బీహార్ లోని దర్భంగాలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

November 13th, 11:00 am

జనక మహారాజు, సీతమ్మల పవిత్ర భూమికీ.. మహా కవి విద్యాపతి జన్మస్థలికీ నా వందనం. సుసంపన్నమైన, దివ్యమైన ఈ ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

బీహార్‌లో రూ.12,100 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసి జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ

November 13th, 10:45 am

సుమారు రూ.12,100 కోట్లతో బీహార్‌లోని దర్భంగాలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయిన వాటిని లాంఛనంగా ప్రారంభించారు. వాటిలో ఆరోగ్యం, రైలు, రోడ్లు, పెట్రోలియం, సహజవాయు రంగాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయి.

పాళీ భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బుద్దుని బోధనలు విశ్వసించే వారిలో ఆనందాన్ని నింపింది: ప్రధాన మంత్రి

October 24th, 10:43 am

పాళీ భాషకు ప్రాచీన హోదా కల్పిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం బుద్ధ భగవానుని బోధనలను అనుసరిస్తున్న వారిలో ఆనందోత్సాహాలు నింపుతుందని అన్నారు. కొలంబోలో ఐసీసీఆర్ నిర్వహించిన ‘ప్రాచీన భాషగా పాళీ’ అనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న పండితులు, బౌద్ధ భిక్షువులకు ధన్యవాదాలు తెలిపారు.

అంతర్జాతీయ అభిధమ్మ దివస్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

October 17th, 10:05 am

సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు జీ, భదంత్ రాహుల్ బోధి మహాథెరో జీ, గౌరవ జాంగ్‌చుప్ చోడెన్ జీ, మహాసంఘ గౌరవ సభ్యులు, ప్రముఖులు, దౌత్య సంఘం సభ్యులు, బౌద్ధ పండితులు, బుద్ధుని బోధనలను ఆచరిస్తున్నవారు, సోదరసోదరీమణులారా.

అంతర్జాతీయ అభిధమ్మ దివస్ వేడుకలు, ప్రాచీన భాషగా పాళీ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

October 17th, 10:00 am

అంతర్జాతీయ అభిధమ్మ దివస్ వేడుకలు, ప్రాచీన భాషగా పాళీకి గుర్తింపు వచ్చిన సందర్భంగానూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. అభిధమ్మను బోధించిన అనంతరం స్వర్గం నుంచి బుద్ధుడు తిరిగి వచ్చిన రోజును అభిధమ్మ దివస్‌గా పాటిస్తారు. బుద్ధుని అభిధమ్మ బోధనలు పాళీ భాషలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాచీన భాషగా పాళీకి ఇటీవల దక్కిన గుర్తింపు... ఈ ఏడాది అభిధమ్మ దివస్ వేడుకల ప్రాధాన్యాన్ని పెంచింది.

ఆంగ్ల అనువాదం: లావో‌స్‌లోని వియాంటియాన్‌లో జరుగుతోన్న 19వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

October 11th, 08:15 am

ఆసియాన్ ఐక్యత కోసం, ప్రాంతీయంగా అది ప్రధాన శక్తిగా ఎదిగేందుకు భారత్ నిరంతరం మద్దతిస్తోంది. భారత్ ఇండో-పసిఫిక్ దార్శనికత, క్వాడ్ సహకారానికి ఆసియాన్ కీలకం. భారత్ తీసుకున్న ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమం, ఇండో-పసిఫిక్‌పై ఆసియాన్ దృక్పథం మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. ఈ మొత్తం ప్రాంతంలో శాంతి నెలకొనడంతోపాటు అభివృద్ధి జరగడానికి స్వేచ్ఛ, అరమరికలులేని, సమ్మిళిత, అభ్యున్నతి దిశగా- పద్ధతితో కూడిన ఇండో-పసిఫిక్ కార్యక్రమాలు ఉండాలి.

19వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొన్న ప్రధాన మంత్రి

October 11th, 08:10 am

ఇండో-పసిఫిక్ ప్రాంతీయ రాజకీయ నిర్మాణంలోనూ, భారతదేశపు ఇండో-పసిఫిక్ దార్శనికత, క్వాడ్ సహకారంలో- ఆసియాన్ పాత్ర చాలా కీలకమని ప్రధానమంత్రి తన ప్రసంగంలో వివరించారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో భారతదేశం పాల్గొనడం తన తూర్పు దేశాల ప్రాధాన్యత (యాక్ట్ ఈస్ట్)లో ముఖ్యమైన విధానమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో శాంతికీ, అభివృద్ధికీ- స్వేచ్చ, సమ్మిళిత, సుసంపన్నమైన, నియమాల ఆధారిత ఇండో-పసిఫిక్ ముఖ్యమని చెబుతూ భారతదేశ ఇండో-పసిఫిక్ మహాసముద్ర కార్యక్రమం, ఇండో-పసిఫిక్‌పై ఆసియాన్ దృక్పథం మధ్య సారూప్యత, సాధారణ విధానం గురించీ మాట్లాడారు. ఈ ప్రాంతం విస్తరణ వాదంపై దృష్టి సారించడం కంటే అభివృద్ధి ఆధారిత విధానాన్ని అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు.

రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

June 30th, 11:00 am

మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.

భగవాన్ బుద్ధుని ఆదర్శాల ను కొనియాడిన ప్రధాన మంత్రి

March 05th, 09:47 am

థాయీలాండ్ లోని లక్షల కొద్దీ భక్త జనం 2024 ఫిబ్రవరి 23 వ తేదీ మొదలుకొని మార్చి నెల 3 వ తేదీ మధ్య కాలం లో బ్యాంకాక్ లో భగవాన్ బుద్ధుని మరియు ఆయన శిష్యులు అరహంత్ సారిపుత్త్ కు మరియు అరహంత్ మహా మోగ్గలానా కు చెందిన పవిత్రమైనటువంటి అవశేషాల కు నమస్సులు అర్పించిన నేపథ్యం లో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భగవాన్ బుద్ధుని ఆదర్శాల ను ఈ రోజు న కొనియాడారు.

జి-20 దేశాల సాంస్కృతిక మంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రసంగం

August 26th, 10:15 am

కాశీగా సుప్రసిద్ధమైన వారణాసికి మీ అందరికీ స్వాగతం. నా పార్లమెంటరీ నియోజకవర్గం అయిన వారణాసిలో మీరు సమావేశం కావడం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది. కాశీ ప్రపంచంలోనే అతి పురాతన నగరమే కాదు, భగవాన్ బుద్ధుడు తొలిసారిగా బోధలు చేసిన సారనాథ్ కు సమీపంలోని నగరం. కాశీ ‘‘జ్ఞానసంపద, ధర్మం, సత్యరాశి’’ గల నగరంగా ప్రసిద్ధి చెందింది. అది భారతదేశానికి వాస్తవమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక రాజధాని. మీరంతా గంగా హారతిని తిలకించేందుకు, సారనాథ్ సందర్శనకు, కాశీ రుచులు చవి చూసేందుకు కొంత సమయం కేటాయించుకున్నారని నేను ఆశిస్తున్నాను.

జి-20 సాంస్కృతిక మంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 26th, 09:47 am

కాశీగా ప్రసిద్ధి చెందిన వారణాసికి ప్రతినిధులను ఆహ్వానిస్తూ తన పార్లమెంటరీ నియోజకవర్గం కూడా అయిన ఈ నగరంలో జి-20 సాంస్కృతిక మంత్రుల సమావేశం జరగడం పట్ల ఆనందం ప్రకటించారు. పురాతన కాలం నుంచి సజీవంగా ఉన్న నగరాల్లో కాశీ ఒకటని పేర్కొంటూ ఈ నగరానికి సమీపంలోనే ఉన్న సారనాథ్ లో భగవాన్ బుద్ధుడు తన తొలి బోధ చేశాడని గుర్తు చేశారు. ‘‘కాశీ జ్ఞానసంపద, విధినిర్వహణ, సత్యానికి ప్రతీక; అది అసలు సిసలైన భారత సాంస్కృతిక, ఆధ్యాత్మక రాజధాని’’ అన్నారు. నగరంలో జరిగే గంగా హారతిని వీక్షించాలని, సారనాథ్ సందర్శించడంతో పాటు కాశీలోని రుచికరమైన వంటలు రుచి చూడాలని ప్రధానమంత్రి అతిథులకు సూచించారు.

తన ప్రసంగాలలో బుద్ధుని ప్రస్తావనల పిఐబి పుస్తకాన్ని షేర్ చేసిన ప్రధాన మంత్రి

April 19th, 08:48 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీలో జరిగే అంతర్జాతీయ బౌద్ధ శిఖరాగ్ర సభనుద్దేశించి ప్రసంగిస్తారు.

భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

January 29th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఇది 2023సంవత్సరంలో మొదటి 'మన్ కీ బాత్'. ఈ కార్యక్రమ పరంపరలో ఇది తొంభై ఏడవ ఎపిసోడ్ కూడా. మీ అందరితో మరోసారి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం జనవరి నెల చాలా సంఘటనలతో కూడి ఉంటుంది. ఈ నెల-జనవరి 14కు అటూ ఇటూగా ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు దేశవ్యాప్తంగా పండుగలు పుష్కలంగా ఉంటాయి. వీటి తర్వాత దేశం గణతంత్ర పండుగను కూడా జరుపుకుంటుంది.ఈసారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు అంశాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. జనవరి 26న కవాతు సందర్భంగా కర్తవ్య్ పథ్ ను నిర్మించిన కార్మికులను చూసి చాలా సంతోషమైందని జైసల్మేర్ నుండి పుల్కిత్ నాకురాశారు. పెరేడ్‌లో చేర్చిన అంశాలలో భారతీయ సంస్కృతికి సంబంధించిన విభిన్న కోణాలను చూడటం తనకు నచ్చిందని కాన్పూర్‌కు చెందిన జయరాశారు. తొలిసారిగా ఈ పెరేడ్ లో పాల్గొన్న ఒంటెలను అధిరోహించిన మహిళా రైడర్లతో పాటు సీఆర్‌పీఎఫ్‌లోని మహిళా దళానికి కూడా ప్రశంసలందుతున్నాయి.

