I consider industry, and also the private sector of India, as a powerful medium to build a Viksit Bharat: PM Modi at CII Conference

July 30th, 03:44 pm

Prime Minister Narendra Modi attended the CII Post-Budget Conference in Delhi, emphasizing the government's commitment to economic reforms and inclusive growth. The PM highlighted various budget provisions aimed at fostering investment, boosting infrastructure, and supporting startups. He underscored the importance of a self-reliant India and the role of industry in achieving this vision, encouraging collaboration between the government and private sector to drive economic progress.

భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) నిర్వహించిన ‘‘జర్నీ టువార్డ్స్ వికసిత్ భారత్: ఎ పోస్ట్ యూనియన్ బడ్జెట్ 2024-25 కాన్ఫరెన్స్’’ ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

July 30th, 01:44 pm

భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఈ రోజు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన ‘‘జర్నీ టువార్డ్స్ వికసిత్ భారత్: ఎ పోస్ట్ యూనియన్ బడ్జెట్ 2024-25 కాన్ఫరెన్స్’’ (అభివృద్ధి చెందిన భారతదేశం దిశగా పయనం: 2024-25 కేంద్ర బడ్జెట్ అనంతర సమావేశం) ప్రారంభ సదస్సును ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వృద్ధి కోసం ప్రభుత్వం అమలుపరుస్తున్న విశాల దృష్టికోణం రూపు రేఖలను, అందులో పరిశ్రమ పోషించవలసిన పాత్రను వివరించాలన్న లక్ష్యంతో ఈ సదస్సు ను ఏర్పాటు చేశారు. పరిశ్రమ, ప్రభుత్వం, దౌత్య సముదాయం, మేధావి వర్గం తదితర రంగాలకు చెందిన ఒక వేయి మందికి పైగా ఈ సమావేశానికి స్వయంగా హాజరు కాగా, దేశ, విదేశాలలోని వివిధ సిఐఐ కేంద్రాల నుంచి చాలా మంది ఈ సమావేశంతో అనుసంధానమయ్యారు.

బడ్జెటు 2024-25 పై ప్రధాన మంత్రి స్పందన

July 23rd, 02:57 pm

దేశాన్ని అభివృద్ధి పరంగా నూతన శిఖరాలకు చేర్చే ఈ ముఖ్యమైన బడ్జెటు విషయంలో నా దేశ ప్రజలందరికీ నేను నా అభినందనలను తెలియజేస్తున్నాను. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, ఆమె బృందానికి కూడా నేను హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నాను.

బడ్జెట్ 2024-25 పై ప్రధాన మంత్రి వ్యాఖ్యలు

July 23rd, 01:30 pm

కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్ సభ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25 ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.