Cabinet approves extension of One-time Special Package on Di-Ammonium Phosphate (DAP)

January 01st, 03:28 pm

The Union Cabinet, chaired by the Prime Minister Shri Narendra Modi, has approved the proposal of the Department of Fertilizers for extension of One-time Special Package on Di-Ammonium Phosphate (DAP) beyond the NBS subsidy @ Rs 3,500 per MT for the period from 01.01.2025 till further orders to ensure sustainable availability of DAP at affordable prices to the farmers. The tentative budgetary requirement for above would be approximately upto Rs. 3,850 cr.

Cabinet approves continuation of the Pradhan Mantri Fasal Bima Yojana

January 01st, 03:07 pm

The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi today approved continuation of the Pradhan Mantri Fasal Bima Yojana and Restructured Weather Based Crop Insurance Scheme till 2025-26 with an overall outlay of Rs.69,515.71 Crore from 2021-22 to 2025-26. The decision will help in risk coverage of crops from non-preventable natural calamities for farmers across the country till 2025-26.

ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు నాలుగో దశ విస్తరణ రిథాలా-కుండ్లీ కారిడార్‌కు కేబినెట్ ఆమోదం

December 06th, 08:08 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షతన స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఢిల్లీ మెట్రో ప్రాజెక్టులో భాగంగా నాలుగోదశకు చెందిన 26.463 కిలోమీట‌ర్ల రిథాలా - నరేలా - నాథూపూర్ (కుండ్లి) కారిడార్‌కు ఆమోదం తెలిపింది. ఇది దేశ రాజధాని, పొరుగున ఉన్న హర్యానా మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మంజూరు చేసిన తేదీ నుంచి 4 సంవత్సరాలలో ఈ కారిడార్‌ను పూర్తి చేయాలని నిర్ణయించారు.

దేశవ్యాప్తంగా 28 జిల్లాల్లో నూతన నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం

December 06th, 08:03 pm

కొత్తగా ఏర్పాటయ్యే 28 విద్యాలయాల స్థాపన కోసం 2024-25 నుంచి 2028-29 మధ్యగల 5 సంవత్సరాల వ్యవధిలో రూ. 2359.82 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా. ఇందులో మూలధన వ్యయం కింద రూ. 1944.19 కోట్లు, నిర్వహణ వ్యయం కింద రూ. 415.63 కోట్లను ఖర్చు చేస్తారు.

పౌర, రక్షణ రంగాల కింద 85 నూతన కేంద్రీయ విద్యాలయాల ప్రారంభానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం:

December 06th, 08:01 pm

కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కీలక నిర్ణయాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయాల ప్రకారం పౌర, రక్షణ రంగాలకు కలిపి 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలు (కేవీ) మంజూరయ్యాయి. పెరిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం కేంద్రీయ విద్యాలయ పథకం (కేంద్ర రంగ పథకం) ద్వారా కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని కేవీ శివమొగ్గలో ప్రతి తరగతికీ రెండు అదనపు సెక్షన్లను మంజూరు చేయాలన్న సీసీఈఏ నిర్ణయం పాఠశాల విస్తరణకు దోహదపడుతుంది. 86 కేవీలతో కూడిన జాబితా దిగువన చూడొచ్చు.

భారతీయ రైల్వేలకు చెందిన మూడు మల్టీట్రాక్ ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోద ముద్ర:

November 25th, 08:52 pm

సుమారు రూ.7,927 కోట్ల ఖర్చుతో రైల్వేల మంత్రిత్వ శాఖ తలపెట్టిన మూడు ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఈ రోజు ఆమోదాన్ని తెలిపింది.

అటల్ ఇన్నొవేషన్ మిషన్ కొనసాగింపునకు కేబినెట్ ఆమోదం

November 25th, 08:45 pm

నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఏఐఎం)ను కొనసాగించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని పరిధిని విస్తరించడంతోపాటు, 2028 మార్చి 31 వరకు రూ.2,750 కోట్ల బడ్జెట్ కేటాయించారు.

2022 స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో.. ‘అమృత్ కాల్’లో దేశంలో పరిశోధన – అభివృద్ధి ప్రాధాన్యాన్ని ప్రస్తావించిన ప్రధాని: ‘జై అనుసంధాన్’ నినాదాన్నిచ్చిన ప్రధాని

November 25th, 08:42 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ పథకానికి ఆమోదం తెలిపింది. నిపుణుల పరిశోధన వ్యాసాలు, పత్రికల్లో ప్రచురణలను ఈ కేంద్ర ప్రభుత్వ పథకం (సెంట్రల్ సెక్టార్ స్కీమ్) దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తుంది. సరళమైన, వినియోగదారీ అనుకూల, పూర్తి సాంకేతిక ప్రక్రియ ద్వారా ఈ పథకాన్ని నిర్వహిస్తారు. ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పరిశోధన-అభివృద్ధి సంస్థలకు ‘వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్’ సదుపాయం ఉంటుంది.

సహజ వ్యవసాయానికి సంబంధించి ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ ప్రారంభం

November 25th, 08:39 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి, సహజ వ్యవసాయ పద్ధతుల కేంద్ర ప్రభుత్వ జాతీయ స్థాయి పథకం - ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ (ఎన్ఎంఎన్ఎఫ్)కు ఆమోదం తెలిపింది. స్వతంత్ర ప్రతిపత్తి గల ఈ పథకం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందింది.

2024-25లో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ను ఈక్విటీగా మార్చడం ద్వారా

November 06th, 03:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు మూలధన పెట్టుబడి కోసం రూ.10,700 కోట్ల ఈక్విటీని సమకూర్చడానికి ఆమోదం తెలిపింది. వ్యవసాయ రంగానికి ఊతమివ్వడంతో పాటు దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యూహాత్మక చర్య రైతులకు మద్దతు ఇవ్వడానికి, దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వ స్థిరమైన నిబద్ధతకు నిదర్శనం.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవకుండా సాయమందించే పీఎం-విద్యాలక్ష్మి పథకానికి కేబినెట్ ఆమోదం

November 06th, 03:14 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పీఎం విద్యాలక్ష్మి పథకానికి ఆమోద ముద్ర వేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకుండా ఈ నూతన కేంద్ర ప్రభుత్వం పథకం సహకారం అందిస్తుంది. జాతీయ విద్యా విధానం-2020 నుంచి ఆవిర్భవించిన మరో ముఖ్యమైన కార్యక్రమమే ఈ పీఎం విద్యాలక్ష్మి పథకం. ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు అవసరమైన ఆర్థికసాయాన్ని ఈ పథకం అందిస్తుంది. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉన్నత విద్యా సంస్థ (క్యూహెచ్ఐఈలు)ల్లో ప్రవేశం సాధించిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు, కోర్సుకు సంబంధించిన ఇతర ఖర్చులకు అయ్యే పూర్తి మొత్తాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి హామీ రహిత రుణం పొందేందుకు అర్హులు. సరళమైన, పారదర్శకమైన పూర్తి స్థాయి డిజిటల్ వ్యవస్థ ద్వారా ఈ పథకాన్ని నిర్వహిస్తారు.

ఇన్-స్పేస్ ఆధ్వర్యంలో అంతరిక్ష రంగానికి రూ.1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

October 24th, 03:25 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్.. ఇన్-స్పేస్ నేతృత్వంలో అంతరిక్ష రంగంలో పెట్టుబడుల కోసం రూ.1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

రూ .6,798 కోట్ల అంచనా వ్యయంతో రెండు రైల్వే ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం

October 24th, 03:12 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఇఎ) సుమారు రూ.6,798 కోట్ల అంచనాలతో రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రెండు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛన్ దారులకు డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) లలో 3 శాతం అదనపు వాయిదా (ఇన్ స్టాల్ మెంట్) చెల్లింపునకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం

October 16th, 03:20 pm

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛన్ దారులకు డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) ల అదనపు వాయిదా (ఇన్ స్టాల్ మెంట్) ను జులై 1 నుంచి చెల్లించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది. ఇది మూల వేతనం లేదా పింఛన్ లో ఇప్పుడు వర్తిస్తున్న 50 శాతం రేటు కన్నా మూడు శాతం అధికం. ధరలలో పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని, ఆ భారాన్ని తొలగించడానికి ఈ చర్యను తీసుకొన్నారు.

