ఎన్డిటివి వరల్డ్ సమ్మిట్ లో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు అనువాదం
October 21st, 10:25 am
ఎన్ డిటివి వరల్డ్ సమ్మిట్ కు హాజరైన గౌరవ అతిథులందరికీ స్వాగతం. ఈ సదస్సులో మీరు వివిధ అంశాలపై చర్చించనున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రపంచ నాయకులు కూడా తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.న్యూఢిల్లీలో ‘ఎన్‌డిటివి’ ప్రపంచ సదస్సు-2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 21st, 10:16 am
గత నాలుగైదేళ్ల ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ- ప్రపంచ భవిష్యత్తు సంబంధిత ఆందోళనలపై చర్చలు ఒక సాధారణ ఇతివృత్తంగా మారిపోయాయయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా కోవిడ్, ఆ మహమ్మారి అనంతర ఆర్థిక ఒత్తిడి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వాతావరణ మార్పు సమస్యలు, కొనసాగుతున్న యుద్ధాలు, సరఫరా శ్రేణిలో వినూత్న మార్పులు, అమాయక జనం మరణాలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఇటీవలి సంఘర్షణల సవాళ్లు వగైరాలన్నీ ప్రపంచ శిఖరాగ్ర సమావేశాల్లో చర్చనీయాంశాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇదే సమయాన భారత్ మాత్రం తన శతాబ్ది వేడుకల నిర్వహణ గురించి చర్చిస్తున్నదని ప్రకటించారు. ‘‘ప్రపంచమంతా పీకల్లోతు సంక్షోభంలో మునిగితే, భారత్ ఆశాకిరణంగా ఉద్భవించింద’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ స్థితిగతులు, దాని ముందున్న సవాళ్లతో భారత్ ప్రభావితమైనప్పటికీ, వాటిని అధిగమించగల ఆశావహ దృక్పథం కొరవడలేదని స్పష్టం చేశారు.గుజరాత్, గాంధీనగర్ లో రీ ఇన్వెస్ట్ 2024 కార్యక్రమ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధాని ప్రసంగం
September 16th, 11:30 am
జర్మనీ ఆర్థిక సహకార మంత్రి , డెన్మార్క్ పరిశ్రమల వ్యాపార మంత్రితో సహా విదేశాల నుండి వచ్చిన విశిష్ట అతిథులూ , నా మంత్రి మండలి సభ్యులు ప్రహ్లాద్ జోషి జీ, శ్రీపాద్ నాయక్ జీ , పలు దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు...గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన (రీ-ఇన్వెస్ట్)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం
September 16th, 11:11 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గాంధీనగర్‌లోగల మహాత్మా మందిర్‌లో ‘ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన’ (రీ-ఇన్వెస్ట్)ను ప్రారంభించారు. మన దేశం 200 గిగావాట్ల శిలాజేతర ఇంధన స్ధాపిత సామర్థ్యం సాధించడంలో సహకరించిన కీలక భాగస్వాములను ఈ మూడు రోజుల శిఖరాగ్ర సదస్సులో భారత్ సత్కరిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ-ప్రైవేట్ రంగ కంపెనీలు, అంకుర సంస్థలు, ప్రధాన పారిశ్రామిక సంస్థలలో అత్యాధునిక ఆవిష్కరణలతో సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను శ్రీ మోదీ తిలకించారు.మార్చి 4,6 తేదీల్లో తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాలలో ప్రధాన మంత్రి పర్యటన
March 03rd, 11:58 am
మార్చి 4న ఉదయం 10.30 గంటలకు తెలంగాణలోని ఆదిలాబాద్ లో రూ.56,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు తమిళనాడు కల్పక్కంలోని భవిని ని సందర్శిస్తారు.బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్, టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవం మరియు బోయింగ్ సుకన్య ప్రోగ్రామ్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం
January 19th, 03:15 pm
కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్ గారు, ముఖ్యమంత్రి శ్రీ సిద్దరామయ్య గారు, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, ఆర్ అశోక్ గారు, భారతదేశంలో బోయింగ్ కంపెనీ సిఒఒ స్టెఫానీ పోప్, ఇతర పరిశ్రమ భాగస్వాములు, మహిళలు మరియు పెద్దమనుషులు!అత్యధునాతనమైన బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ కేంపస్ ను కర్నాటక లోని బెంగళూరు లోప్రారంభించిన ప్రధాన మంత్రి
January 19th, 02:52 pm
అత్యధునాతనమైనటువంటి బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ (బిఐఇటిసి) కేంపసు ను కర్నాటక లోని బెంగళూరు లో ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1,600 కోట్ల రూపాయల పెట్టుబడి తో నిర్మాణం పూర్తి అయిన ఈ 43 ఎకరాల విస్తీర్ణం లో ఏర్పాటైన కేంపస్ యుఎస్ఎ కు వెలుపల బోయింగ్ పెట్టిన అతి పెద్ద పెట్టుబడి అని చెప్పాలి. శరవేగం గా వృద్ధి చెందుతున్నటువంటి దేశ విమానయాన రంగం లో భారతదేశం లో వివిధ ప్రాంతాల యువతులు అధిక సంఖ్య లో ప్రవేశించడాని కి వీలుగా వారిని ప్రోత్సహించాలన్న లక్ష్యం తో రూపుదిద్దిన బోయింగ్ సుకన్య కార్యక్రమాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.గ్రీస్ లోని ఏథెన్స్ లో భారతీయులనుద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 25th, 09:30 pm
వేడుకల వాతావరణం, పండుగ ఉత్సాహం ఉన్నప్పుడు ఎవరైనా త్వరగా తమ కుటుంబ సభ్యుల మధ్య ఉండాలని కోరుకుంటారు.నేను కూడా నా కుటుంబ సభ్యుల మధ్యకు వచ్చాను. ఇది ఒక రకంగా శివుని మాసంగా భావించే శ్రావణ మాసం, ఈ పవిత్ర మాసంలో మన దేశం ఒక కొత్త మైలురాయిని సాధించింది. చంద్రుడి డార్క్ జోన్ అయిన దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రుడిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, భారత సామర్థ్యాలను యావత్ ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రపంచం నలుమూలల నుంచి అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు తమ శుభాకాంక్షలను పంపుతున్నారు, మరియు ప్రజలు మిమ్మల్ని కూడా అభినందిస్తున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను, కాదా? మీకు చాలా అభినందనలు కూడా వస్తున్నాయి కదా? ప్రతి భారతీయుడు దీనిని అందుకుంటున్నాడు. సోషల్ మీడియా మొత్తం అభినందన సందేశాలతో నిండిపోయింది. విజయం అంత ముఖ్యమైనప్పుడు, ఆ విజయం కోసం ఉత్సాహం స్థిరంగా ఉంటుంది. మీరు ప్రపంచంలో ఎక్కడైనా జీవించవచ్చు, కానీ భారతదేశం అనే భావన మీ హృదయంలో బలంగా ఉంటుందని మీ ముఖం కూడా చెబుతుంది. భారతదేశం మీ గుండె లయలో ఉంటుంది, భారతదేశం మీ గుండె లయలో ఉంటుంది, భారతదేశం మీ గుండె లయలో ఉంటుంది. ఈ రోజు, నేను మీ అందరి మధ్య గ్రీస్ లో ఉన్నాను, చంద్రయాన్ యొక్క అద్భుతమైన విజయానికి మరోసారి నేను ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.ఏథెన్స్ లో ఉంటున్న భారతీయ సముదాయం తో మాట్లాడిన ప్రధాన మంత్రి
August 25th, 09:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25 వ తేదీ నాడు ఏథెన్స్ లోని ఏథెన్స్ కన్సర్వేటాయర్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.హెలికాప్టర్ల కోసం పనితీరు-ఆధారిత నావిగేషన్‌పై ఆసియాలో తొలి ప్రదర్శనకు ప్రధానమంత్రి ప్రశంస
June 02nd, 08:43 pm
హెలికాప్టర్ల కోసం పనితీరు ఆధారిత నావిగేషన్ దిశగా ‘గగన్’ ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో జుహూ నుంచి పుణె ప్రయాణం ద్వారా ఆసియాలో తొలి ప్రదర్శన నిర్వహించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.ప్రధాన మంత్రి ఇటీవల తాను పాల్గొన్నవిమానాశ్రయ సంబంధి కార్యక్రమాల దృశ్యాల ను శేర్ చేశారు
April 12th, 07:24 pm
