PM Modi meets the Amir of Kuwait
December 22nd, 05:08 pm
Prime Minister Shri Narendra Modi met today with the Amir of Kuwait, His Highness Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al-Sabah. This was the first meeting between the two leaders. On arrival at the Bayan Palace, he was given a ceremonial welcome and received by His Highness Ahmad Al-Abdullah Al-Ahmad Al-Sabah, Prime Minister of the State of Kuwait.భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడిన నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ డిక్ స్కూఫ్
December 18th, 06:51 pm
నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ డిక్ స్కూఫ్ భారత ప్రధానమంత్రి శ్ర నరేంద్ర మోదీతో ఫోన్ లో సంభాషించారు.భారతదేశం – శ్రీలంక సంయుక్త ప్రకటన: ఒక ఉమ్మడి భవిత కోసం భాగస్వామ్యాలను ప్రోత్సహించడం
December 16th, 03:26 pm
శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనూర కుమార దిసనాయక 2024 డిసెంబరు 16న భారతదేశానికి ఆధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంగా న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. వారిద్దరూ సమగ్ర, ఫలప్రద చర్చలు జరిపారు.భూటాన్ రాజు, రాణి భారత పర్యటన సందర్భంగా స్వాగతం పలికిన ప్రధానమంత్రి మార్చ్ 2024 భూటాన్ అధికారిక పర్యటన సందర్భంగా తనకు లభించిన అపూర్వ ఆతిథ్యాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని భారత్-భూటాన్ విలక్షణ భాగస్వామ్య బలోపేతం కోసం కృషి చేస్తామన్న ఇరువురు నేతలు
December 05th, 03:42 pm
భారత పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ఇరువురికీ స్వాగతం పలికారు. మార్చ్ 2024లో భూటాన్ అధికారిక పర్యటన సందర్భంగా నేపాల్ ప్రభుత్వం, ప్రజలు తనకు అపూర్వ ఆతిథ్యాన్ని అందించారని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు.కువైట్ విదేశాంగ మంత్రితో ప్రధాని భేటీ
December 04th, 08:39 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కువైట్ విదేశాంగ మంత్రి శ్రీ అబ్దుల్లా అలీ అల్ - యాహ్యా ఈ రోజు సమావేశమయ్యారు.సురినామ్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ
November 21st, 10:57 pm
గయానా దేశం జార్జిటౌన్ లో భారత్-కరికామ్ రెండవ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సురినామ్ దేశాధ్యక్షుడు శ్రీ చంద్రికాపర్సాద్ సంతోఖీతో నవంబర్ 20వ తేదీన భేటీ అయ్యారు.గ్రెనడా ప్రధానమంత్రితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 21st, 10:44 pm
గయానా దేశం జార్జిటౌన్ లో భారత్-కరికామ్ రెండో శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో, నవంబర్ 20వ తేదీన గ్రెనడా ప్రధానమంత్రి శ్రీ డికన్ మిచెల్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.PM Modi meets with Prime Minister of Antigua and Barbuda
November 21st, 09:37 am
PM Modi met Antigua and Barbuda PM Gaston Browne during the 2nd India-CARICOM Summit in Guyana. They discussed trade, investment, and SIDS capacity building. PM Browne praised India’s 7-point CARICOM plan and reiterated support for India’s UN Security Council bid.బహమాస్ ప్రధానితో ప్రధానమంత్రి భేటీ
November 21st, 09:25 am
బహమాస్ ప్రధాని శ్రీ ఫిలిప్ డేవిస్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత్-కారికోమ్ శిఖరాగ్ర సమావేశాన్ని గయానాలోని జార్జ్‌టౌన్‌లో నవంబరు 20న నిర్వహించిన సందర్భంగా వారిరువురు సమావేశమయ్యారు. ప్రధానమంత్రులు ఇరువురూ సమావేశం కావడం ఇదే మొదటిసారి.బార్బడోస్ ప్రధానితో ప్రధానమంత్రి భేటీ
November 21st, 09:13 am
బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్‌లీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత్-కేరికోమ్ శిఖరాగ్ర సమావేశాన్ని గయానాలోని జార్జ్‌టౌన్‌లో నవంబరు 20న నిర్వహించిన సందర్భంగా వారిరువురు సమావేశమయ్యారు. భారత- బార్బడోస్‌ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ఘాటించడంతోపాటు ఆ సంబంధాలను బల పరచడానికి ఇద్దరు నేతలకు ఒక అవకాశాన్ని ఈ ఉన్నతస్థాయి సమావేశం అందించింది.గయానా అధ్యక్షుడితో భారత ప్రధాని అధికారిక చర్చలు
November 21st, 04:23 am
జార్జ్ టౌన్ లో ఉన్న స్టేట్ హౌజ్ లో డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. స్టేట్ హౌజ్ కు చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు అలీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గౌరవ వందనాన్ని స్వీకరించారు.చిలీ దేశాధ్యక్షుడితో ప్రధానమంత్రి శ్రీ మోదీ భేటీ
November 20th, 08:36 pm
బ్రెజిల్ దేశ రాజధాని రియో డి జనీరోలో ఏర్పాటైన జి-20 సమావేశాల నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న చిలీ దేశపు అధ్యక్షుడు శ్రీ గాబ్రియల్ బోరిక్ ఫాంట్ తో తొలిసారి భేటీ అయ్యారు.అర్జెంటీనా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ మోదీ
November 20th, 08:09 pm
రియో డి జనీరో లో జరుగుతున్న జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న అర్జెంటీనా (ఆర్జెంటీన్ రిపబ్లిక్) అధ్యక్షుడు శ్రీ జేవియర్ మిలే తో సమావేశమయ్యారు.బ్రెజిల్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ
