్ యూనియన్ బడ్జెట్ 2024-25 కాన్ఫరెన్స్’’ (అభివృద్ధి చెందిన భారతదేశం దిశగా పయనం: 2024-25 కేంద్ర బడ్జెట్ అనంతర సమావేశం) ప్రారంభ సదస్సును ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వృద్ధి కోసం ప్రభుత్వం అమలుపరుస్తున్న విశాల దృష్టికోణం రూపు రేఖలను, అందులో పరిశ్రమ పోషించవలసిన పాత్రను వివరించాలన్న లక్ష్యంతో ఈ సదస్సు ను ఏర్పాటు చేశారు. పరిశ్రమ, ప్రభుత్వం, దౌత్య సముదాయం, మేధావి వర్గం తదితర రంగాలకు చెందిన ఒక వేయి మందికి పైగా ఈ సమావేశానికి స్వయంగా హాజరు కాగా, దేశ, విదేశాలలోని వివిధ సిఐఐ కేంద్రాల నుంచి చాలా మంది ఈ సమావేశంతో అనుసంధానమయ్యారు.India is the Future: PM Modi
February 26th, 08:55 pm
Prime Minister Narendra Modi addressed the News 9 Global Summit in New Delhi today. The theme of the Summit is ‘India: Poised for the Big Leap’. Addressing the gathering, the Prime Minister said TV 9’s reporting team represents the persity of India. Their multi-language news platforms made TV 9 a representative of India's vibrant democracy, the Prime Minister said. The Prime Minister threw light on the theme of the Summit - ‘India: Poised for the Big Leap’, and underlined that a big leap can be taken only when one is filled with passion and enthusiasm.న్యూస్9 ప్రపంచ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
February 26th, 07:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఇవాళ ‘న్యూస్9 ప్రపంచ సదస్సు’లో ప్రసంగించారు. ఈ మేరకు ‘‘భారత్: భారీ ముందంజకు సిద్ధం’’ ఇతివృత్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ- టీవీ9 పత్రికా విలేకరుల బృందం భారతదేశ వైవిధ్యాన్ని ప్రస్ఫుటం చేస్తున్నదని ప్రధాని పేర్కొన్నారు. ఆ సంస్థ నడుపుతున్న బహుభాషా వార్తావేదికలు ‘టీవీ9’ను సచేతన భారత ప్రజాస్వామ్యానికి ప్రతినిధిగా నిలుపుతున్నాయని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా సదస్సు ఇతివృత్తం ‘‘భారత్: భారీ ముందంజకు సిద్ధం’’ను ప్రస్తావిస్తూ- అనురక్తి, ఉత్సాహం ఉప్పొంగుతున్నపుడు ఎంత భారీ స్థాయిలోనైనా దూసుకెళ్లడం సాధ్యమేనని ప్రధాని స్పష్టం చేశారు. ఇందుకు తగిన ప్రయోగవేదికను 10 సంవత్సరాల కృషితో సిద్ధం చేశామని, ఈ దిశగా భారత్ ఆత్మవిశ్వాసం, ఆకాంక్షలను ప్రస్తుత సదస్సు ఇతివృత్తం కూడా ప్రతిబింబిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. గడచిన పదేళ్లలో దేశ పరివర్తనాత్మకతకు ఆలోచన ధోరణి, ఆత్మవిశ్వాసం, సుపరిపాలన మూల సూత్రాలుగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు.There is continuous progress in bilateral trade, investment between India and Kenya: PM Modi
December 05th, 01:33 pm
Addressing the event during the visit of the President of Kenya to India, PM Modi said, Africa has always been given high priority in India's foreign policy. Over the past decade, we have strengthened our collaboration with Africa in mission mode. I am confident that President Ruto's visit will not only enhance our bilateral relations but also provide new impetus to our engagement with the entire African continent.Climate action should be based on principles of equality, climate justice, shared responsibilities: PM
December 01st, 03:55 pm
Prime Minister Narendra Modi addressed the inauguration of the High Level Segment of HoS/HoG of COP-28 in Dubai. Addressing the event, The Prime Minister said, I believe that climate action should be based on principles of equality, climate justice, shared responsibilities, and shared capacities. By adhering to these principles, we can move towards a sustainable future where no one is left behind.In NEP traditional knowledge and futuristic technologies have been given the same importance: PM Modi
July 29th, 11:30 am
PM Modi inaugurated Akhil Bhartiya Shiksha Samagam at Bharat Mandapam in Delhi. Addressing the gathering, the PM Modi underlined the primacy of education among the factors that can change the destiny of the nation. “Our education system has a huge role in achieving the goals with which 21st century India is moving”, he said. Emphasizing the importance of the Akhil Bhartiya Shiksha Samagam, the Prime Minister said that discussion and dialogue are important for education.