భారతదేశం – శ్రీలంక సంయుక్త ప్రకటన: ఒక ఉమ్మడి భవిత కోసం భాగస్వామ్యాలను ప్రోత్సహించడం

December 16th, 03:26 pm

శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనూర కుమార దిసనాయక 2024 డిసెంబరు 16న భారతదేశానికి ఆధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంగా న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వారిద్దరూ సమగ్ర, ఫలప్రద చర్చలు జరిపారు.

బ్రెజిల్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ

November 20th, 08:05 pm

రియో డి జనీరో లో జరుగుతున్న జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాకియో లూలా ద సిల్వా తో సమావేశమయ్యారు. శ్రీ లూలా ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని, జి-20, ఐబీఎస్ఏ (భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా కూటమి) అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలియజేశారు. పేదరికం, క్షుద్బాధల నిర్మూలన కోసం ప్రపంచ స్థాయి సహకార సమితిని ప్రారంభించాలన్న శ్రీ లూలా యోచన పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీ మోదీ, సంస్థకు భారత్ సంపూర్ణ మద్దతునిస్తుందని వెల్లడించారు. మూడు దేశాల జి-20 ప్రత్యేక బృందం (ట్రోయికా) సభ్య దేశంగా బ్రెజిల్ జి-20 ఎజెండాకు శ్రీ మోదీ సంపూర్ణ మద్దతును తెలిపారు. జి-20 కార్యాచరణ పత్రంలో సుస్థిరాభివృద్ధి, ప్రపంచ పాలనలో సంస్కరణలు వంటి లక్ష్యాలను పేర్కొనడం సహా అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకు ప్రాముఖ్యాన్నివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వచ్చే యేడాది బ్రెజిల్ చేపట్టనున్న ‘బ్రిక్స్’ సదస్సు, ‘కాప్-30’ అధ్యక్ష బాధ్యతలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ మోదీ, బ్రెజిల్ కు భారత్ సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.

గుజరాత్ అమ్రేలీలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

October 28th, 04:00 pm

వేదికపైనున్న గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ గారూ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ సీ ఆర్ పాటిల్ గారూ, గుజరాత్ అక్కాచెల్లెళ్ళూ, అన్నదమ్ములూ, ముఖ్యంగా అమ్రేలీ సోదర సోదరీమణులారా..

గుజరాత్‌లోని అమ్రేలీలో ₹4,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం... ప్రధానమంత్రి శ్రీ మోదీ శంకుస్థాపన

October 28th, 03:30 pm

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- దేశమంతటా ఉప్పొంగుతున్న దీపావళి, ధంతేరాస్ పండుగల స్ఫూర్తిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పండుగ‌లు మన సంస్కృతిని ఘనంగా చాటుతాయని, అలాగే ప్రగతి పురోగ‌మన వేగానికీ అంతే ప్రాముఖ్యం ఉంటుందని గుర్తుచేశారు. వడోదరలో నేటి తన పర్యటనను ప్రస్తావిస్తూ- గుజరాత్ అంతటా చేపడుతున్న అనేక కీలక ప్రాజెక్టుల గురించి తాజా సమాచారాన్ని ప్రజలతో పంచుకున్నారు. వీటిలో భాగంగా భారత వైమానిక దళం కోసం దేశీయ విమానాల తయారీకి ఈ నగరంలో ఏర్పాటు చేసిన తొలి కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. దీనికిముందు అమ్రేలీలో ‘భారతమాత’ సరోవరం ప్రారంభించడాన్ని గుర్తుచేస్తూ- జల సంరక్షణ కార్యక్రమాలు సహా రైల్వేలు, రహదారుల సంబంధిత అనేక భారీ ప్రాజెక్టులను ప్రారంభించామని, మరికొన్నిటికి శంకుస్థాపన చేశామని వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లోని ప్రజల జీవన సౌలభ్యం మెరుగవుతుందని చెప్పారు. అంతేగాక స్థానిక రైతుల సౌభాగ్యానికి, ఈ ప్రాంతంలో ప్రగతి వేగం పుంజుకోవడానికి ఇవి దోహదం చేస్తాయన్నారు. మరోవైపు యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిపై ప్రజానీకానికి అభినందనలు తెలిపారు.

రష్యా అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ

October 22nd, 10:42 pm

కజాన్‌లో జ‌రుగుతున్న బ్రిక్స్ 16వ శిఖ‌రాగ్ర స‌ద‌స్సు సంద‌ర్భంగా ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌మావేశ‌మ‌య్యారు. ఈ ఏడాది వారిరువురూ స‌మావేశం కావ‌డం ఇది రెండోసారి. ఈ ఏడాది జూలైలో 22వ వార్షిక శిఖ‌రాగ్ర స‌ద‌స్సు సంద‌ర్భంగా నాయ‌కులిద్ద‌రూ ఒకసారి స‌మావేశ‌మ‌య్యారు.

