‘సెరావీక్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి కీలకోపన్యాసం
March 05th, 06:59 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సిఇఆర్ ఎ వారోత్సవం 2021 సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా కీలకోపన్యాసంచేశారు. ప్రధానమంత్రికి సిఇఆర్ఎ వారోత్సవ అంతర్జాతీయ ఇంధన, పర్యావరణ నాయకత్వ అవార్డు ను అందజేశారు. తాను వినమ్రతతో ఈ అవార్డును అంగీకరిస్తున్నానని ప్రధాని అన్నారు. ఈ అవార్డును ఈ అద్భుతమైన మాతృభూమికి చెందిన ప్రజలకు అంకితం చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు.అలాగే ఈ అవార్డును భారతదేశ అద్భుత సంప్రదాయాలకు, పర్యావరణ పరిరక్షణకు అవి చూపిన మార్గానికి అంకితం చేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో శతాబ్దాలుగా భారతీయులు నాయకత్వ స్థానంలో ఉన్నారని ప్రధానమంత్రి తెలిపారు.మన సంస్కృతిలో ప్రకృతి,దైవత్వం సన్నిహిత అనుబంధం కలిగినవని ఆయన అన్నారు.
సిఇఆర్ఎ వారోత్సవం 2021లో కీలకప్రసంగం చేసిన ప్రధానమంత్రి
March 05th, 06:56 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సిఇఆర్ ఎ వారోత్సవం 2021 సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా కీలకోపన్యాసంచేశారు. ప్రధానమంత్రికి సిఇఆర్ఎ వారోత్సవ అంతర్జాతీయ ఇంధన, పర్యావరణ నాయకత్వ అవార్డు ను అందజేశారు. తాను వినమ్రతతో ఈ అవార్డును అంగీకరిస్తున్నానని ప్రధాని అన్నారు. ఈ అవార్డును ఈ అద్భుతమైన మాతృభూమికి చెందిన ప్రజలకు అంకితం చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు.అలాగే ఈ అవార్డును భారతదేశ అద్భుత సంప్రదాయాలకు, పర్యావరణ పరిరక్షణకు అవి చూపిన మార్గానికి అంకితం చేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో శతాబ్దాలుగా భారతీయులు నాయకత్వ స్థానంలో ఉన్నారని ప్రధానమంత్రి తెలిపారు.మన సంస్కృతిలో ప్రకృతి,దైవత్వం సన్నిహిత అనుబంధం కలిగినవని ఆయన అన్నారు.
సిఇఆర్ఎ వీక్ గ్లోబల్ ఎనర్జీ ఎండ్ ఎన్‌వైరన్‌మెంట్ లీడర్ శిప్ అవార్డు ను స్వీకరించనున్న ప్రధాన మంత్రి; ఆయనఈ నెల 5న ‘సిఇఆర్ఎ వీక్ 2021’ లో కీలకోపన్యాసాన్ని ఇవ్వనున్నారు
March 04th, 06:31 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంబ్రిడ్జ్ ఎనర్జీ రిసర్చ్ అసోసియేట్స్ వీక్ (సిఇఆర్ఎ వీక్) తాలూకు గ్లోబల్ ఎనర్జీ ఎండ్ ఎన్‌వైరన్‌మెంట్ లీడర్ శిప్ అవార్డు ను స్వీకరించనున్నారు. సిఇఆర్ఎ వీక్ 2021 సమావేశాల లో ఆయన ఈ నెల 5న రాత్రి 7 గంటల సమయం లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా కీలకోపన్యాసం చేయనున్నారు.