PM remembers heroes of freedom struggle on completion of hundred years of Chauri Chaura incident
February 04th, 07:40 pm
The Prime Minister, Shri Narendra Modi has remembered the heroes of our freedom struggle on completion of hundred years of Chauri Chaura incident. He also shared his last year's speech when the centenary celebrations of the incident began.పాత్రత కలిగిన నాయకుల కు, యోధుల కు తగినంత గౌరవాన్ని ఇవ్వని చరిత్ర తాలూకు పొరపాట్లను మేము సవరిస్తున్నాము: ప్రధాన మంత్రి
February 16th, 02:45 pm
దేశం స్వాతంత్య్రాన్ని సంపాదించుకొన్న తరువాత మనం 75వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న నేపథ్యం లో దేశానికి విశేషమైనటువంటి తోడ్పాటు ను అందించిన కథానాయకుల, కథానాయికల యొక్క తోడ్పాటు ను స్మరించుకోవడం మరింత ముఖ్యం అయిపోతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం కోసం, భారతీయత కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన వారికి చరిత్ర పుస్తకాల లో ఇవ్వవలసినంత గౌరవాన్ని ఇవ్వడం జరుగలేదు అంటూ ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ అపసవ్యాలను, భారతదేశ చరిత్ర రచయిత ల ద్వారా దేశ చరిత్ర నిర్మాతల కు జరిగిన అన్యాయాన్ని మనం మన స్వాతంత్య్ర 75వ సంవత్సరం లోకి ప్రవేశించనున్న ఈ తరుణం లో ప్రస్తుతం సరిదిద్దడం జరుగుతున్నదని ఆయన అన్నారు. వారి తోడ్పాటు ను ఈ దశ లో గుర్తు కు తెచ్చుకోవడం అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్ రాయిచ్ లో చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనులకు, మహారాజా సుహేల్ దేవ్ స్మారకానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసిన తరువాత ప్రధాన మంత్రి ప్రసంగించారు.ఉత్తర ప్రదేశ్ లోని బహ్రాయిచ్ వద్ద మహారాజా సుహెల్దేవ్ స్మారక చిహ్నం, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 16th, 11:24 am
ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్‌రాయిచ్ లో మహారాజా సుహేల్ దేవ్ స్మారకానికి, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం నాడు, అంటే ఈ నెల 16న, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. మహారాజా సుహేల్‌దేవ్ పేరు ను పెట్టినటువంటి ఒక వైద్య కళాశాల భవనాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకొన్నారు.మహారాజా సుహేల్ దేవ్ స్మారకాని కి, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
February 16th, 11:23 am
ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్‌రాయిచ్ లో మహారాజా సుహేల్ దేవ్ స్మారకానికి, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం నాడు, అంటే ఈ నెల 16న, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. మహారాజా సుహేల్‌దేవ్ పేరు ను పెట్టినటువంటి ఒక వైద్య కళాశాల భవనాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకొన్నారు.‘చౌరీ చౌరా’ అమరవీరుల కు ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇవ్వలేదు: ప‌్రధాన మంత్రి
February 04th, 05:37 pm
‘చౌరీ చౌరా’ అమరవీరుల కు చరిత్ర పుటల లో ఇవ్వదగినంత ప్రాధాన్యాన్ని ఇవ్వలేదు అంటూ ప్రధాన మంత్రి గురువారం నాడు విచారాన్ని వ్యక్తం చేశారు. అంతగా ప్రచారం లోకి రానటువంటి అమరవీరుల, స్వాతంత్య్ర యోధుల గాథలను దేశ ప్రజల ముంగిట కు తీసుకు రావడానికి మనం చేసే కృషే వారికి అర్పించగలిగే ఒక యథార్థమైన నివాళి కాగలదు అని ఆయన అన్నారు. దేశం స్వాతంత్య్రం సంపాదించుకొని 75వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న ఈ ఏడాది లో, ఈ కార్యానికి మరింత సందర్భ శుద్ధి ఉంది అని ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో గల చౌరీ చౌరా లో ‘చౌరీ చౌరా’ శత వార్షికోత్సవాల ను ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించిన తరువాత శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమంలో ప్రసంగించారు.ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో చౌరీ చౌరా శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
February 04th, 02:37 pm
శివుని అవతారమైన గోరక్షనాథ్ కు మొదటగా నమస్కరిస్తున్నాను. దేవరాహా బాబా ఆశీస్సులతో ఈ జిల్లా బాగా అభివృద్ధి చెందుతున్నది. ఇవాళ, నేను దేవరాహా బాబా కు చెందిన చౌరీ చౌరా యొక్క గొప్ప ప్రజల ముందు స్వాగతం మరియు నమస్కరిస్తున్నారు.‘చౌరీ చౌరా’ శత వార్షికోత్సవాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
February 04th, 02:36 pm
ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో గల చౌరీ చౌరా లో ‘చౌరీ చౌరా’ శత వార్షికోత్సవాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ రోజు తో దేశ స్వాతంత్య్ర పోరాటం లో ఒక ప్రతిష్టాత్మక ఘటన గా పేరు తెచ్చుకొన్న ‘చౌరీ చౌరా’ ఉదంతానికి 100 సంవత్సరాలు అవుతున్నాయి. ‘చౌరీ చౌరా’ శత వార్షిక ఉత్సవానికి అంకితం చేసిన ఒక తపాలా బిళ్ళ ను కూడా ప్రధాన మంత్రి ఇదే సందర్భం లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ తో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.‘చౌరీ చౌరా’ శత జయంతి ఉత్సవాల ను ఫిబ్రవరి 4న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
February 02nd, 12:23 pm
‘చౌరీ చౌరా’ శత జయంతి ఉత్సవాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో గల ‘చౌరీ చౌరా’ లో ఈ నెల 4న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటం లో ఒక విశిష్ట ఘట్టం అయినటువంటి ‘చౌరీ చౌరా’ ఉదంతం చోటు చేసుకొని ఆ రోజుకల్లా 100 సంవత్సరాలు అవుతాయి. ‘చౌరీ చౌరా’ శత జయంతి కి అంకితం చేసిన ఒక తపాలా బిళ్ళ ను ఈ కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఈ సందర్భం లో పాలుపంచుకోనున్నారు.