మల్టీ-స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ (MSCS) చట్టం, 2002 కింద జాతీయ స్థాయి బహుళ-రాష్ట్ర సహకార విత్తన సంఘం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం

January 11th, 03:40 pm

మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ (MSCS) చట్టం, 2002 ప్రకారం జాతీయ స్థాయి బహుళ-రాష్ట్ర విత్తన సహకార సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ప్రకారం ఏర్పాటయ్యే జాతీయ స్థాయి బహుళ-రాష్ట్ర విత్తన సహకార సంఘం నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సేకరణ, ప్రాసెసింగ్, బ్రాండింగ్, లేబులింగ్, ప్యాకేజింగ్, నిల్వ, మార్కెటింగ్ మరియు పంపిణీ కోసం ఒక ఉన్నత సంస్థగా వ్యవహరిస్తుంది. వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ధి, దేశీయ సహజ విత్తనాల సంరక్షణ మరియు ప్రచారం కోసం ఒక వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. సంబంధిత మంత్రిత్వ శాఖలు ముఖ్యంగా వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) మరియు నేషనల్ సీడ్ కార్పొరేషన్ (NSC) సహకారంతో దేశవ్యాప్తంగా వివిధ సహకార సంఘాల ద్వారా వారి పథకాలు మరియు ఏజెన్సీల ద్వారా 'సంపూర్ణ ప్రభుత్వ విధానం' కింద కార్యక్రమాలు అమలు చేస్తుంది .

గోవాకు చెందిన హెచ్ సిడ‌బ్ల్యులు, కోవిడ్ వ్యాక్సినేష‌న్ ల‌బ్ధిదారుల‌తో ముఖాముఖి స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం

September 18th, 10:31 am

నిత్యం ఉత్సాహం పొంగిపొర్లే, ప్ర‌జాద‌ర‌ణ గ‌ల గోవా ముఖ్య‌మంత్రి శ్రీ ప్ర‌మోద్ సావంత్ జీ; గోవా పుత్రుడు, నా కేంద్ర కేబినెట్ స‌హ‌చ‌రుడు శ్రీ శ్రీ‌పాద్ నాయ‌క్ జీ, కేంద్ర ప్ర‌భుత్వంలో నా మంత్రి మండ‌లి స‌హ‌చ‌రుడు డాక్ట‌ర్ భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్ జీ, గోవాకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ప్ర‌జాప్ర‌తినిధులు, క‌రోనా పోరాట యోధులు, సోద‌ర‌సోద‌రీమ‌ణులారా!

గోవా లో కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తో, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల తో మాట్లాడిన ప్రధాన మంత్రి

September 18th, 10:30 am

గోవా లో వయోజన జనాభా కు ఒకటో డోసు ను 100 శాతం వేయించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అక్కడి ఆరోగ్య సంరక్షణ కార్మికుల తోను, కోవిడ్ టీకా కార్యక్రమం లబ్ధిదారుల తోను మాట్లాడారు.