హై జంప్ పోటీలో బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

September 06th, 05:22 pm

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ పురుషుల హైజంప్ టి64 పోటీలో పసిడి పతకాన్ని గెలిచినందుకు క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

కాంస్య పతకాన్ని గెలిచిన జూడో క్రీడాకారుడు శ్రీ కపిల్ పరమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

September 05th, 10:26 pm

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో పురుషుల 60 కిలో గ్రాముల జె1 పోటీలో క్రీడాకారుడు శ్రీ కపిల్ పరమార్ కంచు పతకాన్ని గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం ఆయనకు అభినందనలను తెలియజేశారు.

పారాలింపిక్స్ క్రీడాకారులు అత్యధిక పతకాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని

September 04th, 04:33 pm

పారిస్ పారాలింపిక్స్ లో అత్యధిక పతకాలు సాధించి రికార్డు సృష్టించిన భారత క్రీడాకారుల ప్రదర్శనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. అథ్లెట్ల అంకితభావం, పట్టుదలను శ్రీ మోదీ ప్రశంసించారు. ప్రతి క్రీడాకారుడికి వారు సాధించిన అద్భుతమైన విజయాలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

బంగారు పతకాన్ని గెలిచిన బాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీ నీతేశ్ కుమార్ కు ప్రధాన మంత్రి అభినందనలు

September 02nd, 08:16 pm

ఫ్రాన్స్ లో పారాలింపిక్స్ లో పురుషుల పారా బాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్3 పోటీలో స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు శ్రీ నీతేశ్ కుమార్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం అభినందించారు.

పారిస్ పారాలింపిక్స్ 2024: ప్రీతి పాల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

September 02nd, 10:50 am

ట్రాక్ అండ్ పీల్డ్ ఈవెంట్స్ లో క్రీడాకారిణి ప్రీతి పాల్ ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో రెండో పతకాన్ని గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు ఈ రోజున అభినందనలు తెలిపారు.

పారాలింపిక్స్ లో పురుషుల హై జంప్ టి47 పోటీలో రజత పతకాన్ని గెలిచిన శ్రీ నిషాద్ కుమార్ కు ప్రధాన మంత్రి అభినందనలు

September 02nd, 10:50 am

పారాలింపిక్స్ లో పురుషుల హై జంప్ టి47 పోటీలో రజత పతకాన్ని గెలిచిన శ్రీ నిషాద్ కుమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.

పారిస్ పారాలింపిక్స్ లో పి2 - మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీలో కాంస్య పతకాన్ని గెలిచిన రుబీనా ఫ్రాన్సిస్ కు ప్రధాన మంత్రి అభినందనలు

August 31st, 08:19 pm

పారిస్ పారాలింపిక్స్ 2024 లో పి2 - మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీలో కాంస్య పతకాన్ని రుబీనా ఫ్రాన్సిస్ గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలను తెలియజేశారు.

షూటర్ మనీశ్ నర్వాల్ కు పారాలింపిక్స్ లో రజత పతకం: ప్రధానమంత్రి హర్షం

August 30th, 08:55 pm

పారిస్ పారాలింపిక్స్ లో పి1 - పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీ లో మనీశ్ నర్వాల్ రజత పతకాన్ని గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కాంస్య పతకాన్ని గెలిచిన భారతీయ క్రీడాకారిణి ప్రీతి పాల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

August 30th, 06:42 pm

పారిస్ పారాలింపిక్స్ 2024 లో 100 మీటర్ల టి35 పోటీ లో భారతీయ క్రీడాకారిణి ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు అభినందనలను తెలియజేశారు.

పారిస్ పారాలింపిక్స్ లో ఆర్2 మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్ హెచ్1 పోటీ లో కాంస్య పతకాన్ని గెలిచిన భారతీయ షూటర్ మోనా అగర్వాల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

August 30th, 04:57 pm

పారిస్ పారాలింపిక్స్ 2024 లో ఆర్2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్ హెచ్1 పోటీలో కాంస్య పతకాన్ని గెలిచిన భారతీయ షూటర్ మోనా అగర్వాల్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

కాంస్య పతకాన్ని సాధించినందుకు మను భాకర్, సరబ్ జోత్ సింగ్ లకు ప్రధాన మంత్రి అభినందనలు

July 30th, 01:38 pm

‘పారిస్ ఒలింపిక్స్ 2024’లో పది మీటర్ ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ పోటీ లో కాంస్య పతకాన్ని సాధించిన భారతీయ షూటర్ లు మను భాకర్, సరబ్ జోత్ సింగ్ లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఒలింపిక్స్ లో మహిళల 10 మీటర్ ఎయర్ పిస్టల్ పోటీ లో కాంస్య పతకాన్ని గెలిచిన మను భాకర్ కు ప్రధాన మంత్రి అభినందనలు

July 28th, 04:31 pm

పారిస్ ఒలింపిక్స్ లో మహిళల పది మీటర్ ఎయర్ పిస్టల్ పోటీ లో కాంస్య పతకాన్ని గెలిచిన మను భాకర్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

'హర్ ఘర్ తిరంగ అభియాన్' త్రివర్ణ పతాకం యొక్క వైభవాన్ని నిలబెట్టడంలో ఒక ప్రత్యేకమైన పండుగగా మారింది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

July 28th, 11:30 am

నా ప్రియమైన దేశప్రజలారా! 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీకు స్వాగతం. అభినందనలు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఒలింపిక్స్ మన క్రీడాకారులకు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం అందిస్తుంది. దేశం కోసం ఏదైనా చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు కూడా మన క్రీడాకారులను ప్రోత్సహించండి. ఛీర్ ఫర్ భారత్‌.!!

రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

June 30th, 11:00 am

మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.