ప్రధాని మోదీ మన్ కి బాత్ కోసం మీ ఆలోచనలు, సలహాలను పంచుకోండి

December 05th, 11:54 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం డిసెంబ‌ర్ 29 ఆదివారం నాడు తన 'మన్ కి బాత్' (మనసులో మాట)ను పంచుకుంటారు. మీరు వినూత్న సలహాలను మరియు అంతర్దృష్టులను కలిగి ఉంటే, ఇక్కడ నేరుగా ప్రధాని తో పంచుకునే అవకాశం ఉంది. కొన్ని సలహాలను ప్రధాని ఆయన ప్రసంగంలో ప్రస్తావిస్తారు.

భారతదేశంపై క్విజ్: పాల్గొనాలంటూ ప్రవాస భారతీయులకు విజ్ఞప్తి చేసిన ప్రధానమంత్రి

November 23rd, 09:15 am

భారతదేశం గురించి తెలుసుకోండి (భారత్ కో జానియే) అంటూ నిర్వహిస్తున్న క్విజ్ కార్యక్రమంలో ప్రవాస భారతీయులందరూ పాల్గొనాలంటూ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు భారతదేశంతో అనుసంధానమయ్యేందుకు ఈ క్విజ్ ఉపకరిస్తుందని ఆయన అన్నారు. మన వారసత్వం, జాజ్వల్యమానమైన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు లభించిన గొప్ప అవకాశంగా దీనిని అభివర్ణించారు.

24 నవంబర్ 2024న మన్ కీ బాత్ వినడానికి ట్యూన్ చేయండి

November 23rd, 09:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11 గంటలకు 'మన్ కి బాత్'లో పలు అంశాలను మరియు సమస్యలపై తన ఆలోచనలను పంచుకుంటారు. నరేంద్ర మోదీ యాప్ లో 'మన్ కి బాత్' ప్రత్యక్షంగా వినండి.

ప్రధాని మోదీ మన్ కి బాత్ కోసం మీ ఆలోచనలు, సలహాలను పంచుకోండి

November 05th, 01:28 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నవంబర్ 24ఆదివారం నాడు తన 'మన్ కి బాత్' (మనసులో మాట)ను పంచుకుంటారు. మీరు వినూత్న సలహాలను మరియు అంతర్దృష్టులను కలిగి ఉంటే, ఇక్కడ నేరుగా ప్రధాని తో పంచుకునే అవకాశం ఉంది. కొన్ని సలహాలను ప్రధాని ఆయన ప్రసంగంలో ప్రస్తావిస్తారు.

నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

October 27th, 11:30 am

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నా జీవితంలో మరపురాని క్షణాలేవని మీరు నన్ను అడిగితే చాలా సంఘటనలు గుర్తుకు వస్తాయి. కానీ చాలా ప్రత్యేకమైన మరపురాని ఒక క్షణం ఉంది- అది గత సంవత్సరం నవంబర్ 15 వ తేదీన జరిగింది. ఆరోజు నేను భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్‌లోని ఆయన జన్మస్థలమైన ఉలిహాతు గ్రామానికి వెళ్ళాను. ఈ యాత్ర నాపై చాలా ప్రభావం చూపింది. ఈ పుణ్యభూమి మట్టిని తలతో తాకే భాగ్యం పొందిన దేశ తొలి ప్రధానమంత్రిని నేనే. ఆ క్షణంలో స్వాతంత్య్ర పోరాటంలో ఉన్న శక్తి తెలిసిరావడమే కాకుండా ఈ భూ శక్తితో అనుసంధానమయ్యే అవకాశం కూడా వచ్చింది. ఒక సంకల్పాన్ని నెరవేర్చేందుకు చేసే సాహసం దేశంలోని కోట్లాది ప్రజల భవిష్యత్తును ఎలా మార్చగలదో నేను గ్రహించాను.

27 అక్టోబర్ 2024న మన్ కీ బాత్ వినడానికి ట్యూన్ చేయండి

October 26th, 09:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11 గంటలకు 'మన్ కి బాత్'లో పలు అంశాలను మరియు సమస్యలపై తన ఆలోచనలను పంచుకుంటారు. నరేంద్ర మోదీ యాప్ లో 'మన్ కి బాత్' ప్రత్యక్షంగా వినండి.

ప్రధాని మోదీ మన్ కి బాత్ కోసం మీ ఆలోచనలు, సలహాలను పంచుకోండి

October 05th, 04:49 pm

అక్టోబర్ 27ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్'ను పంచుకోనున్నారు. మీకు వినూత్న ఆలోచనలు మరియు సూచనలు ఉంటే, దానిని నేరుగా ప్రధానితో పంచుకోవడానికి ఇక్కడ ఒక అవకాశం ఉంది. కొన్ని సూచనలను ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావిస్తారు.

ఢిల్లీ పారిశుద్ధ్య కార్యక్రమం: యువతతో ప్రధానమంత్రి సంభాషణ

October 02nd, 04:45 pm

పరిశుభ్రత పాటించడం వల్ల వ్యాధులు దగ్గరికే రావు, పైగా ఎప్పుడూ శుభ్రంగా ఉండగలం. దేశాన్ని శుభ్రంగా ఉంచినప్పుడు, పర్యావరణ పరిశుభ్రత కూడా ఎంత ముఖ్యమో ప్రజలకు అర్ధమవుతుంది.

స్వచ్చతా హీ సేవ - 2024 కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం - తెలుగు అనువాదం

October 02nd, 10:15 am

నేడు పూజ్య బాపూజీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి. ఈ భరతమాత గొప్ప కుమారులకు వినమ్రంగా నమస్కరిస్తున్నాను. గాంధీజీ, ఇతర మహనీయులు భారతదేశం కోసం కన్న కలను సాకారం చేసేందుకు కలిసి పనిచేయడానికి ఈ రోజు మనందరికీ స్ఫూర్తినిస్తుంది.