November 20th, 08:05 pm
రియో డి జనీరో లో జరుగుతున్న జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాకియో లూలా ద సిల్వా తో సమావేశమయ్యారు. శ్రీ లూలా ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని, జి-20, ఐబీఎస్ఏ (భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా కూటమి) అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలియజేశారు. పేదరికం, క్షుద్బాధల నిర్మూలన కోసం ప్రపంచ స్థాయి సహకార సమితిని ప్రారంభించాలన్న శ్రీ లూలా యోచన పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీ మోదీ, సంస్థకు భారత్ సంపూర్ణ మద్దతునిస్తుందని వెల్లడించారు. మూడు దేశాల జి-20 ప్రత్యేక బృందం (ట్రోయికా) సభ్య దేశంగా బ్రెజిల్ జి-20 ఎజెండాకు శ్రీ మోదీ సంపూర్ణ మద్దతును తెలిపారు. జి-20 కార్యాచరణ పత్రంలో సుస్థిరాభివృద్ధి, ప్రపంచ పాలనలో సంస్కరణలు వంటి లక్ష్యాలను పేర్కొనడం సహా అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకు ప్రాముఖ్యాన్నివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వచ్చే యేడాది బ్రెజిల్ చేపట్టనున్న ‘బ్రిక్స్’ సదస్సు, ‘కాప్-30’ అధ్యక్ష బాధ్యతలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ మోదీ, బ్రెజిల్ కు భారత్ సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలితో ప్రధానమంత్రి భేటీ
November 19th, 08:34 am
రియో డి జెనీరో లో జరుగుతున్న జి-20 సమావేశాల నేపథ్యంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలు జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. 2024 జూన్, ఇటలీలోని ‘పూలీయా’ లో జార్జియా మెలోనీ అధ్యక్షతన ఏర్పాటైన జి-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన భేటీ అనంతరం ఇరువురు నేతల మధ్య జరిగిన నేటి సమావేశం గత రెండేళ్ళలో అయిదోది. ఎన్నో సమస్యల మధ్య చేపట్టిన జి-7 అధ్యక్ష పదవికి సమర్ధమైన నేతృత్వం అందిస్తున్నందుకు శ్రీ మోదీ ఇటలీ ప్రధానమంత్రి మెలోనీకి అభినందనలు తెలియజేశారు.PM Modi meets with President of Indonesia
November 19th, 06:09 am
PM Modi and Indonesia’s President Prabowo Subianto met at the G20 Summit in Rio. They discussed strengthening their Comprehensive Strategic Partnership, focusing on trade, defence, connectivity, tourism, health, and people-to-people ties. Both leaders agreed to celebrate 75 years of diplomatic relations in 2024. They also exchanged views on global and regional issues, highlighting the concerns of the Global South and reviewed cooperation within G20 and ASEAN.పోర్చుగల్ ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
November 19th, 06:08 am
బ్రెజిల్ లోని రియో డి జనీరో లో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సందర్భంగా పోర్చుగల్ ప్రధాని శ్రీ లుయిస్ మోంటెనెగ్రో తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ఇది ఈ నేతలిద్దరికి తొలి సమావేశం. గత ఏప్రిల్ లో పదవీ బాధ్యతలను చేపట్టిన శ్రీ మోంటెనెగ్రోను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. భారతదేశానికి, పోర్చుగల్ కు మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి, విస్తరింపచేసుకోవడానికి కలసి పని చేయాలని శ్రీ మోదీ అన్నారు. మూడో సారి అధికారంలోకి వచ్చిన శ్రీ నరేంద్ర మోదీకి శ్రీ మోంటెనెగ్రో అభినందనలు తెలియజేశారు.నార్వే ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
November 19th, 05:44 am
బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సందర్భంగా నార్వే ప్రధాని శ్రీ జోనాస్ గహర్ స్టోర్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు.బ్రిటన్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ మోదీ భేటీ
November 19th, 05:41 am
ద్వైపాక్షిక సంబంధాల వృద్ధి పట్ల సంతృప్తి వెల్లడించిన ఇరువురు నేతలు, భారత-బ్రిటన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్ఠపరచాలన్న ఇరుదేశాల నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, నూతన సాంకేతికతలు, పరిశోధన, ఆవిష్కరణ, పర్యావరణ హిత పెట్టుబడులు, ఇరుదేశాల ప్రజల మధ్య స్నేహ సంబంధాల వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని నేతలు నిర్ణయించారు. సమావేశం సందర్భంగా పరస్పర ఆసక్తి గల అంశాలు సహా ముఖ్యమైన అనేక అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలను ప్రధానులు ఇద్దరూ చర్చించారు.ఫ్రాన్స్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ
November 19th, 05:26 am
2047 ప్రణాళిక, ఇతర ద్వైపాక్షిక ప్రకటనల్లో తెలిపినట్లుగా భారత్ - ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ద్వైపాక్షిక సహకారాన్ని, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో తమ నిబద్ధతను ఇరువురు నేతలు ఈ భేటీలో పునరుద్ఘాటించారు. రక్షణ, అంతరిక్షం, పౌర అణువిద్యుత్ తదితర వ్యూహాత్మక విభాగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని ప్రశంసించారు. దీనిని వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి దిశగా నడిపించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. భారతదేశ జాతీయ మ్యూజియం ప్రాజెక్టులో సహకార పురోగతిని సైతం వారు సమీక్షించారు.