పౌర విమానయానం శాఖ కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇచ్చారు; కేంద్ర మంత్రి తన ట్వీట్ లో పౌర విమానయాన సంబంధి మౌలిక సదుపాయాల అభివృద్ధి కై ఆర్థిక సంవత్సరం 2023 లో అయిన మూలధన వ్యయం అంత వరకు ఎన్నడూ లేనంత అధికంగా ఉన్న సంగతి ని తెలియ జేశారు.'మిషన్ మోడ్‌లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం'పై బడ్జెటు అనంతర వెబ్‌నార్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 03rd, 10:21 am
ఈ వెబ్‌నార్‌కు హాజరైన ప్రముఖులందరికీ స్వాగతం. నేటి నవ భారతం కొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోంది. ఈ ఏడాది బడ్జెట్‌కు పెద్ద ఎత్తున ప్రశంసలు రావడంతో దేశ ప్రజలు చాలా సానుకూలంగా తీసుకున్నారు. అదే పాత వర్క్ కల్చర్ కొనసాగితే, ఇలాంటి బడ్జెట్ వెబ్‌నార్ల గురించి ఎవరూ ఆలోచించరు. కానీ నేడు మన ప్రభుత్వం బడ్జెట్‌ను సమర్పించే ముందు మరియు తర్వాత ప్రతి వాటాదారులతో వివరంగా చర్చించి, వారిని వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వెబ్‌నార్ బడ్జెట్ యొక్క గరిష్ట ఫలితాలను పొందడంలో, బడ్జెట్ ప్రతిపాదనలను నిర్ణీత గడువులోపు అమలు చేయడంలో మరియు బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.ప్రభుత్వాధినేతగా పనిచేసినప్పుడు నాకు 20 ఏళ్లకు పైగా అనుభవం ఉందని మీకు కూడా తెలుసు. ఈ అనుభవం యొక్క సారాంశం ఏమిటంటే, పాలసీ నిర్ణయంలో వాటాదారులందరూ పాలుపంచుకున్నప్పుడు, ఆశించిన ఫలితం కూడా కాలపరిమితిలోపు వస్తుంది. గత కొన్ని రోజులుగా జరిగిన వెబ్‌నార్లలో వేలాది మంది మాతో చేరడం చూశాం. ప్రతి ఒక్కరూ రోజంతా మేధోమథనం చేస్తూనే ఉన్నారు మరియు భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమైన సూచనలు వచ్చాయని నేను చెప్పగలను. ప్రతి ఒక్కరూ బడ్జెట్‌పై దృష్టి సారించారు మరియు ఎలా ముందుకు సాగాలనే దానిపై చాలా మంచి సూచనలు ఉన్నాయి. ఈ రోజు మనం దేశంలోని పర్యాటక రంగం పరివర్తన కోసం ఈ బడ్జెట్ వెబ్‌నార్‌ను నిర్వహిస్తున్నాము.‘పర్యటన రంగాన్ని మిశన్ మోడ్ లో అభివృద్ధి చేయడం’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 03rd, 10:00 am
‘‘పర్యటన రంగాన్ని మిశన్ మోడ్ లో అభివృద్ధి పరచడం’’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. యూనియన్ బడ్జెటు 2023 లో ప్రకటించిన కార్యక్రమాల ను ప్రభావశీలమైన విధం గా అమలు పరచడం కోసం ఉపాయాల ను మరియు సూచనల ను కోరుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడ్జెటు అనంతర వెబినార్ లు పన్నెండిటి లో ఈ వెబినార్ ఏడో వెబినార్ గా ఉంది.విమానయాన రంగం ప్రజల ను చేరువ చేస్తుండడం తో పాటు దేశ ప్రగతి ని కూడా పెంచుతోంది: ప్రధాన మంత్రి
February 22nd, 12:45 pm
దేశీయం గా వాయు మార్గం లో ప్రయాణించినటువంటి వారి సంఖ్య 4.45 లక్షల కు చేరుకొన్న తరుణం లో, విమానాశ్రయాల సంఖ్య అధికం కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. కోవిడ్ అనంతర కాలం లో వాయు మార్గ ప్రయాణికుల సంఖ్య లో ఒక క్రొత్త పెరుగుదల నమోదు అయింది.ఫ్రాన్స్ అధ్యక్షుడితో జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగానికి తెలుగు అనువాదం
February 14th, 04:31 pm
ముందుగా ఈ చరిత్రాత్మక ఒప్పందం చేసుకున్న ఎయిర్ ఇండియాకు, ఎయిర్ బస్ కు నా అభినందనలు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నా మిత్రుడైన అధ్యక్షుడు మాక్రన్ ను ప్రత్యేక ధన్యవాదాలు.ఎయిర్ ఇండియా-ఎయిర్‌బస్ భాగస్వామ్యాన్ని ప్రారంభించడంపై ఫ్రెంచ్ అధ్యక్షుడితో వర్చువల్ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు
February 14th, 04:30 pm
