గుజరాత్ అమ్రేలీలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

October 28th, 04:00 pm

వేదికపైనున్న గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ గారూ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ సీ ఆర్ పాటిల్ గారూ, గుజరాత్ అక్కాచెల్లెళ్ళూ, అన్నదమ్ములూ, ముఖ్యంగా అమ్రేలీ సోదర సోదరీమణులారా..

గుజరాత్‌లోని అమ్రేలీలో ₹4,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం... ప్రధానమంత్రి శ్రీ మోదీ శంకుస్థాపన

October 28th, 03:30 pm

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- దేశమంతటా ఉప్పొంగుతున్న దీపావళి, ధంతేరాస్ పండుగల స్ఫూర్తిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పండుగ‌లు మన సంస్కృతిని ఘనంగా చాటుతాయని, అలాగే ప్రగతి పురోగ‌మన వేగానికీ అంతే ప్రాముఖ్యం ఉంటుందని గుర్తుచేశారు. వడోదరలో నేటి తన పర్యటనను ప్రస్తావిస్తూ- గుజరాత్ అంతటా చేపడుతున్న అనేక కీలక ప్రాజెక్టుల గురించి తాజా సమాచారాన్ని ప్రజలతో పంచుకున్నారు. వీటిలో భాగంగా భారత వైమానిక దళం కోసం దేశీయ విమానాల తయారీకి ఈ నగరంలో ఏర్పాటు చేసిన తొలి కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. దీనికిముందు అమ్రేలీలో ‘భారతమాత’ సరోవరం ప్రారంభించడాన్ని గుర్తుచేస్తూ- జల సంరక్షణ కార్యక్రమాలు సహా రైల్వేలు, రహదారుల సంబంధిత అనేక భారీ ప్రాజెక్టులను ప్రారంభించామని, మరికొన్నిటికి శంకుస్థాపన చేశామని వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లోని ప్రజల జీవన సౌలభ్యం మెరుగవుతుందని చెప్పారు. అంతేగాక స్థానిక రైతుల సౌభాగ్యానికి, ఈ ప్రాంతంలో ప్రగతి వేగం పుంజుకోవడానికి ఇవి దోహదం చేస్తాయన్నారు. మరోవైపు యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిపై ప్రజానీకానికి అభినందనలు తెలిపారు.

'మన్ కీ బాత్' శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన యాంకర్లు: ప్రధాని మోదీ

September 29th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంతో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇది చాలా పాత జ్ఞాపకాలతో నన్ను చుట్టుముట్టింది. కారణం మన 'మన్ కీ బాత్' ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. పదేళ్ల కిందట విజయదశమి పర్వదినమైన అక్టోబర్ 3వ తేదీన 'మన్ కీ బాత్' ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన ‘మన్ కీ బాత్’ పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటుంది. యాదృచ్ఛికంగా అది నవరాత్రుల మొదటి రోజు కావడం విశేషం.

No power can stop the country whose youth is moving ahead with the resolve of Nation First: PM Modi

January 28th, 01:37 pm

Prime Minister Narendra Modi addressed the National Cadet Corps Rally at Cariappa Ground in New Delhi. The PM talked about the steps being taken to strengthen the NCC in the country in a period when the country is moving forward with new resolutions. He elaborated on the steps being taken to open the doors of the defence establishments for girls and women.

కరియప్ప గ్రౌండ్ లో జరిగిన ఎన్ సిసి పిఎమ్ ర్యాలీ ని ఉద్దేశించిప్రసంగించిన ప్రధాన మంత్రి

January 28th, 01:36 pm

కరియప్ప గ్రౌండు లో జరిగిన నేశనల్ కేడెట్ కోర్ ర్యాలీ ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గౌరవ వందనాన్ని ప్రధాన మంత్రి పరిశీలించడం తో పాటు గా, ఎన్ సిసి దళాలు జరిపిన కవాతు ను కూడా ఆయన సమీక్షించారు. సైనిక కార్యాచరణ, స్లిదరింగ్, మైక్రోలైట్ ఫ్లయింగ్, పారా సెయిలింగ్, ఇంకా సాంస్కృతిక కార్యక్రమాల లో ఎన్ సిసి కేడెట్ లు వారి యొక్క నైపుణ్యాల ను ప్రదర్శించడాన్ని కూడా ఆయన గమనించారు. ఉత్కృష్ట కేడెట్ లు ప్రధాన మంత్రి వద్ద నుంచి పతకాన్ని, బేటన్ ను స్వీకరించారు.

చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పులకు దారితీస్తాయి: ప్రధాని మోదీ

September 26th, 11:30 am

నా ప్రియమైన దేశ వాసులారా! నమస్కారం.. ఒక ముఖ్యమైన కార్యక్రమం కోసం నేను అమెరికా వెళ్లాల్సి ఉందని మీకు తెలుసు. కాబట్టి అమెరికా వెళ్లే ముందు 'మన్ కీ బాత్' రికార్డ్ చేయడం మంచిదని అనుకున్నాను. సెప్టెంబర్‌లో 'మన్ కీ బాత్' ప్రసారం అయ్యే తేదీన మరో ముఖ్యమైన రోజు ఉంది. మనం చాలా రోజులను గుర్తుంచుకుంటాం. వివిధ దినోత్సవాలను జరుపుకుంటాం. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, మీరు వారిని అడిగితే, సంవత్సరం మొత్తంలో ఏ రోజు ప్రాధాన్యత ఏమిటో మీకు పూర్తి జాబితాను చెప్తారు. కానీ మనమందరం గుర్తుంచుకోవలసిన మరో రోజు ఉంది. ఈ రోజు భారతదేశ సంప్రదాయాలకు అనుగుణమైంది. ఇది శతాబ్దాలుగా మన సంప్రదాయాలకు అనుబంధంగా ఉన్న అంశంతో అనుసంధానమైంది. ఇది 'వరల్డ్ రివర్ డే'. అంటే ప్రపంచ నదుల దినోత్సవం.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

