నేపాల్‌లోని లుంబినిలో బౌద్ధ సంస్కృతి-వారసత్వంపై భారత అంతర్జాతీయ కేంద్రానికి శిలాఫలకం ఆవిష్కరణ
May 16th, 12:36 pm
భారత, నేపాల్ ప్రధానమంత్రులు శ్రీ నరేంద్ర మోదీ, గౌరవనీయులైన షేర్ బహదూర్ దేవ్‌బా ఇవాళ నేపాల్‌లోని లుంబినిలోగల లుంబినీ సన్యాసుల కేంద్రంలో ‘బౌద్ధ సంస్కృతి-వారసత్వంపై భారత అంతర్జాతీయ కేంద్రం నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించారు. న్యూఢిల్లీలోని అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (ఐబీసీ), నేపాల్‌లోని లుంబిని డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఎల్‌డీటీ)ల మధ్య 2022 మార్చిలో కుదిరిన ఒప్పందాలపై సంతకాలు చేసిన మేరకు అక్కడ ఎల్‌డీటీ తనకు కేటాయించిన స్థలంలో ఐబీసీ ఈ కేంద్రాన్ని నిర్మిస్తుంది.