స్వచ్ఛభారత్ దివస్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 02nd, 10:10 am

పరిశుభ్రత కోసం అత్యంత ముఖ్యమైన సామూహిక ఉద్యమాల్లో ఒకటైన స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గాంధీ 155వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ స్వచ్ఛభారత్ దివస్ 2024 కార్యక్రమం నిర్వహించారు. అమృత్, అమృత్ 2.0, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, గోబర్‌ధన్ పథకాల కింద పలు ప్రాజెక్టులతో పాటు మొత్తం రూ. 9600 కోట్ల విలువైన అనేక పారిశుధ్య, పరిశుభ్రతా ప్రాజెక్టులను ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ మోదీ శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. ‘స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత’ ఈ ఏడాది స్వచ్ఛతా హి సేవా నినాదం అని తెలిపారు.

గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 02nd, 09:38 am

గాంధీ జయంతి సందర్భంగా యువతతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాల్లో ఈ రోజు ప్రజలు పాల్గొనాలని, తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్‌ను బలోపేతం చేయాలని ఆయన కోరారు.

‘స్వచ్ఛ భారత్ మిషన్’కు పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో అక్టోబరు 2న ‘స్వచ్ఛ భారత్ దివస్-2024’లో పాల్గొంటున్న ప్రధాని

September 30th, 08:59 pm

పరిశుభ్రత దిశగా అత్యంత కీలక ప్రజా ఉద్యమాలలో ఒకటైన ‘స్వచ్ఛ భారత్ మిషన్’ (ఎస్‌బిఎం)కు శ్రీకారం చుట్టి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అక్టోబరు 2న గాంధీజీ 155వ జయంతి నాడు నిర్వహించే ‘స్వచ్ఛ భారత్ దివస్-2024’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 10:00 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

'మన్ కీ బాత్' శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన యాంకర్లు: ప్రధాని మోదీ

September 29th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంతో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇది చాలా పాత జ్ఞాపకాలతో నన్ను చుట్టుముట్టింది. కారణం మన 'మన్ కీ బాత్' ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. పదేళ్ల కిందట విజయదశమి పర్వదినమైన అక్టోబర్ 3వ తేదీన 'మన్ కీ బాత్' ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన ‘మన్ కీ బాత్’ పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటుంది. యాదృచ్ఛికంగా అది నవరాత్రుల మొదటి రోజు కావడం విశేషం.

29 సెప్టెంబర్ 2024న మన్ కీ బాత్ వినడానికి ట్యూన్ చేయండి

September 28th, 09:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11 గంటలకు 'మన్ కి బాత్'లో పలు అంశాలను మరియు సమస్యలపై తన ఆలోచనలను పంచుకుంటారు. నరేంద్ర మోదీ యాప్ లో 'మన్ కి బాత్' ప్రత్యక్షంగా వినండి.

స్వచ్ఛభారత్ మిషన్ ప్రభావాన్ని వెల్లడిస్తున్న నివేదికను ప్రజలతో పంచుకున్న ప్రధాని

September 05th, 04:11 pm

దేశంలో శిశు, బాలల మరణాలను తగ్గించడంలో స్వచ్ఛభారత్ మిషన్ వంటి కార్యక్రమాల ప్రభావాన్ని ప్రముఖంగా పేర్కొన్న ఓ శాస్త్రీయ నివేదికను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ప్రధాని మోదీ మన్ కి బాత్ కోసం మీ ఆలోచనలు, సలహాలను పంచుకోండి

September 05th, 04:06 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 29ఆదివారం నాడు తన 'మన్ కి బాట్' (మనసులో మాట) పంచుకుంటారు. మీరు వినూత్న సలహాలను మరియు ఆలోచనలు కలిగి ఉంటే, ఇక్కడ నేరుగా ప్రధానితో పంచుకునే అవకాశం ఉంది. కొన్ని సలహాలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావిస్తారు.

BJP's Rashtriya Sadasyata Abhiyan is to strengthen the country: PM Modi

September 02nd, 05:15 pm

Prime Minister Narendra Modi attended and addressed the BJP Rashtriya Sadasyta Abhiyan at BJP headquarters in New Delhi. He emphasized the party’s ongoing commitment to fostering a new political culture in India.

PM Modi addresses BJP Rashtriya Sadasyta Abhiyan at BJP Headquarter

September 02nd, 05:00 pm

Prime Minister Narendra Modi attended and addressed the BJP Rashtriya Sadasyta Abhiyan at BJP headquarters in New Delhi. He emphasized the party’s ongoing commitment to fostering a new political culture in India.

ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 31st, 10:39 pm

ఈటీ వరల్డ్ లీడర్స్ ఫోరం ఈ ఎడిషన్ కు హాజరైన ఇంతమంది సుపరిచిత ముఖాలను చూడటం ఆనందంగా ఉంది. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కు సంబంధించి ఇక్కడ ఉత్తమమైన చర్చలు జరిగాయని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ప్రపంచం మొత్తం భారతదేశంపై నమ్మకంగా ఉన్న సమయంలో ఈ సంభాషణలు జరిగాయి .

న్యూఢిల్లీలో ఎకనమిక్ టైమ్స్ ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్‌’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

August 31st, 10:13 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఇవాళ ఎకనమిక్ టైమ్స్ యాజమాన్యం నిర్వహించిన ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ వేదికపై దేశ ఉజ్వల భవిష్యత్తు దిశగా విలక్షణ రీతిలో చర్చలు సాగి ఉంటాయని ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచానికి భార‌త్‌పై నమ్మకం ఇనుమడిస్తున్న తరుణంలో సాగుతున్న ఈ చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు.