పురుషుల షాట్ పుట్ లో కాంస్య పతకాన్ని గెలిచిన క్రీడాకారుడు శ్రీ హొకాటో హొతోసే సేమాను అభినందించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 07th, 09:04 am
ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల షాట్ పుట్ ఎఫ్57 పోటీలో కంచు పతకాన్ని క్రీడాకారుడు శ్రీ హొకాటో హొతోసే సేమా గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను ఈ రోజు న అభినందించారు.కాంస్య విజేత మరియప్పన్ తంగవేలుకు ప్రధాని అభినందనలు
September 04th, 10:31 am
పారిస్ లో జరుగుతున్నపారాలింపిక్ క్రీడల్లో పురుషుల హైజంప్ టీ63 విభాగంలో కాంస్యం సాధించిన క్రీడాకారుడు మరియప్పన్ తంగవేలును ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు అభినందించారు.హైజంప్ టీ63 విభాగంలో రజత పతక విజేత శరద్ కుమార్ కు ప్రధాని శుభాకాంక్షలు
September 04th, 10:27 am
పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల హైజంప్ టీ63 విభాగంలో రజతం సాధించిన శరద్ కుమార్ కు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.కాంస్యం సాధించిన సుందర్ సింగ్ గుర్జర్ కు ప్రధాని అభినందనలు
September 04th, 10:25 am
పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 విభాగంలో కాంస్యం గెలుపొందిన సుందర్ సింగ్ గుర్జర్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందించారు.రజతం సాధించిన అజిత్ సింగ్ ను అభినందించిన ప్రధానమంత్రి
September 04th, 10:22 am
పారిస్ లో జరుగుతన్న పారాలింపిక్స్ 2024 క్రీడల్లో రజతం సాధించిన అజిత్ సింగ్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగంలో అజిత్ సింగ్ ఈ పతకం సాధించారు.పారాలింపిక్స్ కాంస్య పతక విజేత దీప్తి జీవాంజికి ప్రధాని అభినందనలు
September 04th, 06:40 am
పారిస్ పారాలింపిక్స్ లో మహిళల 400మీ.ల టీ20 విభాగంలో కాంస్య పతకం సాధించిన దీప్తి జీవాంజిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందించారు.బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నిత్య శ్రీ శివన్ ను అభినందించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ
September 03rd, 10:53 am
పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్ క్రీడల్లో కాంస్యం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నిత్య శ్రీ శివన్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు అభినందించారు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ హెచ్6 విభాగంలో ఆమె ఈ పతకం సాధించారు.పారాలింపిక్స్ లో జావెలిన్ పోటీలో శ్రీ సుమిత్ అంతిల్ బంగారు పతకాన్ని సాధించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
September 03rd, 12:01 am
ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల జావెలిన్ ఎఫ్64 పోటీలో క్రీడాకారుడు శ్రీ సుమిత్ అంతిల్ పసిడి పతకాన్ని గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను ఈ రోజు అభినందించారు.పారిస్ పారాలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన శీతల్ దేవి, రాకేశ్ కుమార్ లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
September 02nd, 11:40 pm
ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ ఆర్చరీ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొని క్రీడాకారులు శీతల్ దేవి గారు, రాకేశ్ కుమార్ లు సంఘటిత స్ఫూర్తిని చాటిచెప్పారంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం ప్రశంసించారు.బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సుహాస్ యతిరాజ్ కు ప్రధాని అభినందనలు
September 02nd, 11:35 pm
పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్ క్రీడల్లో రజతం సాధించిన సుహాస్ యతిరాజ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు అభినందించారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్ 4 విభాగంలో సుహాస్ ఈ పతకం సాధించారు.రజత పతకాన్ని గెలుచుకున్న బాడ్మింటన్ క్రీడాకారిణి తులసిమతి మురుగేశన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
September 02nd, 09:16 pm
ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో మహిళల బాడ్మింటన్ ఎస్‌యు5 పోటీలో తులసిమతి మురుగేశన్ వెండి పతకాన్ని గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం ఆమెకు అభినందనలను తెలియ జేశారు.కాంస్య పతక విజేత మనీషా రాందాస్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందనలు
September 02nd, 09:14 pm
పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్ క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్ ఎస్ యూ 5 విభాగంలో కాంస్యం సాధించిన మనీషా రాందాస్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందించారు.‘పారిస్ పారాలింపిక్స్ 2024’ లో మన దేశ క్రీడాకారుల బృందం రాణించాలన్నదే 140 కోట్ల మంది భారతీయుల కోరిక: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 28th, 09:47 pm
‘పారిస్ పారాలింపిక్స్ 2024’లో పాల్గొననున్న భారతీయ క్రీడాకారిణులు, క్రీడాకారుల బృందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని వారి ధైర్య సాహసాలను, దృఢ సంకల్పాన్ని ప్రశంసిస్తూ వారు విజయం సాధించాలని భారతదేశంలో 140 కోట్ల మంది పౌరులు పూర్తి మద్దతును వ్యక్తం చేస్తున్నారని అన్నారు.మహిళ లహాకీ జట్టు సాహసం తో ఆడి, గొప్ప నేర్పు ను కనబరచింది: ప్రధాన మంత్రి
August 04th, 06:06 pm
టోక్యో ఒలింపిక్స్ 2020 లో నేడు ఆడిన ఆట లోను, ఇంతవరకు జరిగిన పోటీల లోను మన మహిళ ల హాకీ జట్టు సాహసం తో ఆడి, గొప్ప నైపుణ్యాన్ని కనబరచిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. జట్టు ను చూసి తాను గర్విస్తున్నానని రాబోయే ఆట లోను, భావి ప్రయాసల లో వారికి మంచి అదృష్టం దక్కాలని కోరుకుంటున్నాను అని కూడా ఆయన అన్నారు.టోక్యో ఒలింపిక్స్ 2020 లో వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించినందుకు మిరాబాయి చానును ప్రధాని అభినందించారు
July 24th, 01:05 pm
టోక్యో ఒలింపిక్స్ 2020 లో వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన మీరాబాయి చానును ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడా బృందానికి ప్రధాని శుభాకాంక్షలు
July 23rd, 07:02 pm
టోక్యో ఒలింపిక్స్-2020లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ద్వారా ఇచ్చిన సందేశంలో- @Tokyo2020 ఒలింపిక్స్ ప్రారంభోత్సవ దృశ్యాలను కనులారా వీక్షించాను… ఉత్సాహవంతులైన మన క్రీడా బృందానికి సర్వశుభాలూ కలగాలని ఆకాంక్షిస్తున్నాను. రండి మనమంతా ముక్తకంఠంతో #'ఛీర్ ఫర్ ఇండియా' అని నినదిద్దాం! అని ప్రజలకు పిలుపునిచ్చారు.టోక్యో ఒలింపిక్స్ కు వెళ్తున్న భారత అథ్లెట్లతో వర్చువల్ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
July 13th, 05:02 pm
మీ అందరితో మాట్లాడడం నాకు ఆనందంగా ఉంది. నేను మీలో ప్రతీ ఒక్కరితో విడివిడిగా మాట్లాడలేకపోయినా దేశ ప్రజలందరూ మీలో పొంగుతున్న ఉత్సాహాన్ని, ఉత్సుకతను చూస్తూనే ఉన్నారు. క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో నాతో పాల్గొంటున్నారు. అలాగే కొద్ది రోజుల క్రితం వరకు మీ అందరి కోసం క్రీడా శాఖ మంత్రిగా ఎంతో కృషి చేసిన ప్రస్తుత న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజెజు జీ కూడా ఉన్నారు. అమిత యువకుడైన శ్రీ నిశిత్ ప్రామాణిక్ క్రీడల శాఖ సహాయమంత్రిగా ప్రస్తుతం మా బృందంలో ఉన్నారు. అన్ని క్రీడా సంఘాల అధిపతులు, సభ్యులు, నా సహచరులు, టోక్యో ఒలింపిక్స్ కు వెళ్తున్న క్రీడాకారులు, వారి కుటుంబాలు అందరితో ఈ వర్చువల్ సమావేశం ఈ రోజు నిర్వహిస్తున్నాం. వాస్తవానికి మీ అందరికీ ఇక్కడ నా ఇంటిలో ఆతిథ్యం ఇచ్చి ఉంటే ఎంతో బాగుండేది, కాని ఈ సారి వర్చువల్ గా మాత్రమే కలవగలుగుతున్నాను. గతంలో అలాగే ఆతిథ్యం ఇచ్చే వాడిని. అలాంటి సందర్భాలు నాకు చిరస్మరణీయంగా ఉండేవి. కాని కరోనా కారణంగా ఈ సారి అది సాధ్యం కావడంలేదు. మన క్రీడాకారుల్లో సగం మందికి పైగా ఇప్పటికే విదేశాల్లో శిక్షణ పొంది ఉన్నారు. మీరు తిరిగి వచ్చినప్పుడు నేను తప్పకుండా మిమ్మల్ని కలవగలనని హామీ ఇస్తున్నాను. కరోనా పరిస్థితులను ఎంతో మార్చింది. దాని ప్రభావం వల్ల ఒలింపిక్స్ నిర్వహించే సంవత్సరం, ఒలింపిక్స్ కు మీరు తయారయ్యే తీరుతెన్నులు...ఇలా అన్నీ ఎంతగానో మారిపోయాయి. ఒలింపిక్స్ ప్రారంభం కావడానికి ఇంక 10 రోజులు మాత్రమే ఉంది. టోక్యోలో కూడా గతంలో ఎన్నడూ లేని భిన్నత్వాన్ని మీరు చూడబోతున్నారు.మనమందరం # చీర్ 4 ఇండియా: ప్రధాని మోదీ
July 13th, 05:01 pm
టోక్యో ఒలింపిక్స్‌కు కట్టుబడి ఉన్న భారత అథ్లెట్ల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. అనధికారిక మరియు ఆకస్మిక పరస్పర చర్యలో, ప్రధాన మంత్రి అథ్లెట్లను ప్రేరేపించారు మరియు వారి త్యాగానికి వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు.టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత క్రీడాకారుల బృందంతో ప్రధానమంత్రి సంభాషణ
July 13th, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న భారత క్రీడాకారుల బృందంతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సంభాషించారు. ఈ క్రీడల్లో వారు పాల్గొనబోతున్న నేపథ్యంలో వారిలో ఉత్తేజం నింపే కృషిలో భాగంగా ప్రధానమంత్రి వారితో ముచ్చటించారు. కేంద్ర క్రీడా-యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, సహాయమంత్రి శ్రీ నిసిత్ ప్రామాణిక్, న్యాయశాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.