Prime Minister meets with the President of the Islamic Republic of Iran

October 22nd, 09:24 pm

PM Modi met Iran's President Dr. Masoud Pezeshkian on the sidelines of the 16th BRICS Summit in Kazan. PM Modi congratulated Pezeshkian on his election and welcomed Iran to BRICS. They discussed strengthening bilateral ties, emphasizing the Chabahar Port's importance for trade and regional stability. The leaders also addressed the situation in West Asia, with PM Modi urging de-escalation and protection of civilians through diplomacy.

రష్యా అధ్యక్షునితో ద్వైపాక్షిక సమావేశం లో ప్రధానమంత్రి తొలి పలుకులు (అక్టోబర్ 22, 2024)

October 22nd, 07:39 pm

మీ స్నేహం, సాదర స్వాగతం, ఆతిథ్యం అందించిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కోసం అందమైన కజాన్ నగరాన్ని సందర్శించినందుకు సంతోషిస్తున్నాను. ఈ నగరంతో భారతదేశానికి చారిత్రక సంబంధాలు ఉన్నాయి. కజాన్ నగరంలో నూతన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించడం వల్ల ఆ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి.

PM Modi arrives in Kazan, Russia

October 22nd, 01:00 pm

PM Modi arrived in Kazan, Russia. During the visit, the PM will participate in the BRICS Summit. He will also be meeting several world leaders during the visit.

బ్రిక్స్ సదస్సు కోసం రష్యా వెళ్లే ముందు ప్రధాని చేసిన ప్రకటన

October 22nd, 07:36 am

బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను ఆహ్వానించారని, ఈ రోజు నేను రెండు రోజుల పర్యటన నిమిత్తం కజాన్‌కు బయలుదేరుతున్నాను.

Joint Statement following the 22nd India-Russia Annual Summit

July 09th, 09:54 pm

Prime Minister of the Republic of India Shri Narendra Modi paid an official visit to the Russian Federation on July 8-9, 2024 at the invitation of President of the Russian Federation H.E. Mr. Vladimir Putin for the 22nd India – Russia Annual Summit.

ప్రెసిడెంట్ శ్రీ పుతిన్ తో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

January 15th, 06:39 pm

రశ్యన్ ఫెడరేశన్ యొక్క ప్రెసిడెంటు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా ఈ రోజు న సంభాషించారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ సంభాషణ

August 28th, 06:59 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రష్యా సమాఖ్య అధ్యక్షుడు గౌరవనీయ వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా దేశాధినేతలిద్దరూ ద్వైపాక్షిక సహకారంపై అనేక అంశాలకు సంబంధించి పురోగతిని సమీక్షించారు. అలాగే జోహన్నెస్‌బర్గ్‌లో ఇటీవల ముగిసిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సహా పరస్పర ప్రాముఖ్యంగల ప్రాంతీయ-అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

గ్రీస్ లోని ఏథెన్స్ లో భారతీయులనుద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

August 25th, 09:30 pm

వేడుకల వాతావరణం, పండుగ ఉత్సాహం ఉన్నప్పుడు ఎవరైనా త్వరగా తమ కుటుంబ సభ్యుల మధ్య ఉండాలని కోరుకుంటారు.నేను కూడా నా కుటుంబ సభ్యుల మధ్యకు వచ్చాను. ఇది ఒక రకంగా శివుని మాసంగా భావించే శ్రావణ మాసం, ఈ పవిత్ర మాసంలో మన దేశం ఒక కొత్త మైలురాయిని సాధించింది. చంద్రుడి డార్క్ జోన్ అయిన దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రుడిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, భారత సామర్థ్యాలను యావత్ ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రపంచం నలుమూలల నుంచి అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు తమ శుభాకాంక్షలను పంపుతున్నారు, మరియు ప్రజలు మిమ్మల్ని కూడా అభినందిస్తున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను, కాదా? మీకు చాలా అభినందనలు కూడా వస్తున్నాయి కదా? ప్రతి భారతీయుడు దీనిని అందుకుంటున్నాడు. సోషల్ మీడియా మొత్తం అభినందన సందేశాలతో నిండిపోయింది. విజయం అంత ముఖ్యమైనప్పుడు, ఆ విజయం కోసం ఉత్సాహం స్థిరంగా ఉంటుంది. మీరు ప్రపంచంలో ఎక్కడైనా జీవించవచ్చు, కానీ భారతదేశం అనే భావన మీ హృదయంలో బలంగా ఉంటుందని మీ ముఖం కూడా చెబుతుంది. భారతదేశం మీ గుండె లయలో ఉంటుంది, భారతదేశం మీ గుండె లయలో ఉంటుంది, భారతదేశం మీ గుండె లయలో ఉంటుంది. ఈ రోజు, నేను మీ అందరి మధ్య గ్రీస్ లో ఉన్నాను, చంద్రయాన్ యొక్క అద్భుతమైన విజయానికి మరోసారి నేను ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

