మహారాష్ట్రలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన... ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 09th, 01:09 pm
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు సహా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, శ్రీ అజిత్ పవార్, ఇతర ప్రముఖులు, నా ప్రియ సోదర సోదరీమణులారా...మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన
October 09th, 01:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈవేళ మహారాష్ట్రలో రూ.7600 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభించారు. ఈ మేరకు నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీరణ పనులకు, షిర్డీ విమానాశ్రయంలో కొత్త సమీకృత టెర్మినల్ భవన నిర్మణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రాష్ట్రంలో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్)-ముంబయి సహా మహారాష్ట్రలో విద్యా వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రానికి శ్రీ మోదీ ప్రారంభోత్సవం చేశారు.ప్రధానమంత్రితో మహారాష్ట్ర గవర్నర్ సమావేశం
August 02nd, 11:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్ ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.