బయో టెక్నాలజీలో అత్యాధునిక పరిశోధన, అభివృద్ధికి తోడ్పడేందుకు ‘బయో-రైడ్’ పథకం: ఆమోదం తెలిపిన మంత్రి మండలి

September 18th, 03:26 pm

డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ)కి సంబంధించిన ఒకే గొడుగు కింద ఉన్న రెండు పథకాలను విలీనం చేయాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలిలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 'బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ (బయో-రైడ్)' అనే ఒక కొత్త పథకం పేరుతో పాత విధానాలను విలీనం చేశారు. బయోమాన్యుఫ్యాక్చరింగ్, బయోఫౌండ్రీ పేరుతో రెండు కొత్త అంశాలను ఇందులో చేర్చారు.

న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో బయోటెక్ స్టార్టప్ ఎక్స్‌పో - 2022 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

June 09th, 11:01 am

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులందరూ, బయోటెక్ రంగానికి సంబంధించిన ప్రముఖులందరూ , భారతదేశం మరియు విదేశాల నుండి వచ్చిన అతిథులు , నిపుణులు , పెట్టుబడిదారులు , SMEలు మరియు స్టార్టప్‌లతో సహా పరిశ్రమ సహోద్యోగులందరూ , మహిళలు మరియు పెద్దమనుషులు !

‘బయోటెక్ స్టార్ట్-అప్ ఎక్స్ పో - 2022’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

June 09th, 11:00 am

బయోటెక్ స్టార్ట్-అప్ ఎక్స్ పో- 2022 ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ప్రారంభించారు. బయోటెక్ ఉత్పత్తుల కు చెందిన ఇ- పోర్టల్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారిలో కేంద్ర మంత్రులు శ్రీయుతులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, డాక్టర్ జితేంద్ర సింహ్, బయోటెక్ రంగం తో సంబంధం కలిగిన వర్గాలు, నిపుణులు, ఎస్ఎమ్ఇ లు మరియు ఇన్వెస్టర్ లు తదితరులు ఉన్నారు.

‘బయోటెక్ స్టార్ట్ అప్ఎక్స్ పో - 2022’ ను జూన్ 9వ తేదీ నాడు ప్రగతి మైదాన్ లో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

June 07th, 06:44 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘బయోటెక్ స్టార్ట్-అప్ ఎక్స్ పో - 2022’ ను జూన్ 9వ తేదీ న ఉదయం 10:30 గంటల కు న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో ఆయన ప్రసంగ కార్యక్రమం కూడా ఉంటుంది.