ఏథెన్స్ లో ఉంటున్న భారతీయ సముదాయం తో మాట్లాడిన ప్రధాన మంత్రి

August 25th, 09:00 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25 వ తేదీ నాడు ఏథెన్స్ లోని ఏథెన్స్ కన్సర్వేటాయర్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

బ్రిక్స్ 15వ సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి

August 23rd, 08:57 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 23న దక్షిణాఫ్రికా అధ్యక్షతన జోహాన్నెస్‌బర్గ్‌ లో ప్రారంభమైన ‘బ్రిక్స్‌’ 15వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, ఆఫ్రికాసహా దక్షిణార్థ గోళ దేశాలతో భాగస్వామ్యం తదితర అంశాలపై కూటమి దేశాల అధినేతలు ఈ సందర్భంగా చర్చించారు. అలాగే ‘బ్రిక్స్’ కార్యాచరణ జాబితాలోని అంశాల అమలులో ఇప్పటిదాకా పురోగతిని వారు సమీక్షించారు.

చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ అయిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగం తెలుగు అనువాదం

August 23rd, 07:36 pm

మన కళ్లముందే చరిత్ర ఆవిష్కృతం అయితే జీవితం ధన్యమవుతుంది. ఇటువంటి చారిత్రక సంఘటనలు ఒక జాతి జీవితానికి శాశ్వత చైతన్యంగా మారతాయి. ఈ క్షణం మరువలేనిది. ఈ క్షణం అపూర్వం. ఈ క్షణం అభివృద్ధి చెందిన భారతదేశ విజయ నినాదం. ఈ క్షణం నవ భారత విజయం. ఈ క్షణం కష్టాల సముద్రాన్ని దాటడమే. ఈ క్షణం విజయపథంలో నడవడమే. ఈ క్షణం 1.4 బిలియన్ హృదయ స్పందనల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ క్షణం భారతదేశంలో కొత్త శక్తిని, కొత్త నమ్మకాన్ని, కొత్త చైతన్యాన్ని సూచిస్తుంది. ఈ క్షణం భారతదేశం అధిరోహించే గమ్యానికి పిలుపు. ఈ ఏడాది 'అమృత్ కాల్' ఉదయాన్నే తొలి విజయపు వెలుగును కురిపించింది. మనం భూమిపై ఒక ప్రతిజ్ఞ చేసాము దానిని చంద్రుడిపై నెరవేర్చాము. సైన్స్ రంగం లోని మన సహచరులు కూడా భారతదేశం ఇప్పుడు చంద్రుడిపై ఉంది అని చెప్పారు. ఈ రోజు, అంతరిక్షంలో నవ భారతదేశ (న్యూ ఇండియా) కొత్త ప్రయాణాన్ని మనం చూశాము.

చంద్రయాన్ 3 ల్యాండింగ్ ను వీక్షించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇస్రో బృందంలో చేరిన ప్రధాని

August 23rd, 06:12 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 3 ల్యాండింగ్ ను వీక్షించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇస్రో బృందంతో చేరారు. విజయవంతంగా ల్యాండింగ్ అయిన వెంటనే ప్రధాని ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు వారిని అభినందించారు.

దక్షిణ ఆఫ్రికాఅధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి

August 23rd, 03:05 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జోహాన్స్ బర్గ్ లో బ్రిక్స్ పదిహేనో శిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో దక్షిణ ఆఫ్రికా గణతంత్రం అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా తో 2023 ఆగస్టు 23 వ తేదీ న సమావేశమయ్యారు.

బ్రిక్స్ లీడర్స్రిట్రీట్ మీటింగ్ లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

August 22nd, 11:58 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జోహాన్స్ బర్గ్ లోని సమర్ పాలెస్ లో 2023 ఆగస్టు 22 వ తేదీ న జరిగిన బ్రిక్స్ లీడర్స్ రిట్రీట్ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.

Together BRICS can contribute significantly to global welfare, particularly of the Global South: PM Modi

August 22nd, 10:42 pm

PM Modi participated in the BRICS Business Forum Leaders’ Dialogue in Johannesburg. PM Modi noted that Covid had highlighted the importance of resilient and inclusive supply chains, and emphasized the importance of mutual trust and transparency for this. He also stressed that together BRICS can contribute significantly to global welfare, particularly of the Global South.