భాషా గౌరవ్ సప్తాహ్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

November 03rd, 06:14 pm

అసోం ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేస్తూ, భాషా గౌరవ్ సప్తాహ్ ( #BhashaGauravSaptah) ప్రాముఖ్యాన్ని గురించి ప్రధానంగా పేర్కొన్నారు. సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని ఇస్తూ, అస్సామీ భాషకు శాస్త్రీయ భాష హోదాను ఇటీవలే ప్రకటించిన సంగతిని గుర్తుకు తీసుకు వచ్చారు. ఈ హోదా తో, భాష పరంగా, సాంస్కృతిక వారసత్వం పరంగా అసోం ప్రాంతానికి ఉన్న సంపన్నతకు ముఖ్య గుర్తింపు దక్కింది. దీంతో సర్వత్రా ఉత్సాహభరిత వాతావరణం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.

పాళీ భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బుద్దుని బోధనలు విశ్వసించే వారిలో ఆనందాన్ని నింపింది: ప్రధాన మంత్రి

October 24th, 10:43 am

పాళీ భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం బుద్ధ భగవానుని బోధనలను అనుసరిస్తున్న వారిలో ఆనందోత్సాహాలు నింపుతుందని అన్నారు. కొలంబోలో ఐసీసీఆర్ నిర్వహించిన ‘ప్రాచీన భాషగా పాళీ’ అనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న పండితులు, బౌద్ధ భిక్షువులకు ధన్యవాదాలు తెలిపారు.

అంతర్జాతీయ అభిధమ్మ దివస్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

October 17th, 10:05 am

సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు జీ, భదంత్ రాహుల్ బోధి మహాథెరో జీ, గౌరవ జాంగ్‌చుప్ చోడెన్ జీ, మహాసంఘ గౌరవ సభ్యులు, ప్రముఖులు, దౌత్య సంఘం సభ్యులు, బౌద్ధ పండితులు, బుద్ధుని బోధనలను ఆచరిస్తున్నవారు, సోదరసోదరీమణులారా.

అంతర్జాతీయ అభిధమ్మ దివస్ వేడుకలు, ప్రాచీన భాషగా పాళీ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

October 17th, 10:00 am

అంతర్జాతీయ అభిధమ్మ దివస్ వేడుకలు, ప్రాచీన భాషగా పాళీకి గుర్తింపు వచ్చిన సందర్భంగానూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. అభిధమ్మను బోధించిన అనంతరం స్వర్గం నుంచి బుద్ధుడు తిరిగి వచ్చిన రోజును అభిధమ్మ దివస్‌గా పాటిస్తారు. బుద్ధుని అభిధమ్మ బోధనలు పాళీ భాషలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాచీన భాషగా పాళీకి ఇటీవల దక్కిన గుర్తింపు... ఈ ఏడాది అభిధమ్మ దివస్ వేడుకల ప్రాధాన్యాన్ని పెంచింది.

అక్టోబర్ 17న జరిగే అంతర్జాతీయ అభిధామ్ దివస్ వేడుకలు, శాస్త్రీయ భాషగా పాళీని గుర్తించే కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి

October 15th, 09:14 pm

అక్టోబర్ 17 న జరిగే అంతర్జాతీయ అభిధామ్ దివస్ ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొంటారు. ఈ వేడుకలు న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాల్లో పాళీ భాషను శాస్త్రీయ భాషగా గుర్తించే కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తారు.