పవిత్రకరమైనటువంటి ఆషాడ పూర్ణిమ సందర్భం లో భగవాన్ బుద్ధుని ఉత్తమ బోధనల నుస్మరించుకొన్న ప్రధాన మంత్రి

July 13th, 09:34 am

పవిత్రకరమైనటువంటి ఆషాడ పూర్ణిమ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

రోటరీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి - ప్రసంగం

June 05th, 09:46 pm

రోటరీ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ స్థాయిలో జరుగుతున్న ప్రతి రోటరీ సమావేశం ఒక చిన్న- ప్రపంచ కూటమి లాంటిది. ఇందులో వైవిధ్యం ఉంది. చైతన్యం ఉంది. మీ రొటేరియన్ లు అందరూ మీ మీ స్వంత రంగాల్లో విజయం సాధించినప్పటికీ, మీ వ్యాపకానికి మాత్రమే మీరు పరిమితం కాలేదు. మన ప్రపంచం అంతా బాగుండాలనే మీ కోరిక మిమ్మల్ని ఈ వేదికపైకి తీసుకొచ్చింది. ఇది విజయం మరియు సేవ యొక్క నిజమైన మిశ్రమంగా నేను భావిస్తున్నాను.

రోట‌రీ ఇంట‌ర్నేష‌న‌ల్ అంత‌ర్జాతీయ స‌మ్మేళ‌నాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

June 05th, 09:45 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా రోట‌రీ ఇంట‌ర్నేష‌న‌ల్ వ‌ర‌ల్డ్ క‌న్వెన్ష‌న్‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. రోటేరియ‌న్లు విజ‌య్ం, సేవ ల నిజ‌మైన క‌ల‌యిక‌కు ప్ర‌తిబింబం అన్నారు.ఈ స్థాయిలో ప్ర‌తి రోట‌రీ స‌మావేశం ఒక మినీ గ్లోబ‌ల్ అసెంబ్లీ వంటిద‌ని అన్నారు. ఇందులో వైవిధ్య‌త‌, చైత‌న్యం రెండూ ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు.

జపాన్‌ లోని టోక్యోలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం - తెలుగు అనువాదం

May 23rd, 08:19 pm

నేను జపాన్‌ను సందర్శించిన ప్రతిసారీ, మీ ప్రేమ, ఆప్యాయతలు కాలంతో పాటు పెరుగుతుండడాన్ని నేను గమనించాను. మీలో చాలా మంది అనేక సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. జపాన్ భాష, దుస్తులు, సంస్కృతి, ఆహారం ఒక విధంగా మీ జీవితంలో ఒక భాగమయ్యాయి. ఇలా మీరు ఎల్లప్పుడూ అందరినీ కలుపుకొని పోవడానికి, అందరితో కలిసిపోయే భారతీయ సమాజం యొక్క సంస్కృతి ఒక కారణం. అయితే, అదే సమయంలో, జపాన్ తన సంప్రదాయం, దాని విలువలు, ఈ భూమిపై దాని జీవితం పట్ల కలిగి ఉన్న నిబద్ధత కూడా మరో ముఖ్య కారణం. మరి ఇప్పుడు ఆ రెండు కారణాలు కలిసాయి. అందువల్ల, సొంతమనే భావన కలగడం చాలా సహజం.

జపాన్ లో భారతీయ సముదాయం తో మాట్లాడిన ప్రధాన మంత్రి

May 23rd, 04:15 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ లో 700 మంది కి పైగా ప్రవాసీ భారతీయుల ను ఉద్దేశించి ఈ రోజు (2022 మే 23వ తేదీ) న ప్రసంగించారు. వారితో ఆయన ముచ్చటించారు కూడాను.

ఉత్తరప్రదేశ్ లో తొమ్మిది వైద్య కళాశాలల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

October 25th, 10:31 am

బుద్ధ భగవానుడి పుణ్యభూమి అయిన సిద్ధార్థనగర్ నుండి నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. బుద్ధ భగవానుడు తన తొలినాళ్లను గడిపిన భూమిలో తొమ్మిది వైద్య కళాశాలలు ప్రారంభమవుతున్నాయి. ఆరోగ్యకరమైన, ఫిట్ ఇండియా దిశగా ఇది పెద్ద అడుగు. మీ అందరికీ అభినందనలు.

ఉత్తర్ ప్రదేశ్ లోని సిద్ధార్థ్ నగర్ లో 9 వైద్య కళాశాల లను ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 25th, 10:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని సిద్ధార్థ్ నగర్ లో 9 మెడికల్ కాలేజీల ను ప్రారంభించారు. అవి సిద్ధార్థ్ నగర్, ఎటా, హర్ దోయి, ప్రతాప్‌ గఢ్, ఫతేహ్ పుర్, దేవరియా, గాజీపుర్, మీర్జాపుర్ మరియు జౌన్‌ పుర్ లలో ఏర్పాటయ్యాయి. ఈ కార్యక్రమం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు.