ప్రధానమంత్రి అధ్యక్షతన ఢిల్లీలో ప్రధాన కార్యదర్శుల నాలుగో జాతీయ సదస్సు

December 15th, 10:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలో ‘ప్రధాన కార్యదర్శుల నాలుగో జాతీయ సదస్సు’ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సదస్సును మూడు రోజుల పాటు 2024 డిసెంబరు 13 నుంచి 15 వరకు ఢిల్లీలో నిర్వహించారు.

అంతర్జాతీయ సహకార సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

November 25th, 03:30 pm

మీ అందరికీ ఈరోజు నేను స్వాగతం పలుకుతున్నానంటే, అది నేనొక్కడిని చేసింది కాదు.. నిజానికి నేనొక్కడినే చేయలేను కూడా. భారత్ లోని లక్షలాది మంది రైతులు, లక్షలాది మంది పశుపోషకులు, దేశంలోని మత్స్యకారులు, 8 లక్షలకు పైగా సహకార సంఘాలు, స్వయంసహాయక సంఘాల్లోని 10 కోట్ల మంది మహిళలు, సహకార సంఘాలను సాంకేతికతతో అనుసంధానిస్తున్న భారత యువత తరఫున – మిమ్మల్ని నేను భారత్ కు ఆహ్వానిస్తున్నాను.

2024-ఐసీఏ గ్లోబల్ సహకార సదస్సుని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 25th, 03:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2024-ఐసీఏ గ్లోబల్ సహకార సదస్సును ప్రారంభించారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ, భూటాన్ ప్రధానమంత్రి శ్రీ దాషో షెరింగ్ టోబ్‌గే, ఫిజీ ఉప ప్రధాన మంత్రి శ్రీ మనోవా కమికామికా, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా, భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ శ్రీ షోంబీ షార్ప్, అంతర్జాతీయ సహకార సమితి అధ్యక్షుడు శ్రీ ఏరియల్ గార్కో, విదేశీ ప్రముఖులు తదితరులకు శ్రీ మోదీ స్వాగతం పలికారు.

India is emphasizing the development of environmentally conscious energy sources to enhance our energy mix: PM Modi

February 06th, 12:00 pm

PM Modi inaugurated India Energy Week 2024 in Goa. India is the world's third largest energy, oil and LPG consumer. Furthermore, he said India is the fourth largest LNG importer and refiner along with the fourth largest mobile market.

ఇండియా ఎనర్జీ వీక్ 2024 ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

February 06th, 11:18 am

ఇండియా ఎనర్జీ వీక్ 2024 ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోవా లో ఈ రోజు న ప్రారంభించారు. ఇండియా ఎనర్జీ వీక్ 2024 అనేది భారతదేశం యొక్క అతి పెద్దది అయినటువంటి మరియు సర్వతోముఖమైనటువంటి శక్తి సంబంధి ఏకైక ప్రదర్శన, ఇంకా సమావేశం అని చెప్పాలి. శక్తి పరం గా పరివర్తన కై భారతదేశం నిర్దేశించుకొన్న లక్ష్యాల కు ఉత్ప్రేరకం గా ఉండేటట్టు ఎనర్జీ వేల్యూ చైన్ లోని వేరు వేరు భాగాల ను ఒక చోటు కు చేర్చడం ఈ కార్యక్రమం యొక్క ప్రధానోద్దేశ్యం గా ఉంది. గ్లోబల్ ఆయిల్ & గ్యాస్ సిఇఒ లతో మరియు నిపుణుల తో ఒక రౌండ్ టేబుల్ ను కూడా ప్రధాన మంత్రి నిర్వహించారు.

PM Modi interacts with the Indian community in Paris

July 13th, 11:05 pm

PM Modi interacted with the Indian diaspora in France. He highlighted the multi-faceted linkages between India and France. He appreciated the role of Indian community in bolstering the ties between both the countries.The PM also mentioned the strides being made by India in different domains and invited the diaspora members to explore opportunities of investing in India.

గుజరాత్ లో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం

August 13th, 11:01 am

కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ నితిన్ గడ్కరీ గారు, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ గారు, ఆటో పరిశ్రమతో సంబంధం ఉన్న భాగస్వాములందరూ, ఒ.ఎం.ఇ.ఎం సంఘాలు, మెటల్ మరియు స్క్రాపింగ్ పరిశ్రమ సభ్యులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్!

గుజరాత్ లో ఇన్వెస్టర్ సమిట్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

August 13th, 11:00 am

గుజరాత్ లో జరిగిన ఇన్వెస్టర్ సమిట్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. వాలంటరి వెహికల్ ఫ్లీట్ మోడర్నైజేశన్ ప్రోగ్రామ్ లేదా వెహికల్ స్క్రాపింగ్ పాలిసీ లో భాగం గా వెహికల్ స్క్రాపింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయడానికి అవసరమైన పెట్టుబడుల ను ఆహ్వానించడం కోసం ఈ శిఖర సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఒక ఏకీకృతమైన స్క్రాపింగ్ హబ్ ను అభివృద్ధి పరచడం కోసం అలంగ్ లో గల శిప్ బ్రేకింగ్ పరిశ్రమ అందిస్తున్నటువంటి అవకాశాల ను సైతం సమగ్రం గా వివరించనుంది. ఈ సందర్భం లో రోడ్డు రవాణా, హైవేస్ శాఖ కేంద్ర మంత్రి తో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి కూడా హాజరయ్యారు.

వెహికల్స్క్రాపేజి పాలిసి ఈ రోజు న ప్రారంభం కావడం భారతదేశం అభివృద్ధి యాత్ర లో ఒక ప్రముఖమైనటువంటిమైలురాయి గా ఉంది: ప్రధాన మంత్రి

August 13th, 10:22 am

ఈ రోజు న ప్రారంభమైన వెహికల్ స్క్రాపేజ్ పాలిసి భారతదేశం అభివృద్ధి ప్రస్థానం లో ఒక ప్రముఖమైనటువంటి మైలురాయి గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఆగ‌స్టు 13న ఇన్వెస్ట‌ర్ల శిఖ‌రాగ్ర‌స‌దస్సును ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ.

August 11th, 09:35 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈనెల 13 వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు గుజ‌రాత్‌లో ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్‌ను ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ప్ర‌సంగించ‌నున్నారు. వాలంట‌రీ వెహికిల్ ఫ్లీట్ మోడ‌ర్నైజేష‌న్ ప‌థ‌కం లేదా వెహికిల్ స్క్రాపింగ్ విధానం కింద పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించేందుకు ఈ స‌మ్మిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ స్క్రాపింగ్ హబ్ అభివృద్ధి కోసం అలాంగ్‌లో షిప్ బ్రేకింగ్ పరిశ్రమ అందించే స‌దుపాయాల‌పై కూడా ఇది దృష్టిని ఆకర్షిస్తుంది.