గంగానదిపై రైలు, రోడ్డు మార్గాల బ్రిడ్జి సహా 'వారణాసి-పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బహుళ మార్గాల బ్రిడ్జి' నిర్మాణాలకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి మండలి

October 16th, 03:18 pm

ప్రధానమంత్రి అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రిమండలి, రైల్వే శాఖకు చెందిన రూ.2,642 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. బహుళ మార్గాల నూతన ప్రాజెక్టు వివిధ మార్గాల్లో రద్దీని తగ్గించి, రాకపోకలను సులభతరం చేయడమే కాక, భారతీయ రైల్వేలకు చెందిన అతి రద్దీ మార్గాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి-ఛందౌలీ మధ్య ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది.

2025-26 మార్కెటింగ్ సీజన్‌కు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు: కేబినెట్ ఆమోదం

October 16th, 03:12 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) 2025-26 మార్కెటింగ్ సీజన్లో అన్ని తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు (ఎంఎస్‌పీ)నకు ఆమోదం తెలిపింది.

జులై 2024 నుంచి డిసెంబర్ 2028 వరకూ ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ కింద ‘బలవర్ధక బియ్యం’ ఉచిత పంపిణీ సహా ఇతర సంక్షేమ పథకాల కొనసాగింపునకు మంత్రివర్గ ఆమోదం

October 09th, 03:07 pm

జులై 2024 నుంచి డిసెంబర్ 2028 వరకూ ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ సహా అన్ని ప్రభుత్వ పథకాల్లో భాగంగా ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం) ఉచిత పంపిణీ, ఇతర సంక్షేమ పథకాల కొనసాగింపునకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకాలు ప్రస్తుతం అమలవుతున్న విధానాల్లోనే కొనసాగుతాయి.

చంద్రుడు, మార్స్ గ్రహాల పరిశోధనల అనంతరం శుక్రగ్రహ ప్రయోగాలు చేపట్టేందుకు భారత్ సిద్ధం

September 18th, 04:37 pm

శుక్రగ్రహాన్ని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన శుక్ర గ్రహ పరిశోధనలకూ(వీనస్ ఆర్బిటర్ మిషన్ – వీఓఎం) ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చంద్రుడు, మార్స్ గ్రహాల అధ్యయనాల అనంతరం, శుక్రగ్రహాన్ని గురించి లోతైన అవగాహన పెంపొందించుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. భూమికి అతి సమీపంలో ఉన్న శుక్రగ్రహం కూడా భూమి ఏర్పడిన పరిస్థితులను పోలిన వాటితోనే ఏర్పడిందని భావిస్తారు. భిన్నమైన వాతావరణాల్లో గ్రహాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని యోచిస్తున్నారు.

చంద్రునిపైకి మరోసారి భారత్: ఈ దఫా వ్యోమనౌక భూమికి తిరిగి రాక

September 18th, 04:32 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి చంద్రయాన్-4 మిష‌న్‌కు ఆమోదం తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రునిపై వ్యోమనౌకను దింపి విజయం సాధించిన నేపథ్యంలో తాజా మిష‌న్‌కు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈసారి చంద్రుని పైనుంచి నమూనాలతో వ్యోమనౌకను తిరిగి భూమికి రప్పించి, వాటిని విశ్లేషించగల సాంకేతిక పరిజ్ఞానం రూపకల్పన, సామర్థ్య ప్రదర్శన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చంద్రునిపైకి వ్యోమనౌకను పంపి, తిరిగి రప్పించగల (2040 నాటికి అమలయ్యే ప్రణాళిక) ప్రాథమిక సాంకేతిక సామర్థ్యాలను సాధించాలని ఇస్రో తలపెట్టింది. ఇందులో భాగంగా డాకింగ్/అన్‌డాకింగ్, ల్యాండింగ్ సహా భూమికి సురక్షితంగా రప్పించడంతోపాటు చంద్ర నమూనాల సేకరణ-విశ్లేషణకు అవసరమైన కీలక సాంకేతిక సామర్థ్యాలను చాటుకుంటుంది.

ఏకకాలంలో ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులకు మంత్రి మండలి ఆమోదం

September 18th, 04:26 pm

దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.