ఫ్రాన్స్ అధ్యక్షుడు హెచ్‌ఈతో వీడియో కాల్‌లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ఎయిర్ ఇండియా-ఎయిర్‌బస్ భాగస్వామ్యాన్ని ప్రారంభించిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్కోవిడ్ 19 కాలాని కంటే ముందు కాలం నుండి ఇప్పటి వరకు అత్యధికసంఖ్య లో ప్రయాణికుల కు సేవల ను అందించినందుకు గాను భారతదేశం పౌర విమాన యాన రంగాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి
October 11th, 10:26 am
భారతదేశం లో విమానయాన రంగం రోజువారీ 4 లక్షల మంది ప్రయాణికుల స్థాయి ని అందుకోవడం ఒక్కటే కాకుండా కోవిడ్ 19 విజృంభణ కాలం కంటే మునుపటి నుండి ఇప్పటి వరకు చూస్తే అత్యధిక సంఖ్య లో ప్రయాణికుల కు సేవల ను అందించినందుకు కూడా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసల ను వ్యక్తం చేశారు. భారతదేశం అంతటా కనెక్టివిటీ ని మరింత గా మెరుగుపరచడం పైన శ్రద్ధ వహించడం జరుగుతోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇది జీవనాన్ని సులభతరం గా తీర్చిదిద్దడం కోసం మరియు ఆర్థిక ప్రగతి కోసం ముఖ్యం అని కూడా ఆయన అన్నారు.స్వీడన్ ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి
May 04th, 02:28 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెండో ఇండియా-నార్డిక్ సమిట్ సందర్భం లో కోపెన్ హేగన్ లో స్వీడన్ ప్రధాని మేగ్డెలీనా ఎండర్ సన్ తో సమావేశమయ్యారు. ఇద్దరు నేతల మధ్య జరిగినటువంటి ఒకటో సమావేశం ఇది.పెద్దగా ఆలోచించండి, పెద్దగా కలలు కనండి మరియు వాటిని సాకారం చేయడానికి కష్టపడండి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
December 26th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం! ఈ సమయంలో మీరు 2021కి వీడ్కోలు చెప్తూ 2022కి స్వాగతం పలకడానికి సిద్ధమవుతూ ఉంటారు. ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ వచ్చే ఏడాదిలో రాబోయే సంవత్సరంలో మరింత మెరుగ్గా మారాలని, ఏదైనా మంచి చేయాలని సంకల్పం తీసుకోవడం జరుగుతుంది. గత ఏడు సంవత్సరాలుగా మన 'మన్ కీ బాత్' కూడా వ్యక్తి, సమాజం, దేశం మంచితనాన్ని ఎత్తిచూపుతోంది. మంచి చేయడానికి , మంచిగా మారడానికి స్ఫూర్తినిస్తోంది. ఈ ఏడేళ్లలో 'మన్ కీ బాత్' చేస్తున్నప్పుడు ప్రభుత్వం సాధించిన విజయాల గురించి కూడా చర్చించగలిగాను. మీరు దీన్ని ఇష్టపడ్డారు. మెచ్చుకున్నారు. కానీ మీడియాకు దూరంగా, వార్తాపత్రికల ఆకర్షణలకు దూరంగా చాలా మంది మంచి చేస్తున్నారనేది దశాబ్దాల అనుభవం. దేశ భవిష్యత్తు కోసం తమ నేటి కాలాన్ని వెచ్చిస్తున్నారు. వారు దేశంలోని రాబోయే తరాల కోసం తమ ప్రయత్నాలతో తీరిక లేకుండా ఉన్నారు. అలాంటి వ్యక్తుల చర్చ చాలా ఓదార్పునిస్తుంది. లోతైన స్ఫూర్తిని ఇస్తుంది. నా విషయంలో 'మన్ కీ బాత్' ఎప్పుడూ అలాంటి వారి కృషితో నిండిన అందమైన ఉద్యానవనం. 'మన్ కీ బాత్'లో ప్రతి నెలా నా ప్రయత్నం ఈ విషయంపైనే. ఆ తోటలోని ఏ పుష్పాదళాన్ని మీకోసం తీసుకురావాలా అని నేను ఆలోచిస్తాను. బహురత్న వసుంధరగా పేర్కొనే భారతదేశ పుణ్యకార్యాల ఎడతెగని ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నందుకు సంతోషిస్తున్నాను. దేశం అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు ఈ మానవశక్తి, ప్రజల శక్తి, ఆ శక్తి ప్రస్తావన, ప్రజల కృషి, భారతదేశ ప్రజలతో పాటు సమస్త మానవాళి ఉజ్వల భవిష్యత్తు కోసం హామీ ఇస్తుంది.కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ సమాజ భక్తికి నివాళి: ప్రధాని మోదీ
October 20th, 10:33 am
కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ సమాజం యొక్క విశ్వాసానికి భారతదేశం కేంద్రం అని అన్నారు. వారి భక్తికి నివాళిగా ప్రారంభించిన కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయ సదుపాయాన్ని ఆయన పేర్కొన్నారు.