PM Modi pays tributes to Pujya Sant Shri Sewalal Maharaj Ji on his birth anniversary

February 15th, 05:12 pm

The Prime Minister, Shri Narendra Modi paid tributes to Pujya Sant Shri Sewalal Maharaj Ji on his birth anniversary.

PM Modi pays tributes to Maharishi Dayanand Saraswati on his birth anniversary

February 12th, 02:24 pm

The Prime Minister Shri Narendra Modi today paid tributes to the great thinker, social reformer and ardent nationalist Maharishi Dayanand Saraswati on his birth anniversary.

Prime Minister pays tributes to Sant Guru Ravidas on his birth anniversary

February 12th, 12:38 pm

The Prime Minister, Shri Narendra Modi today paid tributes to Sant Guru Ravidas on his birth anniversary. Shri Modi also shared a video of his thoughts on Sant Guru Ravidas.

పంజాబ్ కేసరి లాలా లాజ్‌పత్ రాయ్ జయంతి.. ప్రధానమంత్రి శ్రద్ధాంజలి

January 28th, 01:17 pm

పంజాబ్ కేసరి లాలా లాజ్‌పత్ రాయ్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

భారత్ రత్న కర్పూరీ ఠాకుర్ గారి జయంతి.. ప్రధానమంత్రి శ్రద్ధాంజలి

January 24th, 08:51 am

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, భారత రత్న కర్పూరీ ఠాకుర్ గారి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

PM Modi’s candid interaction with students on the Jayanti of Netaji Subhas Chandra Bose

January 23rd, 04:26 pm

On Parakram Diwas, PM Modi interacted with students in Parliament, discussing India’s goal of becoming a Viksit Bharat by 2047. The students highlighted Netaji Subhas Chandra Bose's inspiring leadership and his famous slogan, Give me blood, and I promise you freedom. PM Modi emphasized sustainability initiatives like electric buses to reduce the nation’s carbon footprint.

పరాక్రమ్ దివస్.. విద్యార్థులతో ప్రధానమంత్రి మాటామంతీ

January 23rd, 03:36 pm

పరాక్రమ్ దివస్ (పరాక్రమ దినోత్సవం) పేరిట నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతిని స్మరించుకొంటున్న సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో యువ మిత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2047కల్లా దేశం సాధించాలనుకుంటున్న లక్ష్యం ఏమిటంటారు? అని విద్యార్థులను ఆయన అడిగారు. ఓ విద్యార్థి ఎంతో ఆత్మవిశ్వాసంతో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనేదే ఆ లక్ష్యం అంటూ జవాబిచ్చారు. 2047కే ఎందుకు? అంటూ ప్రధాని మళ్లీ ప్రశ్నించారు. దీనికి ఇంకొక విద్యార్థి సమాధానాన్నిస్తూ, ‘‘అప్పటికల్లా మా తరం దేశ ప్రజలకు సేవ చేయడానికి సన్నద్ధమవుతుంది. ఆసరికి ఇండియా తన స్వాతంత్య్ర శతాబ్ది వేడుకలను జరుపుకోనుంద’’న్నారు.

పరాక్రమ దివస్ సందర్భంగా ప్రధాని ప్రసంగం

January 23rd, 11:30 am

నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా యావత్ దేశం ఆయనను భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటోంది. సుభాష్ బాబుకు వినమ్ర పూర్వక నివాళి అర్పిస్తున్నాను. ఆయన జన్మస్థలంలో ఈ ఏడాది పరాక్రమ దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒడిశా ప్రజలకు, ఒడిశా ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు. నేతాజీ జీవిత విశేషాలను వివరించేలా భారీ ప్రదర్శనను కూడా కటక్ లో ఏర్పాటు చేశారు. ఆయన జీవితంతో ముడిపడి ఉన్న అనేక వారసత్వ స్మారకాలను భద్రపరిచి ఈ ప్రదర్శనకు ఉంచారు. అనేకమంది చిత్రకారులు బోస్ జీవిత విశేషాలకు కాన్వాస్ పై చిత్రరూపమిచ్చారు. వీటన్నింటితో పాటు సుభాష్ బాబుకు సంబంధించిన అనేక పుస్తకాలను కూడా సేకరించారు. నేతాజీ ఈ ఘనమైన జీవిత ప్రస్థానం నా యువ భారతానికీ, నా భారతదేశానికి కొత్త శక్తిని అందిస్తాయి.

పరాక్రమ దివస్ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రసంగం

January 23rd, 11:25 am

పరాక్రమ దివస్‌గా నిర్వహిస్తున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేపథ్యంలో ఆయన్ను యావత్ దేశం సగౌరవంగా స్మరించుకుంటోందని అన్నారు. నేతాజీ సుభాష్ బోస్‌కు నివాళులు అర్పిస్తూ, ఈ ఏడాది పరాక్రమ దివస్ ఉత్సవాలను ఆయన జన్మస్థలమైన ఒడిశాలో ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీ మోదీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. నేతాజీ జీవితం ఆధారంగా ఒడిశాలోని కటక్‌లో భారీ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ప్రధాని వెల్లడించారు. ఎంతో మంది చిత్రకారులు నేతాజీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సంఘటనలను కాన్వాస్‌పై చిత్రించారని అన్నారు. అలాగే నేతాజీకి సంబంధించిన ఎన్నో పుస్తకాలను సైతం సేకరించినట్లు ఆయన తెలిపారు. నేతాజీ జీవిత ప్రయాణంలోని ముఖ్యమైన ఈ పరిణామాలు మేరీ యువ భారత్ లేదా మై భారత్‌కు కొత్త శక్తిని ఇస్తాయనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

బాలాసాహెబ్ థాకరే గారి జయంతి.. ప్రధానమంత్రి శ్రద్ధాంజలి

January 23rd, 08:55 am

బాలాసాహెబ్ థాకరే గారికి ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీ థాకరేను అంతా గౌరవిస్తారని, ప్రజాసంక్షేమానికి, మహారాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన కంకణం కట్టుకున్నారని, అందుకుగాను మనమంతా ఆయనను స్మరించుకొంటున్నామని శ్రీ మోదీ అన్నారు.

తిరు ఎం.జి. రామచంద్రన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రద్ధాంజలి

January 17th, 09:56 am

నేడు తిరు ఎం.జి. రామచంద్రన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. పేదలకు సాధికారతను కల్పించడానికీ, ఒక శ్రేష్ఠతరమైన సమాజాన్ని నిర్మించడానికీ ఆయన చేసిన కృషిని చూసి మనం గొప్ప ప్రేరణను పొందుతున్నామని శ్రీ మోదీ అన్నారు.

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వ‌హించిన ‘వికసిత భారత్‌ యువ నాయక చర్చాగోష్ఠి-2025’లో ప్రధానమంత్రి ప్రసంగం

January 12th, 02:15 pm

కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీమన్సుఖ్ మాండవీయ, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ జయంత్ చౌదరి, శ్రీమతి రక్షా ఖడ్సే, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రముఖులు సహా దేశం నలుమూలల నుంచి హాజరైన నా యువ మిత్రులారా!

‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

January 12th, 02:00 pm

స్వామి వివేకానంద జయంతిని స్మరించుకొంటూ పాటించే జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025’ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 3,000 మంది చురుకైన యువ నాయకులతో ఆయన మాట్లాడారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, మన దేశంలో యువతలో గొప్ప హుషారైన శక్తి నిండి ఉందంటూ, ఈ శక్తి భారత్ మండపానికి జవ జీవాలనిచ్చిందన్నారు. దేశ యువతపై అపార నమ్మకం పెట్టుకొన్న స్వామి వివేకానందను యావత్తు జాతి స్మరించుకొంటూ, ఆయనకు నివాళులు అర్పిస్తోందని ప్రధాని అన్నారు. స్వామి వివేకానంద తన శిష్యులు యువతరం నుంచే వస్తారనీ, వారు ప్రతి ఒక్క సమస్యనూ సింహాల్లా పరిష్కరిస్తారని నమ్మారనీ శ్రీ మోదీ అన్నారు. యువతపై స్వామీజీ నమ్మకాన్ని ఉంచినట్లే స్వామీజీ పట్లా, ఆయన విశ్వాసాల పట్లా తనకు పూర్తి విశ్వాసం ఉందని కూడా ప్రధాని తెలిపారు. ఆయననూ, ప్రత్యేకించి యువత విషయంలో ఆయనకున్న దృష్టి కోణాన్నీ తాను పూర్తిగా నమ్మినట్లు ప్రధానమంత్రి చెప్పారు. స్వామి వివేకానంద ఈ రోజు మన మధ్య ఉండి ఉంటే, 21వ శతాబ్ది యువజనంలో శక్తి జాగృతమై, వారు చేస్తున్న చురుకైన ప్రయత్నాలను చూసి స్వామి వివేకానందలో ఒక కొత్త విశ్వాసం తొణికిసలాడేదని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రద్ధాంజలి

January 12th, 10:18 am

స్వామి వివేకానంద జయంతి ఈ రోజు. ఈ సందర్శంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వామి వివేకానందకు శ్రద్ధాంజలి సమర్పించారు. యువతకు స్వామి వివేకానంద నిరంతరం ప్రేరణనిస్తున్నారనీ, యువజనుల మనస్సులలో ఆయన ఎప్పటికీ గాఢ ఉద్వేగాన్ని కలగజేయడంతోపాటు లక్ష్యాన్ని ఏర్పరుస్తూ ఉంటారని ప్రధాని అన్నారు.

రాణి వేలు నాచ్చియార్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి స్మృత్యంజలి

January 03rd, 10:59 am

ధీరవనిత రాణీ వేలు నాచ్చియార్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు స్మృత్యంజలి ఘటించారు. అసాధారణ ధైర్య సాహసాలతో వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన రాణి... యుద్ధ వ్యూహా రచనలో కూడా దిట్టగా పేరుగాంచారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ప్రముఖ సామాజిక కార్యకర్త సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి

January 03rd, 10:57 am

నేడు సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. మహిళా సాధికారతకు దిక్సూచిగా నిలిచిన సావిత్రీ ఫూలే విద్య, సామాజిక పరివర్తన రంగాల్లో మార్గదర్శిగా పాటుపడ్డారన్నారు.

శ్రీ మన్నాతు పద్మనాభన్ జయంతి సందర్భంగా ప్రధాని స్మృత్యంజలి

January 02nd, 04:40 pm

శ్రీ మన్నాతు పద్మనాభన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు స్మృత్యంజలి ఘటించారు. సమాజ ఉద్దరణకు, మహిళా సాధికారతకు, ప్రజల అభ్యున్నతికి విశేష కృషి చేశారని శ్రీ మోదీ ప్రశంసించారు.

మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి వందో జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రద్ధాంజలి

December 25th, 09:10 am

మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

పండిత్ మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్బంగా ఆయనను స్మరించుకొన్న ప్రధాన మంత్రి

December 25th, 08:56 am

మహామనా పండిత్ మదన్ మోహన్ మాలవీయ జయంతి ఈ రోజు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను స్మరించుకొన్నారు.

దిగ్గజ గాయకుడు మహ్మద్ రఫీ శత జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకున్న ప్రధానమంత్రి

December 24th, 07:12 pm

దిగ్గజ గాయకుడు మహ్మద్ రఫీ సాహెబ్ 100వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనను స్మరించుకున్నారు. మహ్మద్ రఫీ సాహెబ్ సంగీత ప్రావీణ్యుడంటూ కొనియాడిన ప్రధాని శ్రీ మోదీ.. సాంస్కృతికంగా ఆయన అన్ని తరాలనూ విశేషంగా ప్రభావితం చేశారని వ్యాఖ్యానించారు.