'మన్ కీ బాత్' పట్ల ప్రజలు చూపుతున్న అభిమానం అపూర్వమైనది: ప్రధాని మోదీ
May 28th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్'లోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈసారి 'మన్ కీ బాత్' ఎపిసోడ్ 2వ సెంచరీ ప్రారంభం. గత నెలలో మనమందరం ప్రత్యేక సెంచరీ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. మీ భాగస్వామ్యమే ఈ కార్యక్రమానికి అతిపెద్ద బలం. 100వ ఎపిసోడ్ ప్రసారమయ్యే సమయానికిఒక విధంగా దేశం మొత్తం ఒక సూత్రంతో అనుసంధానమై ఉంది. పరిశుభ్రతా కార్మికులైన సోదర సోదరీమణులు కావచ్చు. లేదా వివిధ రంగాలకు చెందిన అనుభవజ్ఞులు కావచ్చు. 'మన్ కీ బాత్' అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేసింది. 'మన్ కీ బాత్'పై మీరందరూ ప్రదర్శించిన ఆత్మీయత, స్నేహభావం అపూర్వమైనవి. అవి భావోద్వేగానికి గురి చేస్తాయి. 'మన్ కీ బాత్' ప్రసారమైనప్పుడుఆ సమయంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో, వివిధ టైమ్ జోన్లలో ఒకచోట సాయంత్రం, మరోచోట అర్థరాత్రి అయినప్పటికీ 100వ ఎపిసోడ్‌ను పెద్ద సంఖ్యలో ప్రజలు వీక్షించారు. వినేందుకు సమయం కేటాయించారు. వేల మైళ్ల దూరంలో ఉన్న న్యూజిలాండ్ నుండి వచ్చిన ఒక వీడియోను కూడా నేను చూశాను. అందులో వందేళ్ల ఒక అమ్మ తన ఆశీస్సులు ఇస్తోంది. భారతదేశంతో పాటు ఇతర నుండి కూడా ప్రజలు 'మన్ కీ బాత్'పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చాలా మంది నిర్మాణాత్మక విశ్లేషణ కూడా చేశారు. 'మన్ కీ బాత్'లో దేశం, దేశప్రజలు సాధించిన విజయాల గురించి మాత్రమే చర్చించడాన్ని ప్రజలు ప్రశంసించారు. ఈ ఆశీర్వాదానికి నేను మీ అందరికీ గౌరవంగా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.నీటిని పొదుపు చేసేందుకు మనం అన్ని ప్రయత్నాలు చేయాలి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
March 27th, 11:00 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. గత వారం మనందరిలో గర్వాన్ని నింపే ఒక ఘనతను సాధించాము. గత వారం భారతదేశం 400 బిలియన్ డాలర్ల అంటే 30 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి లక్ష్యాన్ని సాధించిందని మీరు వినే ఉంటారు. మొదటి సారి వింటే ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశమని అనిపిస్తుంది. కానీ ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువగా ఇది భారతదేశ సామర్థ్యానికి, భారతదేశ శక్తికి సంబంధించిన విషయం. ఒకప్పుడు భారతదేశం నుండి ఎగుమతుల విలువ 100 బిలియన్లు. కొన్నిసార్లు 150 బిలియన్లు, కొన్నిసార్లు 200 బిలియన్లు, ఇప్పుడు భారతదేశం 400 బిలియన్ డాలర్ల విలువ ఉండే ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో తయారయ్యే వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని దీని అర్థం. భారతదేశ సరఫరా గొలుసు రోజురోజుకు బలపడుతుందని కూడా దీని అర్థం. ఇందులో చాలా పెద్ద సందేశం కూడా ఉంది. కలల కంటే సంకల్పాలు పెద్దవి అయినప్పుడు దేశం గొప్ప అడుగులు వేస్తుంది. సంకల్పాల కోసం అహోరాత్రులు చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు ఆ సంకల్పాలు కూడా సాకారమవుతాయి. చూడండి.. వ్యక్తుల జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. కలలకంటే సంకల్పాలు, ప్రయత్నాలు పెద్దవిగా మారినప్పుడు విజయం దానంతటదే వస్తుంది.కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్‌లో 'బిప్లోబి భారత్ గ్యాలరీ' ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 23rd, 06:05 pm
పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగదీప్ ధంఖర్ గారు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, విక్టోరియా మెమోరియల్ హాల్‌తో సంబంధం ఉన్న ప్రముఖులందరూ, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, కళలు మరియు సంస్కృతిలో అనుభవజ్ఞులు, మహిళలు మరియు పెద్దమనుషులు!అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కోల్‌కాతా లోని విక్టోరియా స్మారక హాల్ లో విప్లవ భారత్ గ్యాలరీ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 23rd, 06:00 pm
“విప్లవ భారత్ చిత్ర ప్రదర్శనశాల”ను ఈ రోజు న అమరవీరుల సంస్మరణ దినం సందర్భం లో కోల్‌కాతా లోని విక్టోరియా స్మారక మందిరం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్, కేంద్ర మంత్రి శ్రీ జి.కిశన్ రెడ్డి పాల్గొన్నారు.శహీద్ దివస్ సందర్భం లో కోల్ కాతా లో గల విక్టోరియా మోమోరియల్ హాలు లోబిప్లొబీ భారత్ గేలరీ ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
March 22nd, 11:45 am
శహీద్ దివస్ సందర్భం లో, కోల్ కాతా లోని విక్టోరియా మెమోరియల్ హాల్ లో గల బిప్లొబీ భారత్ గేలరీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి నెల 23 వ తేదీ న సాయంత్రం 6 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. కార్యక్రమం కొనసాగే క్రమం లో అక్కడ హాజరైన జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.