భారత-ఆస్ర్టియా విస్తృత భాగస్వామ్యంపై ఉమ్మడి ప్రకటన

July 10th, 09:15 pm

ఆస్ర్టియా చాన్సలర్ కార్ల్ నెహామర్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జూలై 9-10 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఆస్ర్టియా అధ్యక్షుడు మాననీయ అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్ ను కలవడంతో పాటు చాన్సలర్ నెహామర్ తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇది ఆస్ర్టియాలో ప్రధానమంత్రి తొలి పర్యటన మాత్రమే కాదు, 41 సంవత్సరాల కాలంలో భారతదేశ ప్రధానమంత్రి ఒకరు ఆస్ర్టియాలో పర్యటించడం ఇదే ప్రథమం. అంతే కాదు, 2024 సంవత్సరం ఉభయదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన 75వ సంవత్సరం కావడం విశేషం.

ఆస్ట్రియా ఛాన్స‌ల‌ర్ తో క‌లిసి ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఉమ్మ‌డి ప‌త్రికా ప్ర‌క‌ట‌న

July 10th, 02:45 pm

హృద‌య పూర్వ‌క స్వాగ‌తాన్ని ప‌లికి, ఆతిథ్య‌మందించినందుకు మొట్ట‌మొద‌ట‌గా ఛాన్స‌ల‌ర్ నెహ‌మ‌ర్ కు నా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను. ప్ర‌ధానిగా మూడోసారి బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత ఆస్ట్రియాలో ప‌ర్య‌టించే అవ‌కాశం ల‌భించినందుకు చాలా సంతోషంగా వుంది. నా ఈ ప‌ర్య‌ట‌న చారిత్రాత్మ‌క‌మైన‌ది, ప్ర‌త్యేక‌మైన‌ది. 41 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఆస్ట్రియాలో ప‌ర్య‌టిస్తున్న భార‌తీయ ప్ర‌ధానిగా నాకు గుర్తింపు ల‌భించింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు 75 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంటున్న సంద‌ర్భంలో నేను ప‌ర్య‌టించ‌డం కాక‌తాళీయం, సంతోష‌కరం.

రష్యన్ ఫెడరేషన్, ఆస్ట్రియా రిపబ్లిక్ ఆధికారిక పర్యటనకు బయలుదేరే ముందు గౌరవనీయ ప్రధాన మంత్రి జారీ చేసిన ప్రకటన

July 08th, 09:49 am

రష్యన్ ఫెడరేషన్ లో.. 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడంతో పాటు ఆస్ట్రియా రిపబ్లిక్ లో మొదటిసారి పర్యటించడానికి గాను మూడు రోజుల అధికారిక పర్యటనకు బయలుదేరుతున్నాను.