June 05th, 11:05 am

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీమాన్ శ్రీ నితిన్ గడ్కరీ జీ, నరేంద్ర సింగ్ తోమర్జీ, ప్రకాష్ జవదేకర్ జీ, పీయూష్ గోయల్ జీ, ధర్మేంద్ర ప్రధాన్ జీ, ధర్మేంద్ర ప్రధాన్ జీ, గుజరాత్ లోని ఖేడా పార్లమెంటు సభ్యుడు, దేవుసింగ్ జసింగ్ భాయ్ చౌహాన్ జీ, హర్దోయ్ పార్లమెంటు సభ్యుడు, యుపి, భాయ్ జై ప్రకాష్ రావత్ జీ, పూణే మేయర్ ముర్లీధర్ మహుల్ జీ, పింప్రి చించ్వాడ్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ సోదరి ఉషా జీ ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రముఖులు మరియు నా ప్రియమైన సోదర సోదరీమణులు,

ప్రపంచ పర్యావరణ దినం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

June 05th, 11:04 am

ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో పెట్రోలియమ్ & సహజ వాయువు మంత్రిత్వ శాఖ, పర్యావరణం, అడవులు, జలవాయు పరివర్తన మంత్రిత్వ శాఖ కలసి శనివారం నాడు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో భాగం గా పుణే కు చెందిన ఒక రైతు తో ఆయన మాట్లాడారు. ఆ రైతు సేంద్రియ వ్యవసాయం తాలూకు తన అనుభవాన్ని, వ్యవసాయం లో బయో ఫ్యూయల్ వినియోగాన్ని గురించి వెల్లడించారు.

'క్యాచ్ ద రెయిన్' ప్ర‌చార ఉద్య‌మం ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

March 22nd, 12:06 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రేన్’ ప్ర‌చార ఉద్య‌మాన్ని ప్ర‌పంచ జ‌ల దినం అయిన‌టువంటి ఈ రోజు న‌ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించారు. నదుల ను ఒకదానితో మరొక దానిని సంధానించడం కోసం ఉద్దేశించినటువంటి జాతీయ ప్ర‌ణాళిక లో ఒక‌టో ప్రాజెక్టు గా కేన్- బేత్ వా లింక్ ప్రాజెక్టు ను కార్యరూపం లోకి తీసుకు రావ‌డం కోసం ఒక ఒప్పంద ప‌త్రం పైన కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రి, మ‌ధ్య ప్ర‌దేశ్, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ప్ర‌ధాన మంత్రి స‌మ‌క్షం లో సంత‌కాలు చేశారు. ఇదే కార్య‌క్ర‌మం లో భాగం గా రాజస్థాన్, ఉత్త‌రాఖండ్‌, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర, గుజ‌రాత్ ల‌కు చెందిన స‌ర్పంచుల ను, వార్డు ప్ర‌ముఖుల ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడారు.

ప్ర‌పంచ జ‌ల దినం సంద‌ర్భం లో ‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రేన్’ ప్ర‌చార ఉద్య‌మాన్ని ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి‌

March 22nd, 12:05 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రేన్’ ప్ర‌చార ఉద్య‌మాన్ని ప్ర‌పంచ జ‌ల దినం అయిన‌టువంటి ఈ రోజు న‌ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించారు. నదుల ను ఒకదానితో మరొక దానిని సంధానించడం కోసం ఉద్దేశించినటువంటి జాతీయ ప్ర‌ణాళిక లో ఒక‌టో ప్రాజెక్టు గా కేన్- బేత్ వా లింక్ ప్రాజెక్టు ను కార్యరూపం లోకి తీసుకు రావ‌డం కోసం ఒక ఒప్పంద ప‌త్రం పైన కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రి, మ‌ధ్య ప్ర‌దేశ్, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ప్ర‌ధాన మంత్రి స‌మ‌క్షం లో సంత‌కాలు చేశారు. ఇదే కార్య‌క్ర‌మం లో భాగం గా రాజస్థాన్, ఉత్త‌రాఖండ్‌, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర, గుజ‌రాత్ ల‌కు చెందిన స‌ర్పంచుల ను, వార్డు ప్ర‌ముఖుల ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడారు.

‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రెయిన్’ ప్రచార ఉద్యమాన్ని ఈ నెల 22న ప్రారంభించనున్న ప్ర‌ధాన మంత్రి

March 21st, 12:54 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రపంచ జల దినం అయిన ఈ నెల 22 న మధ్యాహ్నం 12 గంటల ముప్ఫై నిమిషాల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ‘జల శక్తి అభియాన్: క్యాచ్ ద రెయిన్’ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి సమక్షం లో, కేన్ బెట్ వా లింక్ ప్రాజెక్టు అమలు కోసం ఉద్దేశించిన చరిత్రాత్మకమైనటువంటి ఒక ఒప్పంద పత్రం పై కేంద్ర జల శక్తి శాఖ మంత్రి, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానానికి తలపెట్టిన జాతీయ దృష్టికోణ ప్రణాళిక లో ఒకటో ప్రాజెక్టు గా ఉంది.