భారత గ్రామీణ మహోత్సవ్ లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

January 04th, 11:15 am

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ గారు, ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులైన నాబార్డ్ ఉన్నత కార్యవర్గ సభ్యులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, సహకార బ్యాంకులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు), ఇతర విశిష్ట అతిథులు, సోదర సోదరీమణులారా,

PM Modi inaugurates the Grameen Bharat Mahotsav 2025

January 04th, 10:59 am

PM Modi inaugurated Grameen Bharat Mahotsav in Delhi. He highlighted the launch of campaigns like the Swamitva Yojana, through which people in villages are receiving property papers. He remarked that over the past 10 years, several policies have been implemented to promote MSMEs and also mentioned the significant contribution of cooperatives in transforming the rural landscape.

రోజ్‌గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాల్గొన్న ప్రధాని: 71,000కు పైగా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

December 23rd, 11:00 am

మంత్రిమండలిలో నా సహచరులు, దేశంలో వివిధ ప్రాంతాల ప్రముఖులు, నా యువ మిత్రులారా.

రోజ్‌గార్ మేళా ద్వారా ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో నూతనంగా నియమితులైన 71,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను అందజేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

December 23rd, 10:30 am

ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో రోజ్‌గార్ మేళా ద్వారా నియామకాలు పొందిన 71,000 మందికి పైగా యువతకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు నియామకపత్రాలను అందించి, వారిని ఉద్దేశించి ప్రసంగించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్న ప్రధానమంత్రి అంకితభావానికి ఈ రోజ్ గార్ మేళా అద్దం పడుతుంది. జాతి నిర్మాణం, స్వయం సాధికారత సాధించేందుకు తోడ్పడేలా యువతకు అర్థవంతమైన అవకాశాలను ఇది అందిస్తుంది.

Double-engine Governments at the Centre and state are becoming a symbol of good governance: PM in Jaipur

December 17th, 12:05 pm

PM Modi participated in the event ‘Ek Varsh-Parinaam Utkarsh’ to mark the completion of one year of the Rajasthan State Government. In his address, he congratulated the state government and the people of Rajasthan for a year marked by significant developmental strides. He emphasized the importance of transparency in governance, citing the Rajasthan government's success in job creation and tackling previous inefficiencies.

రాజస్థాన్ ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా

December 17th, 12:00 pm

‘ఏక్ వర్ష్ - పరిణామ్ ఉత్కర్ష్: రాజస్థాన్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంవత్సరం పూర్తి’ పేరుతో ఈ రోజు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకొన్నందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికీ, ఆ రాష్ట్ర ప్రజలకూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన లక్షలాది మంది ప్రజల ఆశీర్వాదాల్ని అందుకోవడం తనకు దక్కిన సౌభాగ్యమని ఆయన అన్నారు. రాజస్థాన్‌లో అభివృద్ధి పనులకు ఒక కొత్త దిశను, జోరును ఇవ్వడానికి ప్రయత్నాలు చేసినందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రినీ, ఆయన జట్టునీ శ్రీ మోదీ ప్రశంసించారు. రాబోయే అనేక సంవత్సరాల్లో అభివృద్ధికి ఈ మొదటి సంవత్సరం ఒక బలమైన పునాదిగా మారిందని అన్నారు. ఈ రోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రభుత్వానికి సంవత్సర కాలం పూర్తి అవడం ఒక్కటే కాకుండా రాజస్థాన్ అభివృద్ధి ఉత్సవంతోపాటు రాజస్థాన్ ఉజ్వలంగా మెరిసిపోతూ ఉండడానికి కూడా సంకేతంగా నిలిచిందని ఆయన అన్నారు. ఇటీవల రైజింగ్ రాజస్థాన్ సమ్మిట్ 2024 సందర్భంగా తాను ఇక్కడ పర్యటించిన సంగతిని శ్రీ మోదీ గుర్తు చేస్తూ.. ప్రపంచమంతటి నుంచీ ఎంతో మంది పెట్టుబడిదారులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. ఈ రోజు రూ.45,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు నీటి విషయంలో రాజస్థాన్ ఎదుర్కొంటున్న అడ్డంకుల్ని తొలగించేందుకు సముచిత పరిష్కారాన్ని అందిస్తాయనీ, భారతదేశంలో చాలా రాష్ట్రాలతో చక్కని అనుసంధాన సదుపాయాన్ని కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా రాజస్థాన్‌ను నిలబెడతాయని కూడా ఆయన అన్నారు. ఈ అభివృద్ధి పనులు మరింత మంది పెట్టుబడిదారులను ఆహ్వానించి, అనేక ఉద్యోగావకాశాలను కల్పించి, పర్యాటక రంగాన్ని బలపరచడంతోపాటు రాజస్థాన్‌లో రైతులకు, మహిళలకు, యువతకు ప్రయోజనాలను అందిస్తాయని ప్రధాని అన్నారు.

హర్యానాలోని పానిపట్‌లో అభివృద్ధిపనుల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగానికి అనువాదం

December 09th, 05:54 pm

హర్యానా గవర్నరు బండారు దత్తాత్రేయ గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రజాదరణ పొందిన హుషారైన నేత శ్రీ నాయబ్ సింగ్ గారు, కేంద్ర మంత్రిమండలిలో నా తోటి సభ్యులైన గౌరవనీయురాలు నిర్మలా సీతారామన్ గారు, ఈ భూమి పుత్రుడు, పార్లమెంటు సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి, అంతేకాకుండా ప్రభుత్వంలో నా సహచరుడైన శ్రీ మనోహర్ లాల్ గారు, శ్రీ కృష్ణ పాల్ గారు, హర్యానా ప్రభుత్వంలో మంత్రులు శృతి గారు, ఆర్తి గారు, ఎంపీలు, ఎమ్ఎల్ఏలు, దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ కేంద్రాలతో అనుబంధం ఉన్న సహచరులందరూ.. నా ప్రియ సోదరులు, సోదరీమణులారా.

ఎల్ఐసీ బీమా సఖి యోజన ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

December 09th, 04:30 pm

మహిళా సాధికారతను, ఆర్థిక రంగంలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చిన ‘బీమా సఖి యోజన’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. హర్యానాలోని పానిపట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. అలాగే కర్నాల్ లోని మహారాణా ప్రతాప్ హార్టీకల్చర్ విశ్వవిద్యాలయ ప్రధాన క్యాంపస్‌ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ ప్రసంగిస్తూ.. మహిళా సాధికారత దిశగా ఈ రోజు మరో ముందడుగు వేశామని అన్నారు. మన గ్రంథాల్లో 9ని పవిత్రమైన అంకెగా భావిస్తారు. నవరాత్రి సమయంలో నవ దుర్గలుగా తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ రోజు 9వ తేదీనే కావడం విశేషం. ఈ రోజు నారీశక్తిని ఆరాధిస్తున్న రోజు కూడా అని ఆయన వివరించారు.

డిసెంబరు 9న రాజస్థాన్, హర్యానాల్లో ప్రధానమంత్రి పర్యటన

December 08th, 09:46 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబరు 9న రాజస్థాన్, హర్యానాల్లో పర్యటించనున్నారు. జైపూర్ కు ఆయన ఉదయం సుమారు పదిన్నర గంటలకు జైపూర్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (జేఈసీసీ)లో రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఆ తరువాత ప్రధాని పానిపట్ కు వెళ్తారు. మధ్యాహ్నం దాదాపు 2 గంటలకు, ఆయన ఎల్ఐసీ బీమా సఖి యోజనను ప్రారంభిస్తారు. దీంతో పాటు మహారాణా ప్రతాప్ ఉద్యాన శాస్త్ర విశ్వవిద్యాలయ ప్రధాన కేంపస్ నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన కూడా చేస్తారు.