చమోలీ లో జరిగిన విషాదకరమైన విద్యుత్తు సంబంధి దుర్ఘటన లో బాధితులైన వారికి పరిహారాన్ని ప్రకటించిన ప్రధాన మంత్రి
July 19th, 09:51 pm
‘‘చమోలీ లో జరిగిన విషాదకర దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారికి 50,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి శ్రీ@narendramodi’’ అని తెలిపింది.ఉత్తరాఖండ్ లోనిచమోలీ లో జరిగిన ఒక విద్యుత్తు సంబంధి దుర్ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లినందుకుసంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
July 19th, 05:30 pm
విద్యుదాఘాతం కారణం గా ఉత్తరాఖండ్ లోని చమోలీ లో జరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలిపారు. ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తులు త్వరగా పునఃస్వస్థులు కావాలని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు; ఈ ఘటన లో బాధితుల కు రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం చేతనైన అన్ని విధాలు గాను సాయాన్ని అందిస్తోందని ఆయన వెల్లడించారు.ఉత్తరాఖండ్ లోని చమోలీ లో హిమపాతం బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఆమోదం తెలిపిన ప్రధాన మంత్రి
February 07th, 08:48 pm
ఉత్తరాఖండ్ లోని చమోలీ లో మంచుదిబ్బలో చీలిక ఏర్పడిన కారణం గా సంభవించిన హిమపాతం దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారి దగ్గర